నేను మీకు సహాయం చేస్తాను! Part 9 5

పడుకున్నా కానీ నిద్ర రావట్లేదు అన్నయ్య నన్ను బయటకి పంపించండి అన్న మాట నేను తట్టుకోలేకపోతున్నా, నేను చాలా సార్లు ఏడ్చాను కానీ ఆ ఏడుపు ఈ ఏడుపు ఒకటి కాదు, నొప్పి ఎక్కడనుండి వస్తుందో కూడ అర్దం అవ్వలేదు, అమ్మ గుర్తుకు వస్తుంది అమ్మ వడిలో పడుకోవాలని వుంది ఏడుపు ఎక్కువ అయింది, అలానే మూల పడుకున్న నిద్ర లేకుండా అమ్మ వాళ్ళు కోసం ఎదురుచూస్తున్న, అలాగే నిద్ర పోయాను,

నిద్ర పోయిన నిద్ర రావటంలేదు అమ్మ లేనిదే నిద్ర రావట్లేదు సౌండ్ రాకుండా అలాగే ఏడ్చాను, సౌండ్ వినిపిస్తే ఎక్కడఅన్నయ్య వాళ్ళు రూం లోనుండి వెళ్ళిపొమ్మని అంటారేమో అని గట్టిగా ఎడవలేధు, అలాగే ఏడ్చి ఏడ్చి ఎప్పటికో నిద్ర వచ్చింది పడుకొని మెళుకువ వచ్చేసరికి రూం లో అన్నయ్య వాళ్ళు లేరు, అలాగే కళ్ళు నలుపుకుంటూ బయటకి వెళ్ళాక అమ్మ నాన్న పక్కన అన్నయ్య వాళ్ళు వున్నారు, చాలా మంది జనాలు వున్నారు పడుకున్న అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాను లేపుతుంటే లేవటం లేదు, ఆప్పుడు నాకు తెలీదు ఇంకెప్పుడు అమ్మ నాన్న లు ఇంతక ముందులా నాతో వుండరు అని, అందరూ ఎందుకు ఏడుస్తున్నారు తెలీదు నాకు ఎందుకు ఏడుపు రావట్లేదు తెలీదు,

పార్టీ కీ వెళ్ళిన అమ్మ నాన్న లకి అసెడెంట్ అయింది ఇద్దరు చనిపోయారు దాన్ని ఆసరాగా తీసుకొని చిన్న పిల్లలం అయిన మమ్మలని మోసం చేసి మా ఆస్తి మొత్తం మాకు బాగా అయినవాళ్లే తీసుకున్నారు, మా అమ్మ నాన్న జ్ఞాపకార్థం ఈ ఇల్లు ఒక్కటే అన్నయ్య మాకు, వాళ్ళు చనిపోయిన రోజు నా చేయి పట్టుకున్నారు ఇంతవరకు నా చేయి వదలలేదు, ఏ కష్టం రానివ్వలేదు, అసలు మా ఇద్దరు అన్నలు అమ్మ నాన్న ను మర్చిపోయేలా చేశారు, ఎంత కష్టం అయిన వల్ల దగ్గరే ఆగిపోతుంది కానీ నా వరకు రానివ్వరు, అందుకే ఇష్టమైన చదువు ఆపేసి ఎవరు ఏ పని చెప్పిన చేస్తారు, నా కోసం ఏ పని దొరికిన అవమాన పడక చేస్తారు, వాళ్లకు నేనే బారం అన్న బాధ తప్ప నాకు ఇంకో బాధ లేదు. నేను డాక్టర్ అవ్వాలని నాన్న కోరిక అందుకే మా అన్నలు నా కోసం ఇలా కష్టపడి డబ్బు పోగు చేస్తున్నారు, అప్పులు కూడా చేశారు, ఈ ఇల్లు కూడా తాకట్టు లోనే వుంది, ఇంత కన్నా ఎం లేదు అన్నయ్య మా గురుంచి చెప్పటానికి అని ప్రియ చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *