టీచర్ కోసం 10 148

బయట నుండి వాడు భరత్ గాడు ఎక్కడికైనా వెళ్తున్నా అని చెప్పాడా అని అన్నాడు. దానికి మేడమ్ ఏమో రా తెలీదు అని అంది. దాంతో వాడు ఎక్కడికెల్లాడబ్బా అని ఎదో అనుకుంటూ కాల్ కూడా కలవట్లేదు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు. వాడలా వెళ్ళగానే అప్పుడు గుర్తొచ్చింది నా ఫోన్ సైలెంట్ లో లేదు అని వెంటనే నేను అలెర్ట్ అయ్యి నా ఫోన్ నీ తీసి సైలెంట్ లో పెట్టబోయా కానీ అంతలోనే అది అనుకోకుండా జారి కింద పడింది.. అంతే ఒక్కసారిగా మేడమ్ భయంగా ఇటు వైపు చూసింది..
అలా చూడగా నేను అక్కడే దాక్కుని ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ భరత్ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అంటూ పక్కనే ఉన్న పాత నైటీ ని గబగబా వేసుకుంటూ నా దగ్గరకి వచ్చింది. నేను తనకు ఎదో చెప్పబోతుండగా అంతలో బయట నుండి ఎవరో వస్తున్న చప్పుడు వినిపించింది..

ఆ చప్పుడు వినగానే నన్ను ఎదో అనబోతున్న మేడమ్ ఒక్కసారిగా ఆగిపోయి నన్ను సైలెంట్ గా ఉండమని సైగ చేస్తూ వస్తుంది ఎవరా అన్నట్లు తలుపు వైపు చూసింది.
అంతలో సంధ్యా తలుపు తెరువు అంటూ తలుపు శబ్దం అయ్యింది.. అంతే వచ్చింది మామ అని అర్దం కాగానే ఒక్కసారిగా ఇద్దరం షాక్ అయిపోయి నిల్చున్నాం…
అంతలో మామ బయట నుండి మళ్ళీ పిలిచాడు..
దాంతో వెంటనే మేడమ్ తేరుకుని కంగారు కంగారుగా చుట్టూ చూస్తూ నన్ను ఎక్కడ దాచాలో తెలీక కంగారుగా పడుతుంటే నేను ఇందాక దాక్కున్న చోటు లో దాక్కుందాం అని చూసా.. కానీ అది ఇప్పుడు కష్టం అని అనిపించి ఎక్కడ దాక్కుందామ్ అని చుట్టూ చూసా.. అంతలో బయట నుండి మామ సంధ్యా ఉన్నావా ? ఎమ్ చేస్తున్నావ్ అంటూ మళ్ళీ పిలిచాడు.
దాంతో మేడమ్ వెంటనే మామ కు రెస్పాండ్ అవుతూ హా ఉన్నానండి ఒక్క నిమిషం స్నానం చేస్తున్నా అని అంటూ తొందరలో ఎదో చెప్పేసింది..
అలా చెప్పేసి కంగారుగా చుట్టూ చూసి ఇక లాభం లేదు అని నన్ను బాత్రూం లోకి నెట్టుతూ లోపలికి పో అంది. నేను ఎమ్ చేయాలో తెలీక వెంటనే బాత్రూం లోకి వెళ్ళా..
అలా వెళ్ళాక మేడమ్ తను వేసుకున్న నైటీ నీ బ్రా ను తీసేస్తూ వొంటి మీద టవల్ సరిగ్గా చుట్టుకుని అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న దానిలా కవర్ చేస్తూ వెళ్లి తలుపు తెరిచింది.
తలుపు తెరవగానే మామ మేడమ్ ను మేడమ్ కట్టుకున్న టవల్ ను చూస్తూ స్నానం అయిపోయిందా ? అని అడిగాడు దానికి మేడమ్ అవునండీ ఇప్పుడే అయిపోయింది అని అంటూ మామ రావడానికి లోపలికి దారి ఇచ్చింది..
దాంతో మామ బెడ్రూం లో కి వస్తూ రావడం రావడమే పంచే, చొక్కా విప్పడం మొదలెట్టాడు వెంటనే మేడమ్ ఏంటి ? విప్పేస్తున్నారు అని అంది.. దానికి మామ మంచం పై ఉన్న టవల్ ను తీసుకుంటూ స్నానానికి వెళ్తున్నా అన్నాడు. అంతే బాత్రూం లో ఉన్న నాకు ఒక్కసారిగా భయం వేసింది.. మామ టవల్ తీసుకుని బాత్రూం దగ్గరకు వచ్చేస్తున్నాడు..
ఇక ఎమ్ చేయాలో తెలీక ఏదోకటి చెప్దామని అనుకుంటూ ఉండగా అంతలో మామ తలుపు గడె తీసాడు.. గడె తీసి తలుపు తెరవబోతుందగా బయట నుండి మేడమ్ ఒక్క నిమిషం అంటూ మామను ఆపింది.. అలా ఆపేసరికి మామా మేడమ్ వైపు ఎంటి అన్నట్లుగా చూసాడు. దాంతో వెంటనే మేడమ్ బాత్రూం డోర్ దగ్గరకు వస్తూ ఎమ్ లేదు బట్టలు నానపెట్టాను పిండేసి వస్తా అని అంటూ మామ రెస్పాన్స్ కూడా చూడకుండా క్షణాల్లో బాత్రూం తలుపు తెరిచి లోపలికి వచ్చేసింది.. తనలా క్షణాల మీద చేయడం చూసి మామ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ నేను చేశాక పిండుకో వచ్చు కదా అని అంటూ చిన్నగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు..
మామ అలా వెళ్ళగానే ఒక్కసారిగా ఇద్దరం ఊపిరి పీల్చుకున్నాం..

1 Comment

  1. Please continue very good bt good ending evvu please

Comments are closed.