రాములు ఆటోగ్రాఫ్ – Part 5 99

అలా ఆలోచిస్తున్న రాము అక్కడ టేబుల్ మీద తల పెట్టి పడుకున్నాడు….అలా పడుకున్న రాముకి తన రూమ్ డోర్ తెరుచుకుని బయట ఎవరో పిలిచినట్టు అనిపించడంతో రాము తల ఎత్తి అటు వైపు చుస్తూ మెల్లగా చైర్ లోనుండి లేచి రూమ్ లోనుండి బయటకు వచ్చాడు.
బయట అంతా చీకటిగా ఉన్నది….రాము తనను పిలుస్తున్న పిలుపు వైపుగా నడుచుకుంటూ వెళ్ళేసరికి గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న చెరువు దగ్గర ఎవరో నిల్చున్నట్టు అనిపించడంతో అక్కడకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ నిల్చున్న ఆమెను చూసి, “ఎవరు,” అని అడుగుతాడు.
దాంతో ఆమె వెనక్కు తిరిగి రాము వైపు చూస్తుంది….ఆమెను చూసిన రాము ఒక్కసారిగా బిత్తరపోయి రెండడుగులు వెనక్కు వేసి తాను చూస్తున్నది కలా నిజమా అన్నట్టు అక్కడ ఉన్న చెట్టుని పట్టుకుని అలాగే చూస్తుండిపోతాడు.
“రేణుకా…నువ్వేంటి ఇక్కడా….నేను చూస్తున్నది కలా నిజమా….” అంటూ రాము రేణుక వైపు చూస్తుండిపోయాడు.
“లేదు రాము….నువ్వు చూస్తున్నది నిజమే….నువ్వు నాకోసం పడుతున్న తపన….నన్ను ఇక్కడకు తీసుకొచ్చింది,” అన్నది రేణుక.
“నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్ధం కాలేదు,” అన్నాడు రాము.
రేణుక రాము వైపు చూసి, “నేను నీకు హెల్ప్ చేయాలని వచ్చాను రామూ….నువ్వు దేని కోసం అయితే వెదుకుతున్నావో….ఆ తాయెత్తు ఎక్కడున్నదో నాకు తెలుసు…(అంటూ తన చేతిని రాము వైపు చాపి) నా దగ్గరకు రా రామూ….అంత దూరంగా కాదు….నాకు దగ్గరకు రా,” అన్నది.
రాము చిన్నగా అడుగులొ అడుగు వేసుకుంటూ రేణుక దగ్గరకు వచ్చి ఆమె చేతిలో చెయ్యి వేసాడు.
అలా రాము తన చేతిని రేణుక చేతిలో పెట్టగానే తన కళ్ళ ముందు ఒక్కసారిగా ఇంతకు ముందు గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చినప్పటి నుండీ జరిగిపోయిన సంఘటనలు అన్నీ కళ్ళ ముందు కదలాడాయి….అలా సంఘటనలు మొత్తం కదలాడి…మొదటిసారి గెస్ట్ హౌస్ కి వచ్చినప్పుడు వాచ్ మెన్ తమకు ఆ రాత్రి భోజనం వడ్డిస్తుంటే అతని మెళ్ళో తాయెత్తు ఉండటం తాను చూసినట్టు కనిపించింది.
అలా తాయెత్తు కనిపించగానే రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుని చుట్టూ అయోమయంగా చూసాడు.
ఇందాక తాను సుమిత్ర మీద కోపంతో అరిచి రూమ్ లోకి వచ్చిన చోటే ఉండట….తనకు రేణుక కనిపించడం అంతా కలలాగా అనిపించింది.
కాని నిజంగా రేణుక కనిపించకపొతే ఆ తాయెత్తు గురించి తనకు ఎలా తెలిసింది అని ఆలొచిస్తూ రూమ్ లో నుండి బయటకు వచ్చ హాల్లో కూర్చుని ఉన్న మహేష్ పక్కనే కూర్చుని పక్కనే తమ వైపు భయంగా చూస్తున్న వాచ్ మెన్ వైపు చూసి, “నీ మెళ్ళొ ఆ తాయెత్తు ఏంటి,” అనడిగాడు.
రాము అలా వాచ్ మెన్ ని తాయెత్తు గురించి అడగ్గానే మహేష్, అక్కడే ఉన్న సుమిత్ర ఒక్కసారిగా తలెత్తి వాచ్ మెన్ మెడ వైపు చూసారు.
అతని మెళ్ళొ ఒక తాయెత్తు వేలాడుతుండటంతో వాళ్ళ ముగ్గురి కళ్ళు ఒక్క సారిగా ఆనందంతో తళుక్కుమన్నాయి.
వాచ్ మెన్ తన మెళ్ళొ తాయెత్తు తీసి రాముకి ఇస్తూ, “తీసుకోండి బాబూ….” అన్నాడు.
రాము ఆ తాయెత్తు తీసుకుని వాచ్ మెన్ వైపు చూసి, “ఒక వేళ నీకు అభ్యంతరం లేకపోతే….నేను దీన్ని ఓపెన్ చేసి చూడొచ్చా,” అనడిగాడు.
“తప్పకుండా బాబూ….నాకేం అభ్యంతరం లేదు….తీసి చూడండి….ఈ తాయెత్తు నా మెళ్ళోకి మా అమ్మ చనిపోయిన తరువాత వచ్చింది….కాని ఈ తాయెత్తు మా తాతల కాలం నుండి ఒకరి తరువాత ఒకరికి అందుతూ నా దగ్గరకు వచ్చింది…మా పూర్వికులు రాజమహలో పని చేసేవాళ్ళు….,” అన్నాడు వాచ్ మెన్.
రాము వెంటనే తాయెత్తు ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చీటీ లాంటిది కనిపిస్తుంది.
రాము ఆ చీటీని తన చేతిలోకి తీసుకుని చదవడానికి ట్రై చేసాడు…కాని అది అర్ధం కాకపోవడంతో మహేష్ వైపు చూసాడు.
రాము : ఏం రాసున్నదిరా ఇందులో…నీకేమైనా అర్ధమవుతున్నదా….
మహేష్ కూడా ఆ చీటిని చదవడానికి ట్రై చేసినా అర్ధం కాక ఏం చేయాలా అని చూస్తుండగా ఎదురుగా సుమిత్ర కనిపించడంతొ రాము ఆమెను అడగడానికి ఇందాక తను కోప్పడిన విషయం గుర్తు కొచ్చి అడగలేకపోతుండటం చూసి….మహేష్ రాము చేతిలొ చీటీ తిసుకుని సుమిత్ర దగ్గరకు వెళ్ళి ఆమె చేతికి ఇచ్చి, “ఇందులో ఏమున్నది….మా ఇద్దరికీ అర్ధం కావడం లేదు….నువ్వు చదివి చెప్పు,” అన్నాడు.
దాంతో సుమిత్ర ఆ చీటీ తీసుకుని చూసి, “ఇది చాలా పురాతనమైన భాష….దీని అర్ధమేంటంటె….ఈ తాయెత్తు ఎప్పటి దాకా ఐతే మెళ్ళో ఉంటుందో అప్పటి దాకా ఈ మోహిని ఆత్మ రూపంలో బ్రతికే ఉంటుంది….” అన్నది.
మహేష్ : మోహిని….మోహిని ఎవరు…..
సుమిత్ర : మోహిని అంటె…..మనం ఇప్పటి వరకు ఎవరి కోసం అయితే వెదుకున్నామో ఆ ఆత్మ పేరు మోహిని….

1 Comment

  1. Katha adiripoyindi Basu….

Comments are closed.