రాములు ఆటోగ్రాఫ్ – Part 5 99

సుమిత్ర : అవును….పేరే….కాని మనిషి పేరు కాదు….ఒక ప్రదేశం పేరు….(అంటూ వాళ్ళిద్దరి వైపు చూస్తూ) అప్పట్లో ఈ ప్లేస్ ని బాహ్లికం అని పిలిచేవారు….ఎలా అంటే పురాతన కాలంలో ఇంద్రప్రస్తాన్ని ఇప్పటి కాలంలో ఢిల్లీ అని, పాటలీ పుత్రని పాట్నా ఎలా అంటారో….అలాగే దీన్ని కూడా ఏదో ఇప్పటి కాలంలో ఏదో కొత్త పేరు ఉండి ఉంటుంది….ఆ పేరు మనకు తెలియాలి…(అంటూ ఆ బుక్ లో కొన్ని పేజీలు తిరగేసి చదువుతూ) హా….దొరికింది…..ఇప్పుడు దీన్ని మహిపాల్ పూర్ అంటారు….
మహేష్ : కాని…..ఈ మహిపాల్ పూర్ ఎక్కడ ఉన్నది….
సుమిత్ర : (ఆ బుక్ ని ఇంకా చదువుతూ) ఈ మహిపాల్ పూర్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో ఒక చిన్న గ్రామం పేరు….సుందర్ ఆత్మకు ఏ చెడ్డ ఆత్మ సహాయం చేస్తుందో….ఆ ఆడదాని ఆత్మ తన శరీరాన్ని తప్పకుండా అక్కడే వదిలేసి ఉంటుంది….అంటే చనిపోయిఉండొచ్చు….లేదా చంపేసి అయినా ఉండొచ్చు……మనకు ఈ ఆత్మ ఎక్కడ నుండి వచ్చింది….దాని శరీరం ఎలా విడిచింది అనేది మనం మహిపాల్ పూర్ కి వెళ్తేనే తెలుస్తుంది…కనుక రేపు పొద్దున్నే మనం బయలుదేరుదాం…..
పొద్దున్నె ముగ్గురూ రెడీ అయ్యి కారులొ బయలుదేరుతూ రంగా వాళ్ళింటికి వెళ్ళి జరిగింది అంతా చెప్పి మహిపాల్ పూర్ కి వెళ్తున్నట్టు చెప్పి కారులో ముగ్గురూ బయలుదేరి వెళ్ళిపోయారు.
*********
ఇక్కడ రాము వాళ్ల నాన్న రెండు రోజుల నుండి రాముకి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోయే సరికి విల్లాలొ ఏం జరుగుతుందో అర్ధం కాక….రాము ఎలా ఉన్నాడో అన్న టెన్షన్ తో ఏం చేయాలో తోచక విల్లాలో పనిచేసే రంగాకి ఫోన్ చేసాడు.
రాము వాళ్ల నాన్న ఫోన్ చేయడం చూసి రంగాకి ఏం చెయ్యాలో తోచలేదు….ఫోన్ ఎత్తాలా వద్దా….ఎత్తితే ఏం చెప్పాలి….అని ఆలోచిస్తూ ఉండగా అనసూయ వచ్చి ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి….
అనసూయ : హలో….అయ్యగారూ….చెప్పండయ్యా….
నాన్న : ఎవరు మాట్లాడేది….రంగా లేడా…..
అనసూయ : నేను ఆడి పెళ్లాన్నయ్యా……
నాన్న : సరె….రాము ఫోన్ ఎత్తడం లేదు….నువ్వు కాని, రంగా కాని విల్లాకు వెళ్ళారా….
అనసూయ : మేము విల్లాకు వెళ్ళి రెండు రోజులు అయిందయ్యా…..
నాన్న : ఏమయింది….ఎందుకు వెళ్లడం లేదు….రాము ఒక్కడే విల్లాలో ఉన్నాడా….ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు….
దాంతో అనసూయకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు….ఒక్కసారి ఎదురుగా ఉన్న తన మొగుడు రంగా వైపు చూసి ఏదయితే అది అయిందని….
అనసూయ : అయ్యా….రాము గారు మమ్మల్ని విల్లాలోకి వెళ్ళొద్దన్నారయ్యా…..ఆయన కూడా విల్లాలో లేరు….
నాన్న : ఎందుకు….అసలు ఏం జరుగుతుందక్కడ….(అంటూ గట్టిగా అడిగాడు).
ఆయన అలా గట్టిగా అడిగే సరికి అనసూయకు ఒక్కసారి భయపడిపోయి…..
అనసూయ : అయ్యా…విల్లాలో దెయ్యాలు ఉన్నాయయ్యా…..
నాన్న : ఏంటి నువ్వు మాట్లాడేది…..నిజంగా ఉన్నాయా…..నేను ఏదో పుకారు అనుకున్నాను….
అనసూయ : లేదయ్యా…నిజంగానే ఉన్నాయి….రాము గారు కళ్ళారా చూసారు….
ఆమె మాట వినగానే రాము వాళ్ల నాన్నకు కాళ్ళూ చేతులు ఆడలేదు…..నోట మాట రాలేదు….కాని వెంటనే తేరుకుని…
నాన్న : ఇప్పుడు రాము ఎక్కడ ఉన్నాడు….
అనసూయ : ఇక్కడకు దగ్గరలో ఒకామె….ఈ దెయ్యాల గురించి ఏదో పరిశోధనలు చేస్తుంటందంటయ్యా….ఆమె దగ్గరకు వెళ్లారు.
నాన్న : ఏం చెబుతున్నావో అర్ధం అవుతుందా….దెయ్యాలు ఉన్నప్పుడు మీ ఇద్దరూ రాముని వెనక్కు పంపించొచ్చుకదా…..
అనసూయ : మేము ఇద్దరం చాలా నచ్చచెప్పామండి….కాని రాము గారు మాట వినలేదు….మొండిగా ఆ దెయ్యాలను వదిలిస్తా అని ఆమె దగ్గరకు వెళ్ళారు…..
నాన్న : వాడు మాట వినకపోతే కనీసం నాకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితి చెప్పొచ్చు కదా….
అనసూయ : ఏమొ అయ్యా…..ఆ టెన్షన్ లో మా ఇద్దరికీ ఆ ఆలోచనే రాలేదు…..
నాన్న : సరె….నేను ఇప్పుడె బయలుదేరుతున్నాను…..రాము ఇప్పుడు ఆమె దగ్గరే ఉన్నాడా…..
దాంతో అనసూయ జరిగింది మొత్తం చెప్పి రాము, మహేష్, సుమిత్ర అందరూ మహిపాల్ పూర్ కి వెళ్తున్న సంగతి చెప్పేసింది.
నాన్న : వీడికి ఉండేకొద్దీ ఏం చేస్తున్నాడో అర్ధం కాకుండా పోతున్నది….నేను ఇప్పుడే అక్కడకు వెళ్తున్నాను….
అంటూ ఫోన్ కట్ చేసి తన తమ్ముడిని పిలిచి ఉన్న పళాన కారులొ మహిపాల్ పూర్ కి బయలుదేరారు.
***********
రాము కారు డ్రైవ్ చేస్తుండగా పక్కనే సుమిత్ర కూర్చున్నది….వెనక సీట్లో మహేష్ కూర్చున్నాడు.
వాళ్ళు ముగ్గురూ చాలా టెన్షన్ తో ఉన్నారు….ఏం జరగబోతుంది…..అని ఎవరి ఆలొచనలో వాళ్ళు ఉన్నారు.
రాము డ్రైవ్ చేస్తూ సుమిత్ర మొహం లోకి, మిర్రర్ లోనుండి మహేష్ మొహాన్ని చూసి వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారని గమనించి కారులో పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ ప్లే చేసాడు.
దాంతో వాళ్ళిద్దరూ రాము వైపు నవ్వుతు చూసి సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ మహిపాల్ పూర్ కి చేరుకునేసరికి రాత్రి అయిపోయింది.
ఊర్లోకి ఎంటర్ అవగానే అక్కడ రైల్వే స్టేషన్ కనిపించే సరికి అక్కడ కారు ఆపి రాము కారులో నుండి కిందకు దిగి అప్పుడే స్టేషన్ లోనుండి బయటకు వస్తున్న స్టేషన్ మాస్టర్ ని ఆపి….
రాము : సార్….ఇక్కడ రాత్రి స్టే చేయడానికి ఏమైనా హోటల్స్ ఉన్నాయా….
స్టేషన్ మాస్టర్ రాముని కిందనుండి పైదాకా చూసి….
స్టేషన్ మాస్టర్ : ఇక్కడ హోటల్స్ ఏవీ ఉండవండి….ఇది మారుమూలు చిన్న గ్రామం….కాకపోతే ఇక్కడ కొద్ది దూరంలో ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉన్నది….అక్కడ వాచ్ మెన్ కి ఎంతో కొంత ఇస్తే మీ పని అయ్యేంత వరకు అక్కడే ఉండొచ్చు….

1 Comment

  1. Katha adiripoyindi Basu….

Comments are closed.