ఆది – Part 5 236

అను : వద్దులే నువ్వనుకున్నదే చెయ్యి, వాళ్ళకి కూడా తెలియాలి ఇన్ని రోజులు వేరు చేసినందుకు మనం పడ్డ బాధలకి మళ్ళీ మనమే తగ్గి బతిమిలాడుకోవడం.. ఇవన్నీ నా వల్ల కాదు.

ఆదిత్య : ఇంటికెళ్లి చెప్పు, బావ వచ్చాడు నన్ను తీసుకెళ్తాడని

అను : ఎందుకు మళ్ళీ

ఆదిత్య : లేదులే అత్తతో చిన్న పంచాయితీ ఉంది, నువ్వెళ్లు నేను ఇంటికెళ్లి ఒకసారి మాట్లాడి అక్కడికి వచ్చి నిన్ను తీసుకెళతా.

అను : సరే అని అనురాధ ఇంటికి వెళ్ళిపోయింది.

అనుని పంపించేసాక ఒకసారి నేను ఇన్ని రోజులు గడిపిన బార్ దెగ్గరికి వెళ్లాను. బార్ క్లోజ్ చేసి ఉంది, నన్ను చూడగానే బార్ లో పని చేసే కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నా నువ్వు వెళ్ళిపోయాక ఓనర్ అన్నని కొట్టారు, మల్లేష్ వచ్చాడు నీ గురించి తెలుసుకుని వెళ్ళిపోయాడు ఎందుకయినా మంచిది జాగ్రత్త అన్నా.

ఆదిత్య : అలాగేలే అని అక్కడనుంచి ఓనర్ అన్న ఇంటికి వెళ్లి పలకరించి నా వల్లే తనకి అలా జరిగింది కాబట్టి సారీ చెప్పి అక్కడ నుంచి బెంగుళూరు లోనే రెంట్ కి తీసుకున్న ఇంటికి వచ్చాను. గేట్ తీసుకుని లోపలికి వెళుతుంటే ఇంటి ముందే అమ్మా నాన్నా మౌనంగా కూర్చున్నారు, వెళ్లి అమ్మ పక్కన కూర్చున్నాను అమ్మ నాన్న భుజం మీద తల పెట్టుకుని కూర్చుంటే నేను అమ్మ భుజం మీద తల పెట్టుకుని వెనక నుంచి కౌగిలించుకున్నాను.. ఇద్దరు చూసారు.. అమ్మ ఏడుస్తూ కొట్టేసింది.

ఆదిత్య : అమ్మ.. అమ్మా… ఆగవే

మంజుల : వదిలేసి వెళ్ళిపోయావుగా, ఎంత నీకు అది దూరం అయితే మమ్మల్ని ఇలా వదిలేస్తావా.. పో.. వెళ్ళిపో.. నీతో మాకేం అవసరం లేదు, మేము నువ్వు లేకుండా అలవాటు పడిపోయాం.. వెళ్ళిపో.

ఆదిత్య : అమ్మ.. నిజంగా సారీ మా, నాన్నా సారీ బాగా ఏడిపించానా

రాజు : బాగా అని కళ్ళు తుడుచుకున్నాడు.. వెంటనే కౌగిలించుకున్నాను అమ్మని కూడా దెగ్గరికి లాగి ఇద్దరినీ వాటేసుకున్నాను.. మీకు దూరంగా ఉన్న ఇన్ని రోజుల్లో ఒక్క విషయం నేర్చుకున్నాను.. జీవితాంతం ఉపయోగపడేది.

మంజుల : ఏంటో అది.. అని ఏడుస్తూనే అడిగింది.

ఆదిత్య : ఏం జరిగినా మిమ్మల్ని వదిలిపోననీ, ప్రామిస్ ఇక పదండి వెళదాం.

రాజు : ఎక్కడికి?

ఆదిత్య : నీ కోడలు దెగ్గరికి, అనుని తీసుకుని అక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళిపోదాం.. అది రెడీగా ఉంది.

మంజుల : దాన్ని కలిసావా

ఆదిత్య : హా.. ఈ రెండు రోజులు నా దెగ్గరే ఉంది.. పదండి వెళదాం… అని ముగ్గురం ఇంట్లో నుంచి బైటికి అడుగు పెడుతుండగా, సరిత అత్త ఏడ్చుకుంటూ రవి మావయ్యతో పాటు ఎదురు వచ్చింది.

సరిత : అన్నయ్య.. ఎవరో అనుని బలవంతంగా తీసుకువెళ్లారు.. రౌడీలు.

రాజు : ఎవరు.. రవి.. ఏమైంది…?

1 Comment

  1. గుడ్ అండ్ థాంక్స్

Comments are closed.