కానీ నాకు పడటం మాత్రం నా లక్! 2 160

నాకు తన మీద కోపం పూర్తిగా పోయింది. తను చాలా మిస్టేక్స్ చేసింది. అదంతా ఒక మోసగాడి వల్ల. అప్పటికి తను నాకు ప్రామిస్ చేసింది ఇంకొకసారి చేయను అని. తనని చాలా మిస్ అవుతున్నాను. ఒకరోజు రెస్టారెంట్ లో కూర్చుని ఒక పెద్ద మెయిల్ టైప్ చేసాను. ఇంటికి వచ్చేయ్ ఇద్దరం కలిసి ఉందాం. నేను నిన్ను క్షమిస్తున్నాను అని.

కాసేపటికి నా ఫోన్ మోగింది. నేను శిల్ప అనుకున్నాను..

“హాయ్ శిల్ప” అన్నాను

“కాదు సల్మా ని” అంది అవతలి నుండి

“సల్మా నా?” అన్నాను గుర్తు లేక

“హా డిటేక్టీవ్ ఏజెన్సీ నుండి” అంది

“హ చెప్పండి” అన్నాను

“మీ ఆవిడ గురించి ఫుల్ రిపోర్ట్ రెడీ చేసాం. మీరు 9 లోపల మా ఆఫీస్ కి వస్తే ఎక్సప్లయిన్ చేస్తాను” అంది

“ఏం తెలిసింది?” అన్నాను

“అది ఫోన్ లో చెప్పేది కాదు ఆఫీస్ కి రండి మొత్తం తెలుసుకుందురు” అంది

“మీరింకా నేను తెలుసుకోవాలి అనే అనుకుంటున్నారా” అన్నాను

అటు నుండి ఎటువంటి సమాధానం లేదు.

“హలో” అన్నాను

“మీరు అడిగిన క్వశ్చన్ కి ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాను. మీకు ఆరోజే చెప్పాను కదా తెలుసుకోవటం అవసరమా అని, మీరు మాకు పని అప్పజెప్పారు మేము చేసాం, అది తెలుసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం” అంది

“హ్మ్” అన్నాను

“ఒకటి అడుగుతాను మీ ఆవిడకి విడాకులు ఇద్దాం అనుకున్నారా?” అంది

“లేదు, తనకి ఇంకొక ఛాన్స్ ఇద్దాం అనుకున్నాను” అన్నాను

“అర్ధం అయింది అరుణ్ మీకు ఇంక ఆ అవసరం లేదని, గతాన్ని మర్చిపోయి హ్యాపీ గా ఉండండి. మిగతా పేమెంట్ కూడా అక్కర్లేదు. ఆల్ ది బెస్ట్” అంది

నేను కాల్ కట్ చేసి కార్ ని ఇంటికి పోనిచ్చాను.

మరుసటి రోజు శిల్ప నుండి మెయిల్ వచ్చింది.

డియర్ అరుణ్

థాంక్యూ నన్ను క్షమించినందుకు. లవ్ యు. నేను పూర్తి చేయాల్సిన పని ఇంకా ఉంది, వాటి గురించి నీకు ఎప్పుడు చెప్పలేదు. కానీ త్వరలోనే ఇంటికి తిరిగి వస్తాను

నీ శిల్ప

ఆ మెయిల్ నాకు మళ్ళీ అనుమానాన్ని రేపింది. మళ్ళీ నా నుండి ఇంకా దాస్తుంది అనిపించింది. మనసేమి బాలేదు. రోజంతా శిల్ప ని తిట్టుకుంటూనే ఉన్నాను. అంతలో నాకు సల్మా గుర్తు వచ్చింది.

సాయంత్రం వర్క్ అయ్యాక డైరెక్ట్ గా ఏజెన్సీ దగ్గరికి వెళ్ళాను. రిసెప్షనిస్ట్ వెయిట్ చేయమంది సల్మా వేరే వాళ్ళతో మాట్లాడుతుంది అని. నేను వెయిట్ చేయటం మొదలుపెట్టాను. నా గుండె చాలా వేగం గా కొట్టుకుంటుంది ఎందుకో. కాసేపటికి ఒక అతను ఫైల్ తీసుకుని కోపం గా బయటకు నడుచుకుంటూ వచ్చాడు. అతని వెనకే సల్మా కూడా వచ్చింది

నన్ను చూసి రమ్మని సైగ చేసింది. నేను వెళ్ళాను

“నువ్వు వస్తావో రావో అనుకున్నాను. కానీ వచ్చావ్. ఎందుకు వచ్చావ్ అని అడగను” అని రిసెప్షన్ కి కాల్ చేసి శిల్ప ఫైల్ తీసుకురమ్మని చెప్పింది.

“ఎమన్నా తాగుతావా?” అంది

“హ వాటర్ చాలు” అన్నాను

“నేను చెప్పింది విస్కీ, స్కాచ్ గురించి” అంది

“వద్దు నాకు ఇప్పుడు తాగాలని లేదు” అన్నాను

“నన్ను నమ్ము అరుణ్ ఇప్పుడు నువ్వు తాగితేనే కరెక్ట్” అని మళ్ళీ రిసెప్షన్ కి కాల్ చేసి స్కాచ్ తెమ్మని చెప్పింది.

కాసేపటికి ఫైల్, స్కాచ్ రెండు లోపలికి వచ్చాయి. సల్మా ఇద్దరికీ గ్లాస్ లో పోసింది

“సారీ ఐస్ లేదు” అంటూ గ్లాస్ ని నా ముందుకి తోసింది. నేను అసలు పట్టుకోకుండా

“ముందు వచ్చిన పని చూద్దామా” అన్నాను

“ఉఫ్ సరే, కానీ ఒకటి చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడినుండి వచ్చింది ఎలా వచ్చింది అని మాత్రం అడగకూడదు. ఇవేమి రూమర్స్ నుండి కలెక్ట్ చేయలేదు” అంది

నేను సరే అని తల ఊపాను.

“సరే ముందు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుండి మొదలుపెడుతున్నాను. మీ భార్య శిల్ప పెయింటింగ్ కోసం Mr బలరాం తో డీల్ మాట్లాడుకున్నారు. అలా వాళ్ళిద్దరి మధ్య అఫైర్ మొదలయింది అంతే కదా. కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే శిల్ప పెయింటింగ్ సరిగ్గా వేయలేదు. టైం దగ్గర పడుతుంటే చాలా టెన్సన్ పడింది. మీ ఇంటికి ఒక్క బలరాం ఏ కాదు. పెయింటింగ్ స్టార్ట్ అయిన 4 వ రోజు నుండి Mr తరుణ్ కూడా వచ్చాడు.” అంది

3 Comments

Add a Comment
  1. Is this end for the story or is there any continuation is there

  2. Masterly scripted thrilling story.3cheers to story teller.
    Good to read after long gap similar thrill n chill story ‘Night Shift’ over 30 episodes ????

  3. Inka continue chesi unte bagundedhi mitrama.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *