టీచర్ కోసం 10 148

అలా తెరిచి చూసిన మేడమ్ ఒక్కసారిగా తల దించుకుంటు తలుపేసింది.. నేను మేడమ్ ను చూసి ఏమైంది అన్నా ? మేడమ్ చెప్పలేక నువ్వే చూడు అంది. నేను ఏమైందా అని తలుపు తెరిచి చూసా చూస్తే ఇంకేంటి ? హారిక సిద్దు ఒకరి మీద ఒకరు పోటీగా ముద్దు పెట్టుకొంటూ కనిపించారు.. అది చూడగానే ఇక వీళ్ళు మనల్ని వదిలేలా లేరు అని అనుకుంటూ మేడమ్ వంక చూసి ఇప్పుడేం చేద్దాం అని అన్నా.. దానికి మేడమ్ ఏమో అన్నట్లుగా చూసింది..
నేను మేడమ్ ను చూస్తూ నువ్వు ఇప్పుడు బయటకు వెళ్తే వాడు లోపలికి వస్తాడు అప్పుడు నేను ఇక్కడ ఉండడం చూస్తాడు.. అదే నేను ఇక్కడే ఉంటే కాసేపట్లో మామ బయటకు వస్తాడు చూసి ఎక్కడికెల్లావ్ అని ఆరా తీసి సిద్దు గాడితో నేను ఇక్కడ ఉన్నా అని చెప్పేస్తాడు.. ఇప్పుడెలా అని అంటూ ఆలోచిస్తూ ఉంటే ఇంకో ఐడియా వచ్చింది.. వెంటనే మేడమ్ తో నేను ఇప్పుడు హారిక కు కాల్ చేస్తా వాళ్ళు ఒకవేళ ఎత్తకుంటే నువ్వు తలుపు తెరిచి వాళ్ళతో ఎంటి ఫోన్ వస్తుంటే ఎత్తడం లేదు అని అరువు అప్పుడైనా ఎత్తే చన్సేస్ ఉన్నాయి అనగానే సరే అని అంది.
నేను వెంటనే హారిక కు ఫోన్ చేశా అనుకున్నట్లు గానే వాళ్ళు ఎత్తలేదు.. మేడమ్ కొంచెం సిగ్గు పడుతూనే తలుపు తెరిచి వాళ్ళను చూసింది. వాళ్లు అటు తిరిగి ముద్దు పెట్టుకుంటున్నారు. అది చూసి ఏరా ఫోన్ మోగుతుంది వినపడట్లేదా అంది ఒక్కసారిగా.. దాంతో వెంటనే వాళ్ళు తేరుకుని మేడమ్ వైపు చూసారు. వెంటనే మేడమ్ ఏంట్రా హాల్ లో మీ పనులు పోయి పక్కన చేసుకోండి అని అంది వాళ్ళను పక్కకు పంపించడానికి దానికి వాళ్ళు సిగ్గు పడుతు లేచి అక్కడ నుండి వెళ్లి అవతల సోఫా లో కూర్చున్నారు అది చూసి మేడమ్ నిట్టూరుస్తూ హారిక తో ఆ ఫోన్ మోగుతుంది కాస్త చూడొచ్చు కదా అంది దాంతో హారిక వెంటనే ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసింది..
వెంటనే మేడమ్ తలుపు దగ్గరకు వేసి నన్ను చూస్తూ సక్సెస్స్ అంటూ చిన్నగా నవ్వింది.. ఫోన్ ఎత్తిన హారిక చెప్పు రా అని అనడం తో నేను హా హారిక ఒక్కసారి మీరిద్దరూ అని చెప్తూ ఉండగానే సిద్దు గాడు లేచి టివి ఆన్ చేశాడు అంతే వెంటనే నేను కాల్ కట్ చేసేసా..
మేడమ్ ఎందుకు కట్ చేశావ్ అని అడిగింది. నేను బెడ్రూం లోకి వినపడుతున్న టివి సౌండ్ గురించి చెప్పా.. మేడమ్ అవునులే ఇప్పుడు హారిక తో మాట్లాడే టప్పుడు ఫోన్ లో ఈ సౌండ్ వినిపించి డౌట్ వస్తుందనా అని అంటూ వెళ్లి నిట్టూరుస్తూ మంచం మీద కూర్చుంది..
హారిక తిరిగి నాకు ఫోన్ చేయడం చూసి ఇక ఓపిక లేక ఎత్తకుండా వొడిలేశా.. ఆ తరువాత మంచం మీద కూర్చున్న మేడమ్ వంక చూస్తూ ఎమ్ చేద్దాం అని అన్నా.. అలా అంటూ ఉండగా ఎదో డౌట్ వచ్చి ఫోన్ లో టైమ్ చూసా.. టైమ్ చూసేసరికి ఇంకో ఐడియా వచ్చింది వెంటనే హారికకు ఒక మెసేజ్ పెట్టా..
నేను ఎదో చేస్తుండడం చూసి మేడమ్ నా దగ్గరకు వచ్చి ఏంట్రా అని అంది. నేను మేడమ్ ను చూస్తూ ఇంకో పదైదు నిమిషాల తరువాత ఇద్దరూ బయటకు వెళ్తారు అంతవరకు నేను ఇక్కడ ఉంటే చాలు అని అన్నా. దానికి మేడమ్ ఎలా అంది. దానికి నేను ఎమ్ లేదు నిన్న మేము అనుకున్న ప్రోగ్రాం ప్రకారం ఇంకో పడైదు నిమిషాలకు పార్క్ దగ్గర ఉండాలి నేను హారికకు డైరెక్ట్ గా అక్కడకే వచ్చేస్తా అని మెసేజ్ పెట్టా.. తను కూడా ఓకే అంది. సో నేను ఇక్కడ పదైదు నిమిషాలు ఉంటే చాలు అని అంటూ ఉండగా బాత్రూం లో నుండి నీళ్ళ శబ్దం వినిపించింది..
వెంటనే మేడమ్ కంగారుగా ఏమే స్నానం అయిపోయిందా అంది. దానికి లోపల నుండి మామ లేదు జుట్టు కు రంగు పూసుకుంటున్న కొంచెం లేట్ అవుతుంది ఎమ్ ఏమైనా పనుందా ? అని అన్నాడు. దానికి మేడమ్ హమ్మయ్య అనుకుంటూ ఎమ్ లేదులెండి తీరిగ్గా అవ్వగొట్టుకొండి అని అంటూ నావైపు ఓకే అన్నట్లుగా చూసింది..

1 Comment

  1. Please continue very good bt good ending evvu please

Comments are closed.