రాములు ఆటోగ్రాఫ్ – Part 22 97

రాము అలాగే అనిత వైపు చూసి నవ్వుతూ తల తిప్పి భాస్కర్ వైపు చూసే సరికి తల వంచుకుని పేపర్ చదువుకోవడం చూసి అనిత వైపు, “నీ మొగుడు కంట్రోల్ లో ఉన్నాడు చూసావా,” అన్నట్టు సైగ చేస్తూ నవ్వాడు.
అనిత కూడా తన భర్త చేతగానితనాన్ని తలుచుకుని హాల్లో పేపర్ చదువుకుంటున్న తన భర్త భాస్కర్ వైపు ఒకసారి చులకనా చూసి….మళ్ళీ తల తిప్పి అక్కడే హాల్లో నిల్చున్న రాము వైపు చూసి మత్తుగా నవ్వింది.
రాము సోఫాలో కూర్చుని పేపర్ చదువుతుంటే….అనిత మధ్యాహ్నం భోజనానికి వంట చేస్తుంది.
భాస్కర్ అనిత వైపు కన్నార్పకుండా చూస్తూ అనిత కట్టుకున్న చీర, చెవులకు పెట్టుకున్న రింగులు కొత్తవని తెలుసుకున్నాడు.
అనిత అంత ఆనందంగా…అందంగా ఉండటం పెళ్ళి అయిన దగ్గర నుండీ భాస్కర్ ఎప్పుడు చూడలేదు.
అనితకి కావల్సినవి రాము తెస్తున్నాడని భాస్కర్ కి అర్ధం అయింది.

దాంతో భాస్కర్ కి జరుగుతున్నది తెలియక రాము మంచితనంతో తమ ఫ్యామిలీని ఆదుకుంటున్నాడని అనుకుని వెంటనే రాము వైపు ఆనందంగా చూసి మళ్ళీ టీవి చూడటంలో మునిగిపోయాడు.
అంతలో రాము ఒంటి నుండి వచ్చిన deodrent smell, తన భార్య ఒంటి నుండి వచ్చిన deodrent smell ఒకేలా ఉండటంతో, మళ్ళీ అనిత వైపు చూసాడు భాస్కర్.
అప్పుడు భాస్కర్ చూపు అనిత వేసుకున్న లోనెక్ జాకెట్ మీదకు వెళ్ళింది.
ఇప్పటి వరకు అనిత అంత డీప్ లోనెక్ జాకెట్ వెయ్యలేదు…ఆమె వీపు వెనక భాగం దాదాపుగా చాలా భాగం కనిపిస్తున్నది.
కిచెన్ లో ఉన్న అనిత తల తిప్పి తన మొగుడు భాస్కర్ కన్నార్పకుండా అలానే చూడటం గమనించింది.
ఈసారి అనిత కోప్పడకుండా భాస్కర్ వైపు చూసి నవ్వింది.
భాస్కర్ కూడా చిన్నగా నవ్వాడు.
ఇక అనిత మళ్ళీ వంట పనిలో పడి తన మొగుడి వైపు అసలు చూడలేదు.
తన మీద అనితకి కోపం పోయినందుకు భాస్కర్ కొంచెం రిలాక్స్ అయ్యాడు.
భాస్కర్ తన మనసులో, “అనిత చాలా ఆనందంగా ఉన్నది…..రాము తనకి కొత్త చీరలు తీసుకొస్తే, వద్దనకుండా ఎందుకు తీసుకున్నది….కనీసం రాముకి వద్దని కూడా చెప్పలేదు….నాతో కూడా రాము తెచ్చినవి చెప్పలేదు, చూపించలేదు కూడా…..అనిత రాము తెచ్చిన చీరలు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుని ఉంటుంది, ఎందుకంటే తనకు ఉన్న చీరలు మరీ పాతవి అయిపోయాయి….అందుకే తీసుకుని ఉంటుంది…కాని అనిత ఈ రకమైన జాకెట్లు ఎప్పుడూ వేసుకోలేదు, అలాంటప్పుడు అనిత రాముకి భయపడి వేసుకుంటున్నదా…..కాని రాము ఇలాంటి లోనెక్ జాకెట్లు ఎలా తీసుకొచ్చాడు….అనిత బొడ్డు కిందకు చీర ఎందుకు కట్టుకున్నది….ఎప్పుడూ బొడ్డు కిందకు చీర కట్టలేదు,” అని ఆలోచిస్తున్న భాస్కర్ తన భార్య అనిత సోఫా వైపు చూసి నవ్వడం కనిపించింది.
భాస్కర్ తల తిప్పి సోఫా వైపు చూసి రాము కూడా అనిత వైపు చూసి నవ్వడం చూసి భాస్కర్ గుండె వేగం పెరిగింది.
దాంతో అప్పటి దాకా భాస్కర్ మొహంలో కనిపించిన నవ్వు ఒక్కసారిగా మాయమైపోయింది.