టీచర్ కోసం 10 148

ఇక స్టూల్ వేసుకోవాల్సిందే అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టీ స్టూల్ తీసుకుని పైకి ఎక్కాడు అలా ఎక్కి మామ నైటీ తీస్తూ ఉండడం.. నేను మామ దృష్టి లో పడకుండా మెల్లగా బాత్రూం లో నుండి బయటకు రావడం జరిగిపోయాయి..
అక్కడ మామ కబోర్డు లో నైటీ ని వెతుకుతూ ఎక్కడే ? లేదు అని అన్నాడు నేను మనసులో అక్కడ ఉంటేనేగా అని అనుకుంటూ డోర్ దగ్గరకు పరిగెత్తా.. మేడమ్ అబ్బా చూడండి అక్కడే ఉంది అంటూ మామ ను డైవర్ట్ చేస్తూ డోర్ దగ్గరకు వెళ్తున్న నన్ను చూసింది. నేను తన వంక చూసి గాల్లో ఒక కిస్ పెట్టి డోర్ చప్పుడు కాకుండా తీసి బయటకు వెళ్ళా…
అలా బయటకు అడుగు పెట్టానో లేదో అప్పుడే హారిక సిద్దు ఇటు వైపు రావడం కనిపించింది. అంతే వెంటనే సిద్దు గాడికి నేను ఈ రూం లో నుండి రావడం కనిపిస్తే డౌట్ వస్తుంది అని అనుకుంటూ ఎక్కడకు వెళ్ళాలో తెలీక మళ్ళీ మేడమ్ బెడ్రూం లోకి వెళ్ళా.. ఇప్పుడే వెళ్లి మళ్ళీ వెనక్కు రావడం చూసి మేడమ్ ఎంటి అన్నట్లుగా సైగ చేసింది. దానికి నేను సిద్దు గాడు ఉన్నాడు బయట అని సైగ చేస్తూ ఉంటే అంతలో అక్కడ కబోర్డు లో లేని నైటీ కోసం వెతుకు తున్న మామ చికాకుగా అబ్బా ఇక్కడ లేదే అని అంటూ ఇటు వైపు చూడబోయాడు. కానీ అంతలోనే నేను ఫాస్ట్ గా వెళ్లి అక్కడే మంచం దాపున దాక్కున్నా..
అలా దాక్కోడం చూసి మేడమ్ తల మీద కొట్టుకుంటూ ఎదో చెప్పాలని చూసింది కానీ అంతలోనే సిద్దు గాడు తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు వెనుకే హారిక కూడా ఉంది.
అంతే వాడు రాగానే నేను ఇక దొరికి పోయా అనుకుంటూ తల కొట్టుకున్నా..
అయినా ఇంకా ప్రయత్నిస్తూ మంచం కు ఆనుకుని కూర్చున్నా వాళ్లకు కనిపించక కుండా. వాళ్ళు కానీ కొద్దిగా ఇటు వైపు వస్తె మాత్రం నేను కనిపిస్తా..
అంతలో సిద్దు గాడు కబోర్డు లో నైటీ కోసం వెతుకు తున్న మామ తో నాన్న భరత్ గాన్ని ఏమైనా చూసావా అని అడిగాడు.
దానికి మామ ఎమ్ అన్నాడు. దానికి వీడు ఎమ్ లేదు పొద్దున నుండి కనిపించడం లేదు తొమ్మిది గంటలకు బయటకు వెళ్దాం అని ప్రోగ్రాం పెట్టుకున్నాం కానీ వాడి జాడే లేదు అని అనగానే మామ ఏమో రా తెలీదు బయటకు వెల్లాడేమో లే అంటూ అయినా ఫోన్ చేయకూడదా అని అన్నాడు.
దానికి హారిక ట్రై చేస్తున్నాం అంకుల్ కానీ తగలడం లేదు అని అంది ఇంకోసారి ఫోన్ చేస్తూ.. తనలా ఫోన్ చేస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది నా ఫోన్ ఇంకా సైలెంట్ లో పెట్టలేదు అని..
అంతే వెంటనే నా ఫోన్ తీసుకుని సైలెంట్ పెట్టాబోయా కానీ అప్పుడే ఫోన్ వచ్చింది హారిక నుండి..
అంతే ఒక్కసారి గుండె జారి నట్లు అయ్యింది..

మామూలుగా ఫోన్ వచ్చిన వెంటనే నా రింగ్ టోన్ కొద్దిగా లేట్ గా స్టార్ట్ అవుతుంది అది స్టార్ట్ కావడానికి ఇంకో సెకండ్ ఉండే లోపలే ఆ ఫోన్ ను సైలెంట్ చేసేసా.. అలా చేసేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ మళ్ళీ ఇంకో సారి కాల్ చేస్తుందేమో అని వెంటనే నేను బయట ఉన్న మళ్ళీ కాల్ చేస్తా అని మెసేజ్ పంపించ.. అలా పంపించి మొబైల్ జోబిలో పెట్టుకొంటూ ఉండగా అప్పుడే సిద్దు గాడు ఎక్కడకు పోయాడో ఏంటో అని అంటూ నా వైపు రాబోయాడు.. అంతలో హారిక నేను పెట్టిన మెసేజ్ చూసి బయట ఉన్నాడంట రా మళ్ళీ కాల్ చేస్తా అని మెసేజ్ చేసాడు అని అంది. దానికి సిద్దు గాడు బయట నా ? ఎక్కడా ? అంటూ నా వైపు వస్తూ
మంచం పక్కనే దాక్కున్న నన్ను చుడబోయాడు…

1 Comment

  1. Please continue very good bt good ending evvu please

Comments are closed.