న్యూ హ్యాపీ ఎండింగ్ Part 6 38

కాసేపటికి సంతోష్ ఇంటికి వచ్చాడు. ఎందుకో తన అమ్మ మొహం బాధగా కనిపించింది.

“ఏమైంది మా అలా ఉన్నావ్?” అన్నాడు సంతోష్.

“నాకేం కాలేదు” అంది వెంటనే పూర్ణ. ఇంకా అదే ఆలోచిస్తున్నాను కాబోలు అందుకే సంతోష్ కి అనుమానం వచ్చింది అనుకుంది.

“హా సరే” అన్నాడు సంతోష్.

పూర్ణ కిచెన్ లోకి వెళ్లి రాత్రికి భోజనం చేయటం మొదలుపెట్టింది. కాసేపటికి వంట పూర్తి అయింది. ఇద్దరు కూర్చుని తినేసారు. పనులు మొత్తం పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళింది పూర్ణ. అప్పటికే టైం 9:30 అయింది. రేపు ఎటుతిరిగి సెలవే కావటంతో ఫోన్ పట్టుకుంది. సడెన్ గా మళ్ళీ మనసు శ్రీకాంత్ మీదకి వెళ్ళింది.

అసలు ఏమైంది నాకు, ఎందుకు వాడేం చేస్తున్నా ఏమి అనలేకపోతున్నాను. మా మధ్య ఉన్నది ఏంటి? వాడేమో ప్రేమ అంటున్నాడు నాకు అసలు ఏం చేయాలో కూడా అర్ధం కావట్లేదు అని ఆలోచించటం మొదలుపెట్టింది. ఇంతలో సడెన్ గా నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. చూస్తే శ్రీకాంత్ నుండి మెసేజ్ ఉంది.

“వంద సంవత్సరాలు వెధవ కి” అనుకుంది మనసులో.

వెంటనే ఫోన్ ని సైలెంట్ లో పెట్టి వాట్సాప్ ఓపెన్ చేసింది.

“హాయ్ బేబీ” అన్నాడు శ్రీకాంత్.

“ఏంటి బేబీ అంటున్నావు?” అంది కోపం గా చూస్తున్న ఎమోజి పెట్టి.

“హా నువ్వు నా బుజ్జి బేబీ వి” అన్నాడు శ్రీకాంత్.

అది చూసి నవ్వు వచ్చింది పూర్ణ కి.

“ఏంటి నేను బుజ్జి బేబీ నా?” అంది ఆశ్చర్యం గా

“హా అవును” అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ.

“ఏం కాదు” అంది

“అది సరే కానీ ఇందాక కొరియర్ అతను రాకపోయి ఉంటే ఏమయ్యేదో తెలుసా?” అన్నాడు చిలిపిగా నవ్వుతూ

ఆ మరుక్షణమే ఇందాక జరిగింది మొత్తం పూర్ణ కళ్ల ముందు మెదిలింది. సిగ్గుతో బుగ్గలు ఎర్రగా అయ్యాయి. అసలు నేను వీడితో ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటుంది కానీ తెలియకుండానే సిగ్గు వచ్చేస్తుంది.

“చంపుతా ఆపేసేయ్” అంది

“రా చంపు నీ చేతుల్లో హ్యాపీగా పోతా” అన్నాడు

“ఇంకొకసారి ఇలా మాట్లాడావ్ అనుకో ఇంక లైఫ్ లో నీ మొహం చూడను” అంది సీరియస్ గా

“సారీ బేబీ ఏదో నిన్ను ఆట పట్టిద్దాం అని” అన్నాడు శ్రీకాంత్.

“ఇలాంటి విషయాల్లో కాదు” అంది పూర్ణ

“సరే మహాతల్లి ఇంక ఎప్పుడు అనను సరేనా” అన్నాడు దణ్ణం పెడుతున్న ఎమోజి పెట్టి.

అది చూసి చిన్నగా నవ్వుకుంది పూర్ణ.

“గుడ్ బాయ్” అంది

“గుడ్ బాయ్ ని కాదు గుడ్ లవర్ ని నేను” అన్నాడు నవ్వుతూ.

“ఇంక అయిపోతావ్” అంది

“హాహా, చెప్పు నేనంటే ఇష్టమే కదా నీకు?” అన్నాడు.

“లేదు” అంది.

“అవునా మరి ఇష్టం లేకపోతే ఇందాక నేను వచ్చేటప్పుడు ఏడుపు మొహం ఎందుకు పెట్టావ్?” అన్నాడు.

“నీకు అర్ధం అయిందా?” అంది షాక్ అవుతూ

“మరి ఎప్పుడు నవ్వుతూ అందం గా ఉండే మొహం ఒక్కసారి గా అలా అయితే అర్ధం అవ్వదా ఏంటి?” అన్నాడు.

“హ్మ్” అంది

“చెప్పు మరి నేనంటే ఇష్టమేనా?” అన్నాడు.

“మనం చేస్తుంది తప్పు శ్రీకాంత్, నాకు ఎందుకో గిల్టీ గా అనిపిస్తుంది” అంది.

“తప్పేమి కాదు, అయినా నువ్వేమి అమ్మమ్మ వి కాదు. చెప్పాలి అంటే సంతోష్ కి అక్క లా ఉంటావు. అయినా ఇది తప్పు రైట్ అని నేనేం ఆలోచించలేదు. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా నచ్చేసావు. అంత దాక ఎందుకు కాలేజీ లో ఎంతోమంది అమ్మాయిలు ఉంటారు కానీ నీ వెనుక తిరిగినట్టు నేనెప్పుడూ వేరొకళ్ల వెనుక తిరగలేదు” అన్నాడు.

“హ్మ్ కానీ” అంటూ ఆగింది పూర్ణ.

“కానీ లేదు ఏం లేదు నేనంటే నీకు ఇష్టం అని నాకు తెలుసు కానీ నీ నోటి నుండి వినాలని ఉంది” అన్నాడు.

“నేను చెప్పానా నీకు ఇష్టం అని” అంది పూర్ణ.

“చెప్పక్కర్లేదు నీ కళ్ళు చూస్తేనే అర్ధం అయిపోతుంది” అన్నాడు.

“ఏం అర్ధం అవుతుంది నీకు” అంది