హౌస్ కీపింగ్ అమ్మాయి – 1 505

ఈ మూడు రోజుల్లో, సరళ తన డ్యూటీ ఎక్కడా తేడా రాకుండా చక్కగా నెరవేర్చింది. క్రిందటి రెండు రోజులూ, మేనేజర్ కావ్య తను శుభ్రం చేసిన రూములను ప్రత్యేకంగా ఇన్ స్పెక్ట్ చేసి, సంతృప్తిని వెలిబుచ్చింది. ఎప్పుడూ సీరియస్ గా ఉండే ఆమె మొహంలో, సరళ పెర్ఫార్మెన్ చూసిన తర్వాత కనబడిన చిరునవ్వు సరళకు పెద్ద రిలీఫ్ గా అనిపించింది.

‘కీపిటప్ సరళా’ అంటూ ఆమెవెళ్ళిపోయింది. కావ్యని సంతృప్తి పరచడమే తన ప్రధాన కర్తవ్యమన్న విషయం తొలిరోజునే బోధ పడింది. ఆమె ఇంప్రెషన్ కోల్పోయినట్లైతే ఇక ఉద్యోగానికి నీళ్ళొదులుకోవాల్సిందే. ఇప్పటి పరిస్థితి చూస్తే కావ్యకు తనపై మంచి ఇంప్రెషన్ ఉన్నట్లే.

ఆ ఉత్సాహంతో, సరళ ఇవ్వాళ మూడవరోజు బుధవారం పనిని హుషారుగా స్టార్ట్ చేసింది. ఆ ఉత్సాహంలో, మేడం తనకు క్రితం రోజు కంటే ఒక రెండు ఎక్కువ రూముల్ని కేటాయించినా పెద్దగా బాధ అనిపించలేదు. పైగా ఆ అదనపు పని తన సమర్దతని గుర్తించినందుకు చిహ్నంగా ఆమె భావించింది. మద్యాహ్నం మూడు లోగా తను తనకి కేటాయించిన రూముల నిర్వహణని పూర్తి చేయాల్సి ఉంది. మధ్యలో తను ఓ అరగంట లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు. టైము పదయ్యింది. తాను అప్పుడే సగం రూముల్ని పూర్తి చేసేసింది. ఇప్పుడే రూం నంబర్ 517 కంప్లీట్ చేసింది. ఇప్పటి వరకూ చేసిన రూములలోని గెస్టులు బయటికి వెళ్ళడమో, లేదా ఖాళీ చెయ్యడమో జరగడం వల్ల ఆమె పని సులువయ్యింది. లేకపోతే , ఈసరికి టైము పన్నెండయేది.

517 రూము లాక్ చేసేముందు, అక్కడున్న వార్డ్ రోబ్ ముందున్న నిలువుటద్దంలో తనను తాను ఒక సారి చూసుకుంది. ఎంత పని చేసినా, తన ఉద్యోగులు తమ తమ లుక్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మేడం ఆదేశం. మొహంపై చిరునవ్వు చెదరరాదు. సరళ, తన ట్రాలీ లో సిధ్ధంగా ఉంచుకున్న మేకప్ కిట్ తీసి, టచప్ ఇచ్చుకుని, కాస్త లిప్ స్టిక్ పూసుకుంది. ఒంటికి పొందికగా చుట్టిన చీరెను సరి చేసుకుని, జుట్టు ముడిని ఒకసారి అడ్జస్ట్ చెసుకుంది. నడుముని చుట్టిన చీరె చెంగును, ఒకసారి విప్పి, బిగించి, మరల బొడ్డులో దోపుకుంది. నున్నగా దువ్విన జుట్టుతో , చెవులకు లోలాకులతో , నుదుట నిలువు బొట్టుతో,ఎటువంటి అసభ్యతా లేకుండా సాంప్రదాయత ఉట్టి పడేటట్లుగా ఉంది తన ఆహార్యం.

హౌస్ కీపింగ్ నిజానికి చాలా శ్రమతో కూడినది. ఏసీ రూములలో పని చేస్తున్నా సరే, ఒకోసారి చిరు చెమట పడుతుంది. మేడం తను ఎప్పుడూ సూట్ లో ఉన్నా సరే తన సబార్డినేట్ లకు మాత్రం చీరెలనే డ్రెస్ కోడ్ గా నిర్ధేశించింది. ప్రతీ రోజూ పని కేటాయించే ముందు తన ఉద్యోగుల్ని ఒక్కొక్కరినే రూముకు పిలిచి, ముఖ్యంగా అమ్మాయిల్ని పాదాల నుండి హెయిర్ స్టైల్ వరకూ గుచ్చి గుచ్చి చూస్తూ కామెంట్స్ చేస్తుంది. ఒకసారి చుట్టూ తిరగమని చెప్పి టిప్స్ ఇస్తుంది.

సరళ అద్దం ముందు నిలబడి, అటూ ఇటూ చూసుకుని మేకప్ సరి చేసుకుంది. నిజానికి, ఈ జాబ్ లో జాయిన్ అయ్యే వరకూ ఆమెకు మేకప్ మీద అంత శ్రద్ద ఉండేది కాదు. తనో పేద పిల్లనని ఒక ఆత్మన్యూనత. పైగా సిగ్గరి. మగాళ్ళను అకర్షించే అలవాటు ఎప్పుడూ లేదు. కానీ ఈ జాబ్, ముఖ్యంగా మేడం రూల్స్ కారణంగా తన అందం పై ప్రత్యేక శ్రద్ద చూపాల్సి వస్తోంది.

కావ్య ఆమెకు ఎప్పటి కప్పుడు ఆపాదమస్తకం మరింత పరిశీలించి జాగ్రత్తలు చెప్తుంది. మేకప్ విషయంలోనూ, జాకెట్ టైట్ నెస్ గురించి, చీరె కుచ్చిళ్ళ గురించీ, ఎటువంటి బ్రా ధరించాలో కూడా సలహాలు చెప్తుంది. ఈ జాబ్ లో సెలెక్ట్ కావడానికి అవసరమయ్యే అర్హతలలో రూపానికి కూడా కొన్ని మార్కులు కేటాయించబడే ఉన్నాయి.

సరళ హైట్ మధ్యస్థంగా ఉంటుంది. ఛాతీ, పిరుదులు కాస్త ఉన్నతంగానే ఉంటాయి. నడుము సన్నం. బాడీ కొలతలు కూడా తనను సెలెక్ట్ చేయబడడంలో ప్రధాన పాత్ర వహించాయని మేడం నిన్ననే డ్యూటీ స్టార్ట్ చేసేముందు చెప్పింది.

రోజూ పొద్దున్నే హోటెల్ లో లేడీస్ కి ప్రత్యేకంగా ఉన్న జిమ్ కి వెళ్ళి ఆ కొలతలను తను మెయిన్ టైన్ చేయాల్సే ఉంటుంది.

సరళది ఆకర్షణీయమైన మొహం. తీరైన ముక్కు. పచ్చని పసిమి రంగు. తను చాలా అందగత్తె అని, తను జాబ్ లో జాయిన్ అయ్యేటప్పుడు మేడం వేసిన అస్సెస్ మెంట్ షీట్ లోని తన మార్కులు సెలెక్ట్ అయ్యాక మేడం తనకు నిన్న చూపే వరకూ తెలియదు.

తను ఇంకా కన్య గానే ఉంది. అబ్బాయిలతో అఫైర్స్ లేవు.

సరళ తను శుభ్రం చేసిన రూం నంబరు 517 మరోసారి తృప్తిగా చూసుకుని , ట్రాలీని బయటకు తెచ్చి, డోర్ లాక్ చేసింది. తను క్లీన్ చెయ్యాల్సిన రూం నంబర్లలో ప్రక్క నున్న రూం నంబరు 518, ఇంకా 519 కూడా ఉన్నాయి. అవి రెండూ కూడా ఆక్యుపైడ్ రూముల జాబితాలో ఉన్నాయి. అంటే ఆక్యుపెంట్స్ ఇంకా రూములు వెకేట్ చెయ్యలేదు. అవి రెండూ ఒక బిజినెస్ ఉమన్ పేరు మీద శనివారం వరకూ ఉన్నాయి. ఈరోజు బుధవారం.

మేడం కావ్య, సరళకు ఆ రూముల గురించి డ్యూటీ షీట్ లో ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది. ఆరూములు బుక్ చేసింది ఒక ఇంపార్టెంట్ రెగ్యులర్ కస్టమర్. ఆమె ఒక ప్రముఖ ఇంటర్నేషనల్ బాంక్ కి రీజనల్ మేనేజర్. ఆమె ప్రతీ నెలా ఈ సిటీకి వచ్చి వారం పాటు రెండు రూములు బుక్ చేసుకుంటుంది.

ఆ బిజినెస్ ఉమన్ పేరు మిస్ మాధురి. మాంచి ఎత్తులో, నిగనిగ లాడే స్పురద్రూపి. అవివాహిత. చాలా దర్పంగా ఉంటుంది. ఫార్మల్స్ గా పాంటు షర్ట్ వేసుకుంటుంది. టక్ చేసుకున్న టైట్ షర్ట్ లో నుండి చొచ్చుకొస్తున్న వెడల్పాటి చాతీతో స్టైలిష్ గా ఉంటుంది. కావ్యా మేడం ఆమె గురించి చెప్పిన తర్వాత, గత రెండు రోజులలో సరళ మాధురిని రెండుసార్లు మాత్రం చూసింది.