శివయ్య 2 242

మణీని కూడా తీసుకొచ్చి తన ముందరే ఈ డిస్కషను పెట్టిందంటే ఖచ్చితంగా తన విశయం చెప్పే ఉంటది.ఛ అనవసరంగా కమిటయ్యింది తను.చిన్నూ చాలా తెలివిగా తనను ట్రాప్ చేసింది.శివయ్యతో చెప్పి తనకొంప కొల్లేరు చేయక మునుపే దీని నోరు శాశ్వతంగా మూయించాలి.ఇంట్లో ఉన్న కొడుకుతోనే వేగలేక చస్తుంటే దీంతో ఇదో చిక్కొచ్చి పడింది.ఎలా ఎలా అని పరి పరి విధాలా అలోచించేసింది.తను అలా ఆలోచనలో ఉండగానే పెద్దమ్మా అని ఊపింది చిన్నూ
ఆ ఆ చెప్పూ అంది నవ్వు పులుముకొంటూ…
మణీతో కావాలని నేనేం చెప్ప లేదు పెద్దమ్మా పడగ్గదిలో మేము మాటాడుకొంటుంటే చాటుగా విని నిలదీసే సరికి చెప్పక తప్పలేదు.తనుకూడా విశయాన్ని సీరియస్ గా తీస్కోలేదు.ఏమే మణీ…..
ఆ …. ఆ…. అంతే పెద్దమ్మా అంది పొడిగా కిరణ్మయి
అప్పటికే ఓ నిర్ణయానికొచ్చేసిన విజయమ్మ
ఏదో అలా జరిగిపోయందంతే లెండ్రా….. చిన్నూ నీవెళ్లి రాయప్ప పడుకొన్నాడో లేదో చూసి రా …..
చిన్నూ లేచి గదిలోనికి తొంగిచూసి తలుపు దగ్గరగా వేసి వచ్చింది.
పడుకొన్నాడులే పెద్దమ్మా…. మణికి వాళ్ళాయన ఉద్యోగం కాస్త వచ్చేస్తే మాకు కాస్త భారం తగ్గిపోతుంది…అంటూ ఇంకా ఏదో మాటాడబోతుంటే అంతలో తోటలో నుండి శివయ్య వచ్చాడు.
ఏమే మణీ మీరింకా పడుకోలేదా అంటూ వచ్చి మంచం మీద కూర్చొన్నాడు.
మీరు అన్నం తినరా అంది విజయమ్మా
లేదు తోటలో భోజనాలేర్పాటు చేయించాడు పెద పాలేరు.అంటూ ఆవలిస్తూ మంచం మీద ఒత్తిగిల్లాడు.
చిన్నూ మణీ ఇద్దరూ లేచి పోబోతుంటే …హాల్లో శివాని గదిలో రాయప్ప ఉన్నారు కదే మీరిద్దరూ నాతోనే పడుకోండి తెలవారగట్ల మళ్ళీ మీ పెదనాన్న తోటలోకి వెళ్లాలి కరెంటు అపుడే ఇస్తారు మరి.
లేదు పెద్దమ్మా మేము కూడా హాల్లో పడుకొంటాము ఇబ్బందేం లేదు
మీ తలకాయ ఇంత పెద్దగది పెట్టుకొని హాల్లో ఎందుకే ..ముందుగా చెప్పింటే నేనే హాల్లో పడుకొనే దాన్నిగా..
పరవాలేదులే పెద్దమ్మా అని ఇంకా ఏదో చెబుతుంటే శివయ్య ఏరా కొత్తగా ప్రవర్తిస్తున్నారు.. మాకేమైనా కొత్తగా పెళ్లయ్యిందా… నోరు మూసుకొని పెద్దమ్మ చెప్పినట్టుగా వినండి.

1 Comment

  1. Sories are good. Please post new stories time to time.

Comments are closed.