రాములు ఆటోగ్రాఫ్ – Part 6 87

ఇక రాము మాట వినడని అర్ధమయిన రాము వాళ్ళ నాన్న అతని బట్టలు బ్యాగ్ లొ సర్దడం మొదలుపెట్టాడు.
మహేష్, సుమిత్ర ఇద్దరూ రూమ్ బయట నిలబడి వాళ్ళు మాట్లాడుకునేది వింటున్నారు.
రాము : నాన్నా….ప్లీజ్….మేము దాదాపుగా సగం దూరం వచ్చేసాము….ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రేణుకని రక్షించకపోతే ఆ విల్లా ముందు ముందు దెయ్యాల భవనంగా పేరు పడిపోతుంది….మన డీల్ కూడా ఆగిపోతుంది….
ఆ మాట వినగానే రాము వాళ్ళ నాన్న బట్టలు సర్దుతున్నవాడల్లా ఆగిపోయి రాము దగ్గరకు వచ్చి….
నాన్న : ఈ డీల్ పోతే ఇంకో డీల్ వస్తుంది….నీ కన్నా ఈ వ్యాపారం మాకు ఎక్కువ కాదు….అయినా ఇదంతా చేయడానికి నీకు, రేణుకకి మధ్య ఉన్న సంబంధం ఏంటి….ఆమె ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం చనిపోయింది…ప్రస్తుత కాలంలో బ్రతికి ఉన్న వాళ్లకే దిక్కు లేదు….నువ్వు ఆత్మలకు హెల్ప్ చేద్దామని బయలుదేరావా…..చూస్తూ చూస్తూ నా ఒక్కగానొక్క కొడుకు ప్రమాదం లోకి వెళ్తానంటే చూస్తూ ఊరుకోను….
రాము చిన్నగా తన తండ్రి దగ్గరకు వచ్చి….
రాము : నాకు నా ప్రమాదం అంటే భయం లేదు నాన్నా…..నేను అన్నీ ఆలోచించుక్కునే వచ్చాను….
నాన్న : కాని నాకు భయం ఉన్నది….నా కొడుకు గురించి నాకు బెంగ ఉన్నది….(అంటూ బ్యాగ్ సర్దడం మొదలుపెట్టాడు)
రాము : నాన్నా….నా చిన్నప్పుడు మీరు ఒళ్ళో కూర్చోబెట్టుకుని….దేనికి భయపడొద్దు….ఈ లొకంలో సాల్వ్ చేయలేని ప్రాబ్లం అంటూ ఏదీ లేదు….మనం చేస్తున్న పని ఇవ్వాళ కాకపోతే….రేపు అవుతుంది….పని కావడం లేదని మధ్యలో వదిలేయొద్దు. మంచి పని ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆపకుండా పూర్తి చేయాలని మీరే చెప్పారు…నేను మీరు చూపించిన మార్గం లోనే వెళ్తున్నాను….
నాన్న : నేను ఇక్కడికి నీతో వాదించడానికి రాలేదు…నిన్ను తీసుకెళ్లడానికి వచ్చాను….పద వెళ్దాం….
అంటూ బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు.
రాము : నాన్నా ఒక్క నిముషం….నేను మీతో రావడానికి రెడీగా ఉన్నాను…కాని నేను అడిగేదానికి సమాధానం చెప్పండి….
రాము వాళ్ల నాన్న ఏంటన్నట్టు రాము వైపు చూసాడు.
రాము : అదే మీరు నా ప్లేస్ లో ఉంటే ఏం చేసేవారు….ఒక మనిషి….లేదా మీరంతా అనుకున్నట్టు ఆత్మ ఇంతలా బాధపడుతుంటే చూస్తూ వెళ్ళిపొతామా….ఇదే పరిస్థితి మన కుటుంబంలో ఎవరికైనా వస్తే ఇలాగే వదిలేసి వెళ్ళిపోతామా….
ఆ మాట వినగానే రూమ్ నుండి బయటకు వెళ్తున్న రాము వాళ్ల నాన్న వెనక్కు తిరిగి రాము వైపు చూసి….
నాన్న : నాకు ఉన్న ఒక్కగానొక్క కొడుకువిరా నువ్వు….నీ మీదే మీ అమ్మా, నేను ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాం….నీకు ఏదైనా జరిగితే మేము తట్టుకోలేము…(అంటూ మహేష్ వైపు చూసి) వీడిని జాగ్రత్త చూసుకో…..(అంటూ రూమ్ నుండి బయటకు వచ్చి మహేష్, సుమిత్రల వైపు చూసి) కాని జాగ్రత్తగా ఉండండి….
అని అక్కడ నుండి తన తమ్ముడిని తీసుకుని వెళ్ళిపోయాడు.
రాము వాళ్ళు వెళ్ళిన వైపు చూస్తుండి పోతుండటంతో మహేష్ సుమిత్ర వైపు చూసి, “వాడిని కొంచెం కూల్ చెయ్యి,” అన్నాడు.
దానికి సుమిత్ర మహేష్ వైపు చూసి నవ్వుతూ, “అమ్మో….ఇందాక ఎంత కోప్పడ్డాడో చూసావు కదా…ఇప్పుడు వెళ్ళి కదిలించానంటే కొట్టినా కొడతాడు,” అన్నది.
మహేష్ కూడా నవ్వుతూ, “నువ్వు కూడా జోకులు బాగానే వేస్తావు….వెళ్ళి వాడి మూడ్ మార్చెయ్…నేను కొద్దిసేపు అలా బయటకు వెళ్ళొస్తా….” అంటూ అక్కడనుండి వెళ్ళిపోయాడు.
సుమిత్ర తన రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిచెన్ లోకి వెళ్ళి గ్లాసు తీసుకుని ఫ్లాస్క్ లో ఉన్న టీని పోసుకుని రాము రూమ్ వైపు వెళ్ళింది.
రాము బెడ్ మీద దిగాలుగా కూర్చుని ఉంటే….అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ రూమ్ లోకి వచ్చి వెనకాలే తలుపు గడి వేసి వయ్యారంగా నడుచుకుంటూ బెడ్ దగ్గరకు వచ్చింది.
సుమిత్ర అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే రాము ఆమె వైపు అలాగె కన్నార్పకుండా చూస్తుండి పోయాడు.
తన వైపు రాము అలా కన్నార్పకుండా చూస్తుండే సరికి సుమిత్రకు తన అందం మీద కొంచెం గర్వం కలిగి మనసులో నవ్వుకుంటూ బెడ్ మీద రాము దగ్గరకు వచ్చి ఆనుకుని కూర్చుని అతని చేతికి టీ ఇచ్చి, “ముందు ఇది తాగు….మైండ్ ఫ్రెష్ అవుతుంది,” అన్నది.
రాము ఆమె చేతిలోనుండి గ్లాస్ తీసుకుని సుమిత్ర వైపు చూసి చిన్నగా నవ్వాడు.

3 Comments

  1. Good story continuesly post the parts

  2. Why the story is serially continuing it is not showing much interesting. It is better to stop the story in my opinion.

  3. Watch shaapam movie, telugu dubbed, except sex each and everything from that movie only.. Rahul Dev movie …it’s ok continue

Comments are closed.