డిటెక్టివ్ – Part 2 137

కాకపోతే చందన జేమ్స్ దగ్గరికి వెళ్లి శేఖర్ చనిపోయాడు అని చెప్పింది దాంతో జేమ్స్ స్కూల్ లో ఉన్న పిల్లలు అందరితో కలిసి శేఖర్ ఆత్మ శాంతి కోసం ప్రార్థన చేయించాడు అప్పుడు రేపు ఉదయం ఫ్లయిట్ లో ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి లండన్ వెళ్లుతున్నాం ప్రోమో వీడియో పంపించమని అడిగాడు దాంతో చందన తన ఫోన్ మెయిల్ నుంచి థామస్ మెయిల్ కీ వీడియో పంపింది ఆ తర్వాత శేఖర్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటి అని చూసింది అందులో longitude, latitude లో ఏదో అడ్రస్ వచ్చింది దాని గూగుల్ మ్యాప్ లో చూసి వెళ్లింది అది మొన్న శేఖర్, కృష్ణ వెళ్లిన సిడి షాప్ అప్పుడు ఆ మెసేజ్ లో ఏదో కోడ్ పదం అని ఉంటే అది ఆ షాప్ అబ్బాయి తో చెప్పింది దానికి వాడు చుట్టూ చూసి ఒక సిడి తీసి ఇచ్చాడు అప్పుడే ఒక బుల్లెట్ వచ్చి వాడి తలకు తగిలింది దాంతో చందన అక్కడి నుంచి పారిపోతుంటే థామస్ బిల్డింగ్ పై నుంచి చందన నీ కాలుస్తూ ఉన్నాడు కాకపోతే చందన గుంపు లో తప్పించుకోని వెళ్లింది ఆ తర్వాత థామస్ వెళ్లి ఆ సిడి తీసుకోని విరగోటి వెళ్లిపోయాడు.

తరువాత చందన ఇంటికి వెళ్లి తనకి వచ్చిన మెసేజ్ నీ సరిగ్గా చూస్తే అది ఒక వెబ్ సైట్ అడ్రస్ అందులోకి వెళ్లి చూస్తే శేఖర్ చివరగా ఒక వీడియో పెట్టాడు “చందు నువ్వు షాప్ కీ వెళ్లకుండా ఈ వీడియో చూస్తే నీకు ఒక క్లూ రవి కిషోర్ బెడ్ కింద లెటర్ ఉంది అందులో నీ క్లూ ఉంది ఒక వేళ నువ్వు షాప్ వెళ్లి ఈ వీడియో చూస్తే ఈ మర్డర్ చేసినవాడి ఫోటో నీకు దొరుకుతుంది” అని ఆగిపోయింది ఆ వీడియో ఇప్పుడు షాప్ కీ వెళితే రిస్క్ అని హాస్పిటల్ కీ వెళ్లింది అక్కడ రవి కిషోర్ చనిపోయాడు అని అతని బాడి తీసుకోని వెళ్తున్నారు ఫుల్ హడావిడిగా ఉంది తను ఎలాగో లోపలికి వెళ్ళింది అక్కడ బెడ్ కింద ఒక లెటర్ ఉంది అందులో

” you won’t deserve this world brother rest in paradise” అని రాసి ఉంది దాంతో చందన ఈ డైలాగ్ ఎక్కడో విన్నాను అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు గుర్తుకు వచ్చింది అది థామస్ డైలాగ్ అని అంటే కిల్లర్ థామస్ అని తెలిసి షాక్ అయ్యింది.

చందన ఆ లెటర్ చదివి థామస్ ఏ కిల్లర్ అని తెలుసుకుంది కానీ వాడే కిల్లర్ అని ప్రూఫ్ చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవు అందుకే ఏమీ చేయాలో తెలియక ఆలోచిస్తూ హాస్పిటల్ నుంచి బయటికి వస్తుంటే థామస్ బైక్ మీద వచ్చి గన్ తో మళ్లీ చందన పైన ఎటాక్ చేశాడు దాంతో చందన అక్కడి నుంచి పారిపోయింది అప్పుడు ఒక కార్ వచ్చి చందన నీ ఎక్కించుకోని వెళ్లింది కొంచెం ముందుకు వెళ్లగానే ఆ కార్ డ్రైవర్ బ్రేక్ వేస్తే థామస్ సడన్ బ్రేక్ వేసి జారీ పడ్డాడు ఆ తర్వాత ఆ కార్ వేగంగా బెంగళూరు హైవే ఎక్కింది థామస్ నుంచి తప్పించుకున్నా అని చందన ఊపిరి పీల్చుకున్ని ఆ కార్ డ్రైవర్ నీ చూసింది తను సౌమ్యా (చందన పని చేసే చానెల్ ఓనర్) తన బాస్ తనకి డైరెక్ట్ గా వచ్చి సహాయం చేయడం చందన నీ ఆశ్చర్యానికి గురి చేసింది, ఆ తర్వాత సౌమ్యా చందన నీ తీసుకోని ఒక గెస్ట్ హౌస్ కీ వెళ్లింది లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకుని రేపు ఉదయం మాట్లాడుదాం అని చెప్పి సౌమ్యా వెళ్లి పడుకుంది, ఇంత జరిగాక చందన కీ నిద్ర రాదు అని తెలిసి ముందుగానే తనకి ఇచ్చే injection నీ వాటర్ కలిపి ఉంచింది సౌమ్యా ఆ నీళ్లు తాగి చందన ప్రశాంతంగా నిద్రపోయింది.

రామచంద్ర కృష్ణ మాట్లాడింది విన్న తర్వాత శేఖర్ ఇన్వెస్టీగేషన్ చేస్తున్న కేసు మీద ఆలోచన పెట్టాడు ఒక ఆక్సిడేంట్ కేసు నీ, ఒక మామూలు హార్ట్ ఎటాక్ కేసు కోసం తన కొడుకు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు అని ఆలోచించి ఆ రెండు కేసుల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తెప్పించి చూశాడు DK కేసు లో రిపోర్ట్ ప్రకారం అతని తల కీ విండో గ్లాస్ తగిలి మెడ తెగి చనిపోయాడు అని ఉంది, కాకపోతే ఆ రిపోర్ట్స్ తో పాటు ఫొటోలు చూశాడు కాకపోతే అక్కడ మెడ తెగిన మాట నిజం కానీ కొన్ని పంటి గాట్లు కూడా తెలుస్తున్నాయి, ఆ తర్వాత రవి కిషోర్ రిపోర్ట్ ప్రకారం సాయంత్రం ఊపిరి అందక, ఆక్సిజన్ సిలిండర్ కూడా అయిపోవడము తో చనిపోయాడు అని రాసి ఉంది కాకపోతే ఆ రోజు ఉదయమే ఆ రూమ్ లో కొత్త సిలిండర్ నింపి వెళ్లారు అన్న విషయం గుర్తుకు వచ్చింది, తరువాత శేఖర్ రిపోర్ట్ ప్రకారం బుల్లెట్స్ అని 6mm లోతులో దిగాయి అంత లోతులో దిగాయి అంటే అదీ కచ్చితంగా సనైపర్ గన్ నుంచే వచ్చి ఉండాలి అలాంటి గన్ నీ సిటీ లో ఎవరు అమ్ముతున్నారో కనుకోమని చెప్పాడు ఆ తర్వాత సిడి షాప్ కాంప్లెక్స్ లో జరిగిన కాల్పుల గురించి తెలుసుకొని వెళ్లాడు అక్కడ ఆ కుర్రాడికి తగిలిన బుల్లెట్ శేఖర్ బుల్లెట్ తో మ్యాచ్ అయ్యింది, దాంతో రామచంద్ర కీ అనుమానం వచ్చింది ఇది ఏమైన లైసెన్స్ గన్ అయి ఉంటుందా అని అలా ఆ బుల్లెట్స్ నెంబర్ నీ చూసి ఆ మాడల్ గన్ కనుక్కొని అది ఎవరి దగ్గర ఉందో తెలుసుకోమని చెప్పాడు.

ఇక్కడ చందన మరుసటి రోజు ఉదయం లేచే సరికి సౌమ్యా హాల్ లో కూర్చుని కాఫీ తాగుతూ టీవీ చూస్తూ ఉంది అప్పుడే చందన రావడంతో వచ్చి కూర్చోమని చెప్పి సైగ చేసింది చందన కూర్చున్న తరువాత “నువ్వు పోయిన సంవత్సరం ఆ చిల్డ్రన్స్ ట్రాఫికింగ్ కేసు కవరేజ్ చేశావు కదా” అని అడిగింది దానికి అవును అన్నట్లు తల ఆడించింది ఆ తర్వాత కాఫీ కప్పు కింద పెట్టి “చందన నువ్వు చేసిన దానికి మన చానెల్ చాలా టాప్ కీ వచ్చింది దానికి థాంక్స్ కాకపోతే నాకూ ఒక చిన్న పని చేసి పెడితే నీకు ప్రమోషన్ గ్యారంటీ ” అని చెప్పింది కానీ శేఖర్ చనిపోవడంతో తన మనసు దేని మీద ఏకాగ్రతగా లేదు అప్పుడు సౌమ్యా “నేను నిన్ను ఈ హెల్ప్ నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు అని అడగడం లేదు నువ్వు నా ఫ్రెండ్ చంద్రశేఖర్ గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతున్నా ” అని చెప్పి అర్జున్ ఫోటో చూపించి “వీడు శేఖర్ బెస్ట్ ఫ్రెండ్ కొడుకు అర్జున్ వీడు పూటక ముందే వాళ్లుకు ఒక ఆక్సిడేంట్ అయ్యింది అందులో వీడి నాన్న చనిపోయాడు వీల అమ్మ వీడికి డెలివరీ ఇస్తూ చనిపోయింది కాకపోతే వీడికి అమెరికా citizenship ఉంది అందుకే అక్కడే ఉంచి చదివిస్తున్నాడు చందు ఇప్పుడు వీడు అక్కడ అనాధ లాగా పెరగడం ఇష్టం లేక శేఖర్ వీడిని దత్తత తీసుకొని ఇండియా తీసుకోని రావాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇలా అయింది శేఖర్ నన్ను చివరిగా కలిసినప్పుడు adopting డాక్యుమెంట్ లో సంతకం పెట్టాడు నిన్ను పెళ్లి చేసుకుని నువ్వు సంతకం పెడితే వాడిని ఇండియా తీసుకోని రావచ్చు అందుకే నిన్ను అడుగుతున్న నువ్వు ఈ సంతకం పెడితే శేఖర్ చివరి కోరిక తీర్చిన దానివి అవుతావు ” అని చెప్పింది దాంతో చందన ఆలోచనలో పడింది అప్పుడు సౌమ్యా “నువ్వు ఇప్పుడే పెట్టాల్సిన అవసరం లేదు వాడిని నా చెల్లి అక్కడ చూసుకుంటుంది రేపు వాళ్లు ట్రిప్ కోసం లండన్ వెళ్తున్నారు నువ్వు వెళ్లడానికి కూడా ఏర్పాటు చేశా వాడితో వారం తిరిగి వచ్చిన తర్వాత డిసైడ్ అవ్వు” అని చెప్పింది సౌమ్యా, దాంతో లండన్ వెళ్లి థామస్ నీ చంపోచ్చు అని ఆలోచించి లండన్ కీ వెళ్లడానికి ఒప్పుకుంది చందన.

1 Comment

  1. This site is related to sex stories. But all the stories are related fixon or cini stories. Who will show interest to read. Earlier also i wrote.

Comments are closed.