యుద్ధ నీతి 3 86

వర్షం వల్ల పూర్తిగా తెల్లవారినా ఆకాశం మేఘావృతమై వాతావరణం మబ్బు గానే ఉంది.
ఉదయం ఎనిమిది కావస్తుండగా రైన్ కోట్ లాంటిది వేసుకొని హవ్యక్ ఉరుకుల పరుగులతో ఇంటికొచ్చాడు. ఇంటికి తాళం వేసుంది. ఓ మూల అమ్మ ముడుచుకొని ఉంది. ఆశ్చర్యంగా చూస్తూ అమ్మా అంటూ దగ్గరకొచ్చాడు.
వాడిని చూడగానే మాన్వితకు ఏడుపు ఆగలేదు. బోరుమని ఏడ్చేసింది. హవ్యక్ ఆందోళంగా దిక్కులు చూస్తూ ఏమయ్యిందమ్మా అంకులేరీ అంటూ అడిగాడు.
మాన్వితకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏమని చెప్పగలదు. తాను కాలెత్తడానికి ఒప్పుకొని చివర్లో మనసొప్పక పోవడం వల్ల అంతా చెడగొట్టుకున్నాని చెప్పగలదా? అందుకే వాడు ఎంత అడిగినా ఏడుస్తూ ఉండిపోయిందే కాని ఏమీ చెప్పలేదు.
అంతలో దూరం నుండి స్వీకృత్ వస్తూ కనిపించగానే హవ్యక్ పరిగెత్తుకెళ్ళి అకుల్ అమ్మ ఎందుకేడుస్తోంది అని అడిగాడు. స్వీకృత్ కు ఆమె ఇంకా ఏమీ చెప్పలేదని అర్థం అయ్యింది.
సారీ హవ్యక్ ఆ విశయం మీ అమ్మనే అడుగు.
అడిగా అంకుల్ తనేం చెప్పడం లేదు.ఊరికే ఏడుస్తోంది.
సరే ఇంటికెళదాం పద, ఇంటిలో మాటాడుకొందాం అంటూ దారితీసాడు. ఆమె వైపు గుర్రుగా చూసి తాళం తీసి లోపలెకెళ్ళాడు. హవ్యక్ మాన్వితను చేయిపట్టి ఆమె గదిలోనికి తీసుకెళ్ళాడు.

ఆ సంఘటనతో సుకృత ధీర్గత్ లిద్దరూ బాగా భయపడిపోయారు.మెల మెల్లగా హాల్దియా తనేంటో ౠజువు చేస్తోంది.ఏదో ఒక రకంగా నాన్నను విడిపించకపోతే నాన్నను ప్రాణాలతో మాత్రం ఉంచరు.ఇచ్చిన టాబ్లెట్ లను తీసుకొని పాణి కళ్ళు మూసుకొన్నాడు.
ధీర్గత్ సుకృత చేయిపట్టుకొని ఇవతలకు లాక్కొచ్చాడు.సుకృత చేయి విడిపించుకొంటూ ఏమయ్యిందిరా అంది
ధీర్గత్ :- ఇంకా ఏం కావాలే నాన్నను అలా ప్రాణాలు తీసేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా ఆయన పెద్ద మొండిఘటం.ఆయనతో పాటు మనల్ని కూడా చంపేస్తారు.ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి.
సుకృత :-అన్నయ్యా అంత పని చేయవద్దు. వారికి బందీలుగా ఉన్నంత వరకూ మన ప్రాణాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఆ విశయాన్ని నాన్నే మనతో చెప్పాడు.గుర్తుందా. .అదీ కాకుండా ప్రభుత్వం మన గురించి వీరితో ఏవో చర్చలు జరుపుతున్నదని ఆవిడ చెప్పింది. ఈ పరిస్థితుల్లో మనం ఏదైనా పిచ్చిపని చేస్తే అసలుకే మోసం వస్తుంది. నామాట విను.
ధీర్గత్: ఈ చర్చలూ, అవీ నాన్న ప్రాణాలు కాపాడలేవు. తీరా నాన్న ప్రాణాలకు ఏదైనా ముప్పు కలిగిన తరువాత మనమూ ఈ ప్రభుత్వమూ చేసేదేమీ ఉండదు. జీవితాంతం కుమిలిపోవాల్సి వస్తుంది. అదీ కాకుండా అమ్మా వాళ్ళ గురించి కూడా ఎటువంటీ సమాచారమూ తెలియదు.కాబట్టి మనం ఏమీ చేయకుండా ఎదురు చూట్టం బాగోదు. నా మాట విను సుకృతా మనలో ఎవరో ఒకరు బయటకు వెళ్ళగలిగితే బయటనుండి ఏవైనా ప్రయత్నాలు చేయవచ్చు.
వద్దాన్నయ్యా అది ఇంకా ప్రమాదం.
ధీర్గత్ :-నీ మొహం నీకు ధైర్యం లేకపోతే నేనే వెళతాను. అంటూ గబాగబా వెళ్ళి మూసిఉన్న తలుపులను దబా దబా బాది సిపాయీలతో హాల్దియా తో మాట్లాడాలన్నట్టు చెప్పాడు.
వీరిద్దరి గొడవకు పాణి మెల్లగా లేచి కూచొన్నాడు.సుకృత చెప్పినందంతా విని, ధీరూ అంత పని చేయవద్దురా, చూసావుగా హాల్దియా మనల్ని ఎంతపకడ్బందీగా ఇరికిస్తోందో. . ఇప్పుడు గాని తప్పటడుగు వేసావో జీవితాంతం దీనికి లొంగి ఉండాల్సి వస్తుంది.
ధీర్గత్ ఇంకా ఏదో చెప్పబోతోంటే హాల్దియా రానే వచ్చింది.
ఆమె రాగానే ధీర్గత్ ఆంటీ నేనే మిమ్మల్ని రమ్మన్నాను అంటూ లేచి నిలబడ్డాడు.

Updated: April 25, 2021 — 3:23 am

1 Comment

  1. Continuation please for 4

Comments are closed.