న్యూ హ్యాపీ ఎండింగ్ Part 6 38

“నేను చెప్పానా ఇష్టం లేదు అని” అంది పూర్ణ

“చెప్పక్కర్లేదు కానీ మీ శారీ చూసి అర్ధం చేసుకోవచ్చు” అన్నాడు

“చెప్పేది వినరా” అంది పూర్ణ

“వినేది ఏం లేదు నా కీ నాకు ఇవ్వండి” అన్నాడు.

“ఒరేయ్ నా దగ్గర బ్లాక్ కలర్ శారీ లేదు” అంది చిరుకోపం గా

అది విని శ్రీకాంత్ ఆగాడు.

“అంటే?” అన్నాడు

“అంటే ఏంటి ఇంకా నా దగ్గర అది లేదు అందుకే నువ్వు నన్ను మొదటిసారి చూసినప్పుడు వేసుకున్న శారీ కట్టుకొని వచ్చా” అంది పూర్ణ

అది విని శ్రీకాంత్ కి పట్టరాని సంతోషం వచ్చింది.

“అంటే ఒప్పుకున్నట్టేగా?” అన్నాడు నవ్వుతూ

“ఛీ నవ్వుతున్నావా వెళ్తా అన్నావ్ గా వెళ్ళు పో” అంది కీ ఇస్తూ

“సారీ అర్ధం చేసుకోలేకపోయాను” అంటూ కీ ఇస్తున్న పూర్ణ చేయి పట్టుకొని తన మీదకి లాక్కున్నాడు.

“రేయ్ ఇది రోడ్డు” అంది పూర్ణ

“సారీ ఆనందం లో ఏం చేస్తున్నానో అర్ధం కావట్లేదు. రా బైక్ ఎక్కు” అన్నాడు కీ తీసుకొని స్టార్ట్ చేస్తూ

పూర్ణ మెల్లగా నవ్వుతూ బైక్ ఎక్కి కూర్చుంది. తన చేతిని శ్రీకాంత్ భుజం మీద వేసింది. శ్రీకాంత్ నవ్వుకుంటూ బైక్ ని ముందుకు పోనిచ్చాడు.