రాములు ఆటోగ్రాఫ్ – 65 123

అనిత హాస్పిటల్ నుండి వచ్చిన దగ్గర నుండీ ముభావంగా ఉండటం మాత్రం శ్యామల బాగా గమనించింది.
విషయం ఏంటో అడుగుదామని అనుకునేలోపు రాము రావడంతో మెదలకుండా ఉన్నది.
అనిత డైనింగ్ టేబుల్ మీద రాముకి భోజనం వడ్డించింది.
భోనజం చేస్తున్నంతసేపు అనిత, రాము…..ఇద్దరిలో ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు.
భోజనం చేయడం పూర్తి అయిన తరువాత హాల్లోకి వచ్చి కూర్చున్న తరువాత రాము, “అనితా…..మరి ఇల్లు చూడమంటావా,” అనడిగాడు.
అనిత మాట మాట్లాడేలోపు శ్యామల అయోమయంగా రాము చూస్తూ, “కొత్తగా ఇల్లు చూడటం ఏంటి….” అంటూ అనిత వైపు చూస్తూ, “ఏంటి…అనితా….రాము ఏం మాట్లాడుతున్నాడు…..మీ ఇద్దరికీ గొడవ ఏమైనా అయిందా,” అనడిగింది.
శ్యామల ఆత్రం చూసి రాము వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని ఆపుతూ, “వదినా…..కంగారు పడకు….మా ఇద్దరికీ గొడవ ఏమీ కాలేదు…..ఇవ్వాళ ఉదయం అనిత భాస్కర్ ని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళింది కదా,” అంటూ జరిగింది మొత్తం వివరంగా శ్యామలకు చెప్పాడు.
దాంతో అనిత ఇంటికి వచ్చిన దగ్గర నుండీ ముభావంగా ఎందుకు ఉన్నదో శ్యామలకు పూర్తిగా అర్ధమయింది.
విషయం అర్ధం అయిన వెంటనే శ్యామల, “మరి నువ్వు ఏమనుకుంటున్నావు అనితా,” అంటూ అనిత వైపు చూసింది.
అనిత : నాకు ఏం చెయ్యాలో అర్ధం కావడం లేదు రామూ…..
రాము : అర్ధం కాకపోవడం ఏంటి…..(అంటూ అనిత దగ్గరకు వెళ్ళి ఆమె చేతులను పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ) అసలు నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో ఏమాత్రం సంకోచం లేకుండా చెప్పు…..నీ మనసులో ఉన్నది చెప్పావంటే…. మేము దానికి తగ్గట్టు సొల్యూషన్ వెదుకుదాం……
శ్యామల : అవును అనితా…..నీ మనసులో ఉన్నది చెప్పు…..నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా మేము ఇద్దరం నీకు తోడుగా ఉంటాం….మాకు చేతనైనంత సహాయం చేస్తాం……
శ్యామల చెప్పింది విన్న తరువాత అనిత రాము కళ్ళల్లోకి చూసింది.
రాము కూడా అవునన్నట్టు తల ఊపడంతో ఇక తనను తాను ఆపుకోలేక గట్టిగా ఏడుస్తూ రాముని గట్టిగా కౌగిలించుకున్నది.
అనిత బాగా డిస్ట్రబ్ అయిందని రాముకి అర్ధం అవడంతో అనిత వీపు మీద మెల్లగా నిమురుతూ ఆమె మనసులో భారం దిగేవరకు ఆమెను కదిలించలేదు.
ఐదు నిముషాల తరువాత అనితను మెల్లగా సోఫాలో కూర్చోబెడుతూ శ్యామల వైపు చూస్తూ, “వదినా….కొంచెం వాటర్ తీసుకురావా,” అనడిగాడు.
శ్యామల అలాగే అంటూ గ్లాసులో వాటర్ తీసుకుని వచ్చి అనితకు ఇచ్చింది.
అనిత గబగబా గ్లాసు తీసుకుని నీళ్ళు తాగేసింది.
రాము : ఇప్పుడు చెప్పు అనితా…..నీ మనసులో ఏమున్నది…..

2 Comments

  1. arey madda e series aapu raa full boring

  2. Plz continue story superb

Comments are closed.