రాములు ఆటోగ్రాఫ్ – Part 6 87

క్యూరేటర్ : సారీ సుమిత్ర గారు….నాకు మోహిని గురించి తెలిసినంత వరకు మీకు చెప్పాను…మీకు ఇంకా ఆమె గురించి వివరాలు కావాలంటే….వాళ్ళకు సంబంధించిన కోట ఇంకొకటి ఉన్నది….అక్కడకు వెళ్తే మీకు ఇంకా వివరాలు తెలిసే అవకాశం ఉన్నది…. ఇక్కడ మాత్రం వాళ్ళకు సంబంధించి….ఈ పెయింటింగ్ మాత్రమే ఉన్నది….
అంటూ వాళ్ళ వెనక గోడకు తగిలించిన ఒక పెయింటింగ్ చూపించాడు….దాంతో వాళ్ళు ముగ్గురూ ఆ పెయింటింగ్ లో ఉన్న మహారాజు ఫోటోని చూసారు.
క్యూరేటర్ : ఈ పెయింటింగ్ కూడా ఇక్కడ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న రివర్ ప్యాలెస్ లో దొరికింది….ఇక్కడకు తీసుకొచ్చి పెట్టాము…ఇంకా చాలా అక్కడే ఉన్నాయి….
సుమిత్ర : ఈ పెయింటింగ్ లో ఉన్నదెవరు….
క్యూరేటర్ : మహారాజా రంజిత్ సింగ్….
సుమిత్ర ఒక్క నిముషం ఏదో ఆలోచించిన దానిలా తల ఊపి క్యూరేటర్ వైపు చూసి….
సుమిత్ర : క్యూరేటర్ గారు….ఇప్పటి దాకా మేము మీతో అబధ్ధం చెప్పి నిజాలు తెలుసుకోవాలనుకున్నాము….కాని పరిస్థితి చూస్తుంటే నిజం తెలుసుకోవాలంటె….మీకు మేము ఇక్కడకు ఎందుకు వచ్చామో నిజం తెలియాలి….
అంటూ అక్కడ ఉన్న చైర్స్ లొ కూర్చుని సుమిత్ర విల్లా గురించి….అక్కడ ఉన్న సుందర్ ప్రేతాత్మ గురించి, హెల్ప్ చేస్తున్న మోహిని ఆత్మ గురించి మొత్తం వివరంగా క్యూరేటర్ కి చెప్పేసింది.
అంతా విన్న క్యూరేటర్ ఒక్కసారిగా వాళ్ళు చెప్పింది నమ్మలేనట్టు చూస్తూ ఆత్మకు హెల్ప్ చేయాలనుకుంటున్న రాము వైపు ఒకసారి చూసి….
క్యూరేటర్ : అంటే మీరు చెప్పిన దాని ప్రకారం రేణుక ఆత్మని ఈ రెండు ఆత్మలనుండి రక్షించడానికి ముందుగా ఈ మోహిని ఆత్మను అంతం చేయాలి….
సుమిత్ర : అవును క్యూరేటర్ గారు….కరెక్ట్ గా చెప్పారు….(అంటూ వెనక్కు తిరిగి మహారాజు రంజిత్ సింగ్ ఉన్న పెయింటింగ్ వైపు చూస్తూ) ఈ పెయింటింగ్ ఈ రోజు రాత్రి మేము తీసుకెళ్ళొచ్చా…..మళ్ళీ రేపు పొద్దున్నే తెచ్చిస్తాము…
క్యూరేటర్ : సుమిత్ర గారు….ఆ పర్మిషన్ నేను ఇవ్వలేను….ఏదైనా అటూ ఇటూ అయిందంటే….నేను గవర్నమెంట్ కి సమాధానం చెప్పాల్సి వస్తుంది….అదీ కాక ఈ పెయింటింగ్ చాలా పురాతనమైనది….సారీ సుమిత్ర గారూ…నేను ఈ పెయింటింగ్ బయతకు తీసుకెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేను…..
సుమిత్ర : మీరు చెప్పేది కూడా కరెక్టే….అలా అయితే….విజిటింగ్ హవర్స్ అయిపోయిన తరువాత మీరు మమ్మల్ని లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వగలరా…..
క్యూరేటర్ : అదైతే నేను తప్పకుండా చేయగలను….
సుమిత్ర : చాలా థాంక్స్ క్యూరేటర్ గారు….
అంటూ ముగ్గురూ కోట నుండి బయటకు వచ్చి తమ గెస్ట్ హౌస్ వైపు నడుస్తున్నారు.
సుమిత్ర : మహేష్…..రాత్రి అయిన తరువాత మనం మళ్ళీ కోటకు వెళ్దాం…..
మహేష్ : అలాగే సుమిత్ర……
వాళ్ళు ముగ్గురూ అలా మాట్లాడుకుంటూ గెస్ట్ హౌస్ కి వచ్చేసరికి అక్కడ హాల్లో సోఫాలో కూర్చుని తమ కోసం ఎదురుచూస్తున్న తన నాన్నని, బాబాయ్ చూసి రాము ఆశ్చర్యపోతూ, “వీళ్ళు ఇప్పుడు ఇక్కడకు వచ్చారేంటి….మేము ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారు….వీళ్లకు మొత్తం విషయం తెలిసిపోయిందా….” అని మనసులో అనుకుంటూ మహేష్ వైపు అనుమానంగా చూసాడు.
రాము ఆలోచలనలను మహేష్ వెంటనే పసిగట్టి అతని వైపు చూస్తూ, “నేనేం చెప్పలేదురా….వాళ్ళు ఇక్కడకు ఎలా వచ్చారో…. ఎందుకు వచ్చారో కూడా నాకు తెలియదు,” అన్నాడు.
వాళ్ళు ముగ్గురూ లోపలికి రావడం చూసి రాము వాళ్ళ నాన్న రాము దగ్గరకు వచ్చి కొపంగా….
నాన్న : ఏం జరుగుతుందిరా ఇక్కడ….నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు….
రాము : నాన్నా అదీ….అదీ…..
నాన్న : నాకు అంతా తెలుసు….నువ్వు ఏం చెప్పక్కర్లేదు….నేను నిన్ను మన డీల్ క్లోజ్ చేసుకురమ్మని పంపిస్తే…నువ్వు ఈ దెయ్యాలు…భూతాలు అంటూ ఊర్లు పట్టుకు తిరిగుతావా…..
రాము : అది కాదు నాన్నా….విల్లాలో ఉన్న రేణుక ఆత్మ చనిపోకముందు రాసిన లెటర్ చదివిన తరువాత నేను ఉండలేకపోయాను నాన్నా….చాలా బాధ పడుతున్నది…
అంతలో రాము వాళ్ళ బాబాయ్ రాము దగ్గరకు వచ్చి….
బాబాయ్ : నీకు ఏదైనా జరిగితే మేమంతా ఎలా ఉంటామనుకున్నావురా….
నాన్న : అయినా ఈ ఆత్మలతో వ్యవహారం చాలా ప్రమాదం….(అంటూ మహేష్ వైపు తిరిగి) నువ్వు ఇక్కడకు వచ్చింది ఇందుకేనా….సరదాగా ఎంజాయ్ చేస్తాను అంటే రాము ఎక్కడకు వెళ్లాడో నీకు చెప్పాను….అంతే కాని నువ్వు కూడా మూర్ఖంగా ఇలా వీడితొ పాటు పిచ్చి పిచి పనులు చేస్తావనుకోలేదు….(అంటూ రాము చేయి పట్టుకుని అతని రూమ్ లోకి దాదాపుగా లాక్కెళ్తున్నట్టుగా తీసుకెళ్ళి….) ముందు ఇద్దరూ బట్టలు సర్దుకోండి….ఇక్కడ నుండి బయలుదేరుదాం….
రాము : నాన్నా….పరిస్థితి అర్ధం చేసుకోవడానికి ట్రై చేయండి….
బాబాయ్ : ఏంటిరా అర్ధం చేసుకునేది….నువ్వు మూర్ఖంగా చావుకి ఎదురు వెళ్తానంటే చూస్తూ ఊరుకోము….ఇంకొక్క మాట కూడా మాట్లాడొద్దు….అన్నయ్య చెప్పినట్టు ఇద్దరూ బట్టలు సర్దుకుని మాతో బయలుదేరండి….అంతే….

3 Comments

  1. Good story continuesly post the parts

  2. Why the story is serially continuing it is not showing much interesting. It is better to stop the story in my opinion.

  3. Watch shaapam movie, telugu dubbed, except sex each and everything from that movie only.. Rahul Dev movie …it’s ok continue

Comments are closed.