డిటెక్టివ్ – Part 2 137

ఇక్కడ ఇండియా లో రామచంద్ర తన కొడుకును చంపిన వాడి కోసం డిపార్టుమెంటు లో తనను మళ్లీ ఎవరూ వేలు ఎత్తి చూపకుండా ఉండాలి అని రాత్రి పగలు కష్టపడుతు ఉన్నాడు ఎటు చూసినా దారులు అని మూసుకొని వెళ్లుతున్నాయి అప్పుడు పోస్టు మార్టం రిపోర్ట్ మళ్లీ మళ్లీ చూసి కోపంతో ఫైల్ విసిరేసాడు “నా ముందు నిక్కర్ వేసుకొని తిరిగి పెరిగిన ఆ కుర్ర కుంక వాడి మాటలకి నేను ఎందుకు సమాధానం చెప్పాలి రోజుకు ఎంతోమంది చస్తున్నారు అందులో వీడు ఒకడు అయితే మాత్రం వీడి కోసం నేను నా టైమ్ ఎందుకు పాడు చేసుకోవాలి” చిరాకుగా అరిచి సిగరెట్ నోట్లో పెట్టుకుని లైటర్ కోసం చూసి దొరక ఒక కానిస్టేబుల్ నీ అగ్గిపెట్ట అడిగాడు అతను కంగారుగా వస్తూ శేఖర్ ఫైల్ నీ కాలితో తన్నితే కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయ్ అందులో ఒక ఫోటో రామచంద్ర కాలి దగ్గర పడింది అది చేతిలోకి తీసుకుని చూస్తే అది శేఖర్ వీపు ఫోటో అందులో శేఖర్ వీపు మీద “G” అని tattoo ఉంది అది చూసి రామచంద్ర షాక్ అయ్యి తన డ్రైవర్ తో హాస్పిటల్ కీ వెళ్లాలి అని చెప్పాడు.

అక్కడ చందన, శారదా నీ కార్ లోనే ఉండమని చెప్పి లోపలికి వెళ్లింది అక్కడ బ్యాక్ స్టేజీ లో అందరూ రిహార్సల్ చేస్తుంటే థామస్ వనిత నీ తీసుకోని పై ఫ్లోర్ కీ వెళ్లుతు కనిపించాడు కానీ డైరక్షన్ వేరే వైపు చూపిస్తుంటే వనిత వైపు చూసింది చందన తన చేతిలో బాగ్ లేదు అప్పుడు బాగ్ అర్జున్ ఉన్న రూమ్ లో ఉంది ఏమో అని అక్కడికి వెళ్లింది అనుకున్నటే అర్జున్ ఆ రూమ్ లో ఉన్నాడు అప్పుడు చందన వాళ్లు ఎక్కడికి వెళ్లారు అని అనుమానం తో వాళ్ళని ఫాలో అయ్యింది థామస్ వనిత నీ తీసుకోని హాల్ లో పై ఫ్లోర్ కీ వెళుతు “అమ్మ నీకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంది” అని చెప్పి తీసుకోని వెళ్లాడు అక్కడ జేమ్స్ వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వనిత రాగానే తన గడ్డం తీసి కళ్లకు ఉన్న అద్దాలు తీసి తన చేత్తి కర్రతో వనిత వైపు అడుగులు వేస్తూ వచ్చాడు అతని చూసి షాక్ అయిన వనిత కళ్ల లో నీళు తిరిగాయి వెంటనే అతని గట్టిగా కౌగిలించుకున్ని “రాజ్” అని అరిచింది అప్పుడు దేవరాజ్ వనిత నీ తన గుండెల్లకు హత్తుకోని “అవును వనిత నేనే నీ రాజ్ నీ” అని అన్నాడు తన కళ్లను తనే నమ్మలేదు చందన 20 సంవత్సరాల క్రితం చనిపోయిన దేవరాజ్ ఇంకా ఎలా బ్రతికి ఉన్నాడు అని అప్పుడు అర్జున్ గురించి తెలుసుకోవడానికి శారదా చందన కీ ఫోన్ చేస్తే ఆ సౌండ్ కీ లోపల ఉన్న ముగ్గురు చందన వైపు చూశారు.

దాంతో చందన అర్జున్ నీ తీసుకోని అక్కడి నుంచి కిందకు వచ్చి శారదా నీ కార్ తీయమని చెప్పింది కాకపోతే థామస్ గన్ తో ఎటాక్ చేస్తే చందన అర్జున్ తో పరిగెత్తి పారిపోయింది అప్పుడు థామస్ ఒక బైక్ అతని కొట్టి బైక్ తో వాళ్ళని వెంబడించాడు,
ఇండియా లో రామచంద్ర హాస్పిటల్ లో డాక్టర్ నీ కలిసి శేఖర్ బాడి కోసం మార్చరి కీ వెళ్లారు అక్కడ కోల్డ్ బాక్స్ లో ఉన్న శేఖర్ శవం తీసి దాని వెనకు తిప్పి చూశారు శేఖర్ వీపు పైన “G” అని tattoo చూసి “వీడు చందు కాదు” అన్నాడు రామచంద్ర, అక్కడ థామస్ వెంబడిస్తు ఉంటే ఒక పార్కింగ్ లోకి వెళ్లి లిఫ్ట్ ద్వారా పై ఫ్లోర్ కీ వెళ్లారు చందన, అర్జున్, దాంతో థామస్ బైక్ తో పైకి వెళ్లడం మొదలు పెట్టాడు, రామచంద్ర చెప్పింది విన్న డాక్టర్ “ఏంటి సార్ మొన్న మీరే ఇతను మీ కొడుకు అని చెప్పారు ఇప్పుడు కాదు అంటున్నారు” అని అడిగాడు దానికి రామచంద్ర “ఇప్పుడు అదే చెప్తున్నా వీడు నా కొడుకే కాకపోతే చనిపోయినది చందు కాదు వీడు చందు కాదు గుణ” అని అన్నాడు.

అక్కడ వాళ్లు పై ఫ్లోర్ కీ రాగానే థామస్ బండి బాగా రైస్ చేసి పెట్టాడు చందన లిఫ్ట్ నుంచి బయటకు రాగానే బైక్ తో ముందుకు దూసుకొని వచ్చాడు, అప్పుడే కింద ఫ్లోర్ నుంచి ఒక కార్ వేగంగా వచ్చి చందన అర్జున్ చుట్టూ జీరో కట్ కొట్టింది దాంతో థామస్ ఆ కార్ కీ తగిలి ఎగిరి పడ్డాడు, “అసలు ఈ గుణ ఎవరూ” అని డాక్టర్ అడిగాడు దానికి “నాకూ ఇద్దరు కొడుకులు కవలలు చంద్రశేఖర్, గుణశేఖర్” అని అన్నాడు రామచంద్ర, అప్పుడు చందన కీ ఒక పది అడుగుల దూరం లో పడిన థామస్ లేస్తుంటే కార్ లో నుంచి చంద్రశేఖర్ దిగాడు.

(1999)

ఆ రోజు రాత్రి దేవరాజ్ తన గ్యారేజ్ లో నిశ్చితార్థం ఆగిపోయింది అని డ్రగ్స్ దొరికాయి అని అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఫుల్ బాటిల్ మందు లేపి కోపం లో గ్యారేజ్ లో కనిపించినవి అని విసిరేయడం మొదలు పెట్టాడు తరువాత తాడు తీసి డ్రమ్ మీద ఎక్కి ఉరి వేసుకొబోతుండగా లోపలికి వచ్చాడు జేమ్స్, దేవరాజ్ నీ కిందకు లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు అనుకోకుండా జరిగిన చిన్న తగువు లో దేవరాజ్ డ్రమ్ మీద నుంచి కింద పడుతూ పొరపాటుగా కాలు తో కోడితే జేమ్స్ వెనుక అద్దం మీద పడి మొహం మీద గాజు ముక్కలు ఇరుకుని మెడ తెగి పడి ఉన్నాడు జేమ్స్, దాంతో దేవరాజ్ కూడా పై నుంచి పడడం వల్ల అతని కాలి పైన ఖాళీగా ఉన్న గ్యాస్ సిలిండర్ పడ్డటం తో కాలు విరిగింది అయిన కూడా హడావిడిగా జేమ్స్ చనిపోవడంతో దేవరాజ్ వాడిని పట్టుకొని ఏడ్వడం మొదలు పెట్టాడు దాంతో తనతో తన బెస్ట్ ఫ్రెండ్ నే చంపుకునే లాగా చేసిన వాళ్ళని అసలు వదలకుడద్దు అని నిర్ణయం తీసుకొని తన బదులు జేమ్స్ మెడ చుట్టూ తాడు వేసి ఉరి వేసి మొహం మొత్తం గాజు ముక్కలు ఉండటం తో ఎవరూ గుర్తు పట్టరు అన్న ధైర్యం తో జేమ్స్ నీ తాడు కీ వేలాడతీసి రాత్రి అంత అక్కడే ఏడుస్తు ఉండి పోయాడు దేవరాజ్ ఆ తర్వాత ఉదయం పని వాళ్లు వస్తుంటే కాలు సహకరించలేదు తన కాలు పోయింది అని అర్థం అయ్యింది కానీ అలాగే కుంటుతూ తప్పించుకోని వెళ్లాడు ఆ తర్వాత జేమ్స్ ఇంటికి వెళ్లాడు అక్కడ మెర్సి దేవరాజ్ నీ చూసి షాక్ అయ్యింది తనకు తెలిసిన ఒక డాక్టర్ నీ పిలిచి దేవరాజ్ కీ ట్రీట్మెంట్ చేయించింది ఆ తర్వాత దేవరాజ్ చనిపోయిన విషయం గురించి టీవీ లో వస్తుంటే షాక్ అయ్యి చూసింది మెర్సి, దాంతో జరిగిన విషయం అంతా చెప్పి బాధపడాడు అప్పుడు మెర్సి సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేయబోతుంటే దేవరాజ్ కంగారు లో కత్తి తో పొడిచి శవం తీసుకోని కార్ లో వేసుకొని వెళ్లి స్మశానం లో తగలబెట్టి అక్కడి నుంచి తన సొంత ఊరికి వెళ్లాడు.

1 Comment

  1. This site is related to sex stories. But all the stories are related fixon or cini stories. Who will show interest to read. Earlier also i wrote.

Comments are closed.