శివయ్య 2 242

అది ఊహింది కాబట్టే చిన్నూ ద్వారా అలా చెప్పించింది విజయమ్మ.
ఏంటే మణీ …శివానీతో బాటు నువ్వుకూడా ఇక్కడే ఉండచ్చు కదా మీ పెద్దమ్మకు కాస్తతోడున్నుట్లుంటుంది…
లేదు పెదనాన్నా … ఆయన ఉద్యోగం నాకు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు మీ చిన్నల్లుడు ఈ ఒకటి రెండు నెలల్లో ఆర్డర్స్ చేతికి అందొచ్చు.అప్పుడు మీరొద్దన్నా నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది.
అలానా …ఏరా రాయా చూసావా మీ అక్కను తను బాగా చదువుకొంది కాబట్టి ఇప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడుతోంది.
రాయప్ప ఏమీ మాట్లాడలేదు.
విజయమ్మ అందుకొన్నట్లుగా ముప్పుద్దులా మనమీదపడి ఏడవడం మాత్రం తెలుసు…
రాయప్పకు రోషం వచ్చేసింది.మాకూ చదువుకోవడానికి సాయం చేస్తేం మాకాళ్ళమీద నిలబడతాం..
ఈ రోషానికేం తక్కువలేదు ఫో… అవతలకు అడ్డగాడిదా…. అంటూ కసురుకొనింది.
రాయప్ప అవమానంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు.
శివయ్యకు ఏం మాట్లాడాలో తెలియలేదు.
వాడిదెప్పుడూ ఉండేదే కదా …. మీరు తోటకెళతానన్నారు. ఎప్పుడొస్తారేమిటి..
మీరు భోజనాలు కానివ్వండి నేను కాస్త లేటుగానే వస్తా కరెంటు ఉన్నదాకా నీళ్లు కట్టాలి
భోజనాలప్పుడు ఏదో ఫిషీ ఫిషీగా అనిపించింది రాయప్పకు ..
శివాని హాలులో ఓ చివర పడుకొంది .మణీ చిన్నూ ఇద్దరూ అమ్మతో మటాడుతున్నారు అమ్మా వాళ్లగదిలో. రాయప్ప తనగదిలో పడుకొన్నాడు.
గది లోపల చిన్నూ మణి ఇద్దరూ విజయమ్మ చెరో తొడపై తల పెట్టుకొని పడుకొని ఉన్నారు విజయమ్మ మంచానికి జారగిల బడి చిరునవ్వుతో వారితో మాటాడుతోంది.
పెద్దమ్మా నీవేగనక మమ్మల్ని ఆదుకోక పోయుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళమో కదా అంది చిన్నూ
ఛ ఛా ఏమాటలే అవి నేనేం ఊరికే ఇవ్వట్లేదుకదా
వడ్డీ ఇస్తున్నామనుకో ఐనా వేరే ఎవరు మమ్మని నమ్మి ఇలా సాయం చేస్తారు చెప్పు..
చాల్లేవే గడుగ్గాయ్..మాటలు నేర్చావు
మాటలే కాదు పెద్దమ్మా చేతలు కూడా అంది నర్మగర్భంగా
కళ్ళు పెద్దవి చేసి ఉరిముతూ కిరణ్మయి ఉన్నట్టుగా సైగ చేసింది విజయమ్మ
చిన్నూ పక పకా నవ్వుతూ కిరణ్మయి వంక చూసింది
కిరణ్మయి కూడా చిరునవ్వు నవ్వింది.
విజయమ్మకు గుండె ఆగినంత పనైయ్యింది.చిన్నూ ఈ విశయాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్తుందో అని..అందుకే మౌనంగా ఉండిపోయింది.
పెద్దమ్మా కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందని నాకూ తెలిసే .. నీవేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు.ఈ విశయం మన మధ్యే ఉంటుంది.ఐనా నీతో పెట్టుకొని మేము బతకగలమా పెదనాన్న విశయం మాకు తెలియదూ ..పుట్టగతులేకుండా చేసెయ్యడూ ..
విజయమ్మకు నోరు పెగలలేదు.

1 Comment

  1. Sories are good. Please post new stories time to time.

Comments are closed.