హౌస్ కీపింగ్ అమ్మాయి – 1 505

వైజాగ్ లో, ఒక ఖరీదైన హోటల్ లో, ఐదవ ఫ్లోర్ లోని రూముని హుషారుగా క్లీన్ చేస్తూ, తనలో తాను సన్నగా హమ్మింగ్ చేసుకోసాగింది సరళ . బెంగుళూర్ లో హోటల్ మేనేజిమెంట్ కోర్స్ పూర్తి చేసిన మొదటి నెలలోనే ఈ పెద్ద హోటల్ లో జాబ్ రావడం నిజానికి తన అదృష్టం. ఆమెకు మొన్ననే పంతొమ్మిది నిండాయి. ఇంత చిన్న వయసులోనే జాబ్ రావడం తనకి ఏదో కలలా అనిపిస్తోంది.

సరళది అనంతపురం. ఆమె ఒక దిగువ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చింది. తండ్రి గుమస్తా. తనే పెద్ద సంతానం. చెల్లి ఏడో తరగతి. తమ్ముడు ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటెలిజెంట్. మంచి ఫ్యూచర్ ఉన్నవాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఈ జాబ్ తనకి చాలా అవసరం. ఇప్పటి తన జీతంతో తమ్ముడిని ఇంజనీరింగ్ చదివించాలి. తరువాత వాడికి జాబ్ వస్తే, ఇద్దరి జీతం పోగు చేసి చెల్లిని చదివించి, ఆమె పెళ్ళి చేసి అప్పుడు తను లైఫ్ లో సెటిల్ అవ్వాలి. ఇవే ప్రస్తుతానికి ఆమెకి లైఫ్ లో తాత్కాలిక గోల్స్. ఇంకా తనకి పంతొమ్మిదేళ్ళే కాబట్టి ఇదేమంత అత్యాశతో కూడిన ప్రణాళిక కాదు.

అసలు హోటెల్ మేనేజ్ మెంట్ చేసిన వాళ్ళు బెంగుళూర్ లో వేలల్లో ఉండగా, ఎటువంటి ప్రత్యేకతా లేని తనకు మొదటి ప్రయత్నంలోనే, అదీ ఇంత ప్రతిష్టాత్మకమైన హోటెల్ లో ఎలా జాబ్ వచ్చిందనేది తనకు అర్థం కాని ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు ఎవరైనా, చిన్నచిన్న హోటెల్స్ లో అతి కష్ఠం మీద ఉద్యోగం తెచ్చుకుని ఆ ఎక్స్ పీరియన్స్ మీద వేరే హోటెల్ లో చేరి.. , అలా అంచెలంచెలుగా పైకి వస్తారు. కానీ తనకిలా సరాసరి పెద్ద హోటెల్ లో జాబ్ రావడం నిజంగా ఒక మిరకిల్.

ఆమెకి తను చదివిన ఇన్ స్టిట్యూట్ లోని భాను మేడం గుర్తుకొచ్చింది. భాను మేడం ఆ ఇన్స్ టిట్యూట్ లో ఒక లెక్చరర్. ఆమెది కూడా రాయలసీమే. కడప నుండి వచ్చింది. నిజానికి ఆమె తనకు ఒక దేవతలా హెల్ప్ చేసింది. ఆమె సరళ జాయినయ్యిప్పటి నుండీ ఆమె వినయవిధేయతల్ని చూసి, పైగా తెలుగమ్మాయని తెలిసి అక్కున చేర్చుకుంది. తన ఆర్థిక పరిస్థితి పై సానుభూతి చూపించేది. తన అవసరాలు గుర్తించి అప్పుడప్పుడూ చిన్న చిన్న ధనసహాయాలు కూడా చేసేది.