ఆది – Part 5 227

ఆదిత్య : ఇప్పుడు చెప్పవే ఎవరా అన్నయ్య, ఆ అన్నయ్య స్టోరీ.. మరీ వైలెంట్ గా ఉన్నాడు.

అను : పేరు వాసు, ఇంతకముందు పాత గొడవలట.. తన ఫ్యామిలీ జోలికి వచ్చేసరికి కంట్రోల్ తప్పాడు, మంచి ఫన్నీ కాండిడేట్ కానీ రెచ్చగొట్టకూడదు.. ఆంగర్ మానేజ్మెంట్ లేదు… చూసారుగా

విక్రమ్ : ఆ.. చూసాం చూసాం..

ఆదిత్య : నా నడ్డి విరిగిందనుకో..

అను : ఇంతకీ మేము ఇక్కడే ఉన్నాం అని మీకెలా తెలుసు..

ఆదిత్య : అదంతా తరువాత.. మీరిద్దరూ ఇక్కడనుంచి కలిసి వెళ్లిపోండి.. నాకు విక్రమ్ కి పని ఉంది.

మానస విక్రమ్ ని చూసింది.. విక్రమ్ నాకు కూడా ఏం తెలీదు అని సైగ చేసాడు.

అను : సరిగ్గా చెప్పు..

ఆదిత్య : మిమ్మల్ని ఎక్కడ దాచారో తెలుసుకోడానికి మల్లేష్ అని ఒక రౌడీని కలిసాను వాడు చెప్పాడు అస్సలు కధ.
ఈ అనాధ ఫౌండేషన్స్ అన్ని సంధ్య అనే ఆవిడ పేరు మీద ఉన్నాయట వీటి మీద ఇల్లీగల్ పనులు చేసేది ఆమె కొడుకేనట వీడు కేవలం ఆఖరి స్థాయి నౌకరు అంతే.. వీడి మీద చాలా మంది పై వాళ్ళు ఒక గవర్నమెంటే ఉంది.. మెయిన్ తల విక్రమాదిత్య అనే వాడి కొడుకు.. అని వాడికి తెలిసింది కొంచెం చెప్పాడు.. చాలా పెద్ద బిజినెస్ మాన్ చాలా సంఘ సేవలు చేసిన వ్యక్తి అని తెలిసింది.. వికీపీడియాలో ఉంది కానీ ఒక్క ఫోటో కూడా దొరకలేదు.. మేమిద్దరం సంధ్య గారిని కలిసి ఈ కధ ఏంటో తెలుసుకోవాలి వీళ్ళని ఆపడానికి నాకు దొరికిన దారి ఇదే.. కొడితే మెయిన్ తలే పడిపోవాలి.. అందుకే అక్కడికి వెళుతున్నాం.

అను : మీరు విక్రమ్ అండ్ ఆదిత్య… తన పేరు విక్రమాదిత్య.. బాగుంది ఇదేదో ఇంట్రెస్టింగ్…

మానస : ఈ కధలో మొదటి నుంచి ఉన్నాను.. నేను కూడా వస్తాను.

అను : అవును మేము కూడా వస్తాం..

ఆదిత్య విక్రమ్ ని చూసాడు.. సరే అనగానే

ఆదిత్య : అను ముందు ఇంటికి వెళదాం.. అక్కడ సెటిల్ అయ్యాక ఈ పని చూద్దాం.

అను : నేను కాల్ చేసి చెపుతాలే.. ఈ అడవెంచర్ ముఖ్యం.. ముందు వెళదాం.. అని ఉత్సాహంగా ఫోన్ తీసుకుని ఇంటికి వీడియో కాల్ చేసి మాట్లాడి ముఖ్యమైన పని మీద బైటికి వెళుతున్నాం అని ఒక పావుగంట అందరితో మాట్లాడి పెట్టేసింది.

ఆదిత్య : ఏమంటున్నారు?

అను : ముందు ఇంటికి రమ్మని గొడవ చేస్తున్నారు.. కుదరదని చెప్పా

ఆదిత్య : విక్రమ్ మీ సంగతి

విక్రమ్ : మా అమ్మకి అన్ని చెప్తూనే ఉన్నా, ఇక మానస నా దెగ్గర ఉన్నంత వరకు మా అత్తగారికి ఏ ఇబ్బంది లేదు.. దానికి మానస నవ్వింది.

ఆదిత్య : ఇవ్వాలంతా ఇక్కడే రెస్ట్ తీసుకుని రేపు బైలుదేరదాం.. ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్ళండి.

అను : నాకు తెలుసు.. అనుకుంటూనే ఉన్నా.. నీకు ఏ రెస్ట్ కావాలో నాకు తెలుసులే.. అనగానే విక్రమ్ కి పోరబోయి దగ్గాడు.. మానస లేచి విక్రమ్ తలమీద తట్టింది. అందరూ తినేసి ఎవరి రూంలోకి వాళ్ళు వెళ్లారు..

ఇక్కడితో ఆదిత్య లవ్ పార్ట్ సమాప్తం.. విక్రమ్ రిచి రిచ్ లో కలుద్దాం.

1 Comment

  1. గుడ్ అండ్ థాంక్స్

Comments are closed.