రవి : మల్లేష్ అని ఇక్కడ పెద్ద రౌడీ బావ, వాడి మనుషులే..
రాజు : పదా వెళదాం..
ఆదిత్య : నాన్నా, నేనెళతాను
రాజు : లేదు…
ఆదిత్య : లేదు నాన్నా, వాడితో గొడవ పడ్డది నేను.. నేనే వెళతాను. అని అత్తని చూసి బైటికి వచ్చాను.
బండి తీసి నేరుగా మల్లేష్ దెగ్గరికి వెళ్లాను. వాడి అడ్డాలోకి వెళుతూనే వాడి మనుషులు నన్ను చూసి గుర్తు పట్టారు, ఒక్కొక్కడిని కొట్టుకుంటూ మల్లేష్ ముందు నిల్చున్నాను.. అప్పటికే నా గురించి వాడికి అర్ధమైందేమో టేబుల్లో నుంచి గన్ తీయగానే టేబుల్ ని ఒక్క తన్ను తన్నాను, వాడి చేతిలో ఉన్న గన్ ఎగిరి నా చేతుల్లో పడింది. కాలు ఎత్తి వాడి గుండె మీద తన్ని గన్ వాడి తలకి గురిపెట్టాను.
ఆదిత్య : చెప్పు నా కొడకా, ఎక్కడ దాచావ్.. అని తొడ మీద షూట్ చేసి మళ్ళీ తలకి పెట్టాను.
మల్లేష్ : అరుస్తూ… రాబర్ట్… రాబర్ట్ ఎత్తుకు పోయాడు.
ఆదిత్య : ఎక్కడికి..
మల్లేష్ : తెలీదు, అంత వరకే తెలుసు..
ఆదిత్య : చెయి ఫోన్ చెయి.. కనుక్కో అని ఇంకో తొడ మీద కూడా షూట్ చేసాను ఇంతలో ఫోన్ మోగింది.. విక్రమ్ బిజీగా ఉన్నాను మళ్ళీ చేస్తా
విక్రమ్ : మానసని ఎత్తుకు పోయారు, ఎవడో రాబర్ట్ అట ఇక్కడ నలుగురుని పీకితే వాడి అడ్రస్ దొరికింది..
ఆదిత్య : వస్తున్నా అని ఎదురుగా ఉన్న మల్లేష్ ని తన్ని.. వాడికి తెలిసింది మొత్తం చెప్పమన్నాను మొత్తం కక్కాడు, బైటికి వచ్చి బండి తీసి విక్రమ్ షేర్ చేసిన లొకేషన్ కి బైలుదేరాను.. హైవే మీద ఇద్దరం కలుసుకున్నాం.. నాన్ స్టాప్ గా నాలుగున్నర గంటలు 140kmph స్పీడ్ లో కొడితే ఊరు వచ్చింది.. హైవే దిగి ఊర్లోకి అక్కడనుంచి చిన్న అడవి లాంటి సన్నటి దారి గుండా లోపలికి వెళితే పెద్ద కాంపౌండ్ చెక్కలతో కట్టి ఉంది అప్పటికే ఫైరింగ్ శబ్దాలు విని బండి అక్కడే వదిలేసి లోపలికి వెళ్ళాము.
ఎవడో ఒక్కడే అందరిని నరుకుతున్నాడు, వాడిని వల వేసి పట్టుకున్నారు, వలకి అటు చివర మానస. ఇటు చివర అను పట్టుకుని ఉంటే మిగతా ఇద్దరు ఆపడానికి ట్రై చేస్తున్నారు చూస్తుండగానే వల తెంపుకుని బైటికి వచ్చాడు.. వాడి గొడ్డలి పట్టుకున్న చేతిని ఒకడు వాడిని ఇంకొకడు పట్టుకున్నారు.. కానీ వాడి బలం ముందు వీళ్ళు ఆగలేరు.. నన్ను చూడగానే అను ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చింది.
అను : బావ ముందు అన్నయ్యని ఆపండి అని ఏడవటం మొదలు పెట్టింది
ఆదిత్య : నీకెప్పుడు అయ్యాడే అన్నయ్య
మానస : మాటలు ఆపి త్వరగా వెళ్ళండి కోపంలో తన కుటుంబం వాళ్లనే నరకడానికి వెళుతున్నాడు.
విక్రమ్ : వెళుతున్నాం.
ఇద్దరం ఒకరినొకరం చూసుకుని ముందు పరిగెత్తాం ఆపడానికి.. ముందుకు పరిగెడుతూనే పక్కన పడి ఉన్న శవాలని చూసాను, చాలా కచ్చిగా గోరంగా నరికాడు.. పరిగెత్తుకుంటూ వెళుతూనే ప్లాన్ వేసుకుని చాలా కష్టపడి ఆపాము. అను ఈలోగా గాయపడిన ఒక అమ్మాయిని అంబులెన్సులో హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. ఇక్కడ వీడిని స్పృహ తప్పేలా విక్రమ్ వాడిని ఎత్తి పెద్ద డ్రమ్ ఉంటే అందులోకి విసిరేసి అదిమి పట్టాడు.
వాడు తెరుకున్నాక హాస్పిటల్ కి బైలుదేరాం, తన భార్య స్పృహలోకి వస్తుందని చెప్పిన తరువాత గాని వాడు మళ్ళీ మాములు మనిషి కాలేదు. అక్కడే ఉంది కొంచెం మందేసి ఇక బైలుదేరదాం అని సైగ చేస్తే అందరూ బైటికి నడిచారు.
వాసు : థాంక్స్ అండ్ సారీ
విక్రమ్ : మేమే నీకు థాంక్స్ చెప్పాలి, మా ప్రాణాలని కాపాడావు అని మానసని చూసాడు..
బైటికి వచ్చి అందరం బండి ఎక్కాము అనురాధ తనని చూసి నవ్వమని సైగ చేసి వచ్చి నా బండి ఎక్కింది. ఊరి నుంచి బైటికి వచ్చి సిటీలో రూం రెంట్ కి తీసుకున్నాం. నలుగురం ఫ్రెష్ అయ్యి హోటల్ కి వెళ్లి భోజనం చేస్తున్నాం.

గుడ్ అండ్ థాంక్స్