రాములు ఆటోగ్రాఫ్ – 65 123

అనిత : అది….ఎలా చెప్పమంటావు రామూ…..
రాము : నువ్వు విషయం చెబితే కదా….నాకు ఏం చెయ్యాలి అనేది అర్ధమయ్యేది…..
అనిత : కాని నువ్వు నా గురించి తప్పుగా అనుకుంటావేమో అని భయంగా ఉన్నది……
రాము : నీ గురించి తప్పుగా అనుకోవడం అనేది జరగదు అనితా….నాకు నువ్వంటే చాలా ఇష్టం….దానికి తోడు నువ్వు నాకు ఎప్పుడూ హాని కలిగించే పని ఎప్పుడూ చేయవు…..అందువలన నేను నీ గురించి తప్పుగా అనుకోను…
అనిత : నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు రాము……(అంటూ రాము కళ్ళల్లోకి చూడలేక మళ్ళీ రాముని గట్టిగా కౌగిలించుకున్నది.)
ఒక్క నిముషం అనిత ఏం చెప్పిందో రాముకి అర్ధం కాలేదు.
శ్యామల కూడా అనిత ఏంటి ఇలా మాట్లాడుతుంది అన్నట్టు చూసింది.

రాము ఏమీ మాట్లాడకపోయే సరికి అనిత తల ఎత్తి రాము కళ్ళల్లోకి చూసింది.

అనిత కళ్ళల్లో ఒకవైపు తప్పు చేస్తున్నానన్న భావన స్పష్టంగా కనిపిస్తుంది…..కాని ఆ భావనని రాము మీద ఉన్న ప్రేమ డామినేట్ చేస్తున్నది.
అనిత : ఏంటి రాము నేను చెప్పింది వినగానే నా గురించి తప్పుగా అనుకుంటున్నావు కదా…..
రాము : అలాంటిదేం లేదు అనితా…..కాని భాస్కర్ గురించి కూడా ఆలోచించు……
అనిత : అదే రాము….ఎటూ తేల్చుకోలేకపోతున్నా…..

2 Comments

  1. arey madda e series aapu raa full boring

  2. Plz continue story superb

Comments are closed.