తొలి రాత్రి 328

అది ఒక నిజం. అందమైన నిజం. సంవత్సరాలుగా కలలు కన్న కళ్ళకు, జీవితం మరో కొత్త కోణం లో చూపించే నిజమైన రాత్రి. అందరికీ ఉన్నట్టే సాత్వి కి కూడా కొన్ని కలలు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళు రెడీ చేస్తుంటే ఎలా సిగ్గుపడాలో తెలియక మురిసిపోతుంది. నవీన్ పేరు తలుచుకున్నప్పుడల్లా బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి తనకి, అలా తనని చూసినప్పుడల్లా పక్కన ఉన్న అమ్మ, అక్క, అప్పుడే ఇంటర్ చదువుతున్న పెదనాన్న కూతురు మహిత కు కూడా నవ్వొస్తోంది. కాసేపు నవ్వాపుకున్నారు గాని , ఇక వాళ్ళ వల్ల కాక ఆటపట్టించడం మొదలుపెట్టారు.

వాళ్ళు ఏం మాట్లాడినా గుండె ఝల్ మని మోగుతోంది. గుండెల్లో రక్తం వేడిగా పారుతోంది. ఏంటో తెలియట్లేదు , ఆ రోజు గురించి సాత్వి ఏవో ఏవో ఊహించుకుంటోంది. ప్రతి కల ఏదో ఒక రోజు నిజమవ్వాలి కదా , తన పరిస్థితి కూడా అంతే.

కాని, స్వాతి మనస్సులో వేరే భయం కుడా ఒకటి తిరుగుతోంది. అక్కడ ఎవ్వరికీ చెప్పకుండా, లోలోపల తానే మధన పడుతోంది. ఒక్క ఫోన్ ఒక్కటంటే ఒక్క ఫోన్ గురించి. తన జీవితం మొత్తాన్ని నాశనం చేసేంత శక్తి ఉంది ఆ కాల్ కి. అదే తనని ఇప్పుడు భయపెడుతోంది.

అదే, తన ఎక్స్ రాజేష్ గాడి గురించి. పెళ్ళికి మూడు రోజుల ముందు నుంచి మొదలయ్యిందా టార్చర్. ఒకప్పుడు తనతో తిరిగిన ఫోటోలు, వాడు అడిగినప్పుడల్లా అమాయకంగా ఇచ్చిన సేల్ఫీ లు అన్నీ తన దగ్గర ఉన్నాయి. డిలీట్ చేశా అన్నాడు కాని . చెయ్యలేదు. అదే ఇప్పుడు తన కొంప ముంచబోతోంది. ఎప్పుడైతే రాజేష్ తనని మోసం చేస్తున్నాడు, ప్రేమ నటిస్తున్నాడు అని తెలిసిందో అప్పటినుండి అతని పై ఉన్న ప్రేమ స్థానంలో అసహ్యం మొదలయ్యింది. కాని, అది ఇప్పుడు హద్దులు దాటింది. నిజంగా అబ్బాయిలు అంతా ఇలా ఉంటారా అనుకునేంత. పెళ్లి ఫిక్స్ అయ్యిందని వాడికి చెప్పొద్దని ఫ్రెండ్స్ అందరి దగ్గరా మాట తీసుకుంది కాని, రాజేష్ గురించి . రాజేష్ మంచోడు, ఇకనైనా మారతాడు అనుకున్న సమయంలో పిడుగు లాంటి మెసేజ్ వేరే నెంబర్ నుండి వచ్చింది( రాజేష్ నంబర్ బ్లాక్ అయ్యింది). అందులో తన ….. ఫోటోలు. రాజేష్ ని గుడ్డిగా ప్రేమించే దిగినవి అవి, డిలీట్ చేసావా అని అడిగితే చేశా అని చెప్పేవాడు. కాని, ఇప్పుడు అదే ఫోటోలు నీ మొగుడు కి చూపిస్తా అని 3 రోజుల క్రితం ఆ మెసేజ్ లో చెప్పడంతో ఏమి చెయ్యాలో తెలియక కుమిలిపోతోంది.

” ఎంటక్కా? ఫేస్ అంత సీరియస్ గా పెట్టావ్ “అని మహి అన్న మాటలకు ఈ లోకంలోకి వచ్చిన సాత్వి తర్వాత ఏమి అనాలో తెలియక., సర్దుకుంది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. “రాజేష్ తనను పూర్తిగా …” అని నవీన్ కి ఎలా చెప్పాలో తెలియడం లేదు. కాని, రాత్రి మొదలయ్యే లోపల చెప్పాలి. లేదా నవీన్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు.

ఇలా ఆలోచిస్తున్న సాత్వి ని మిగతా ఆడపడుచులు అందరూ పంపించారు. ఒక పక్క ఆనందం తో ఉక్కిరి బిక్కిరి. మరొక పక్క నవీన్ తో నార్మల్ గా ఎలా ఉండాలో తెలియదు.సరే, నవీన్ కి చెబితే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. అసలే మద్యాహ్నం సీరియస్ గా ఉన్నాడు. ఇంకో పక్క రాజేష్ గాడి దరిద్రపు మెసేజ్ లు . అవి తట్టుకోలేక ఆఫ్ చేసిన ఫోన్. ఆ ఫోన్ ఎవ్వరికీ కనిపించకుండా పెళ్లి రోజున దాచేసింది. వీటన్నింటి మధ్యలో తలుపు తీసి లోపలికి వెళ్తోంది. అయితే ఒకప్పటిలా తనలో ఉన్న దూకుడు స్వభావం కనిపించడం లేదు. ఇష్టం ఉన్న వాడిని పరిగెత్తుకుని వెళ్లి వాటేసుకోవాలన్న ఫీలింగ్ లేదు. రాజేష్ దెబ్బకు మనిషి చురుకుదనంలో కూడా తేడా వచ్చేసింది.
కాని, అప్పుడే వంద నక్షత్రాలు ముందర వచ్చినట్టు, ఎదురు వచ్చాడు, నవీన్. తన కళ్ళల్లోకి చూస్తున్నాడు. వెంటనే అతన్ని వాటేసుకుని ఏడవాలి అనిపించినా, కదలకుండా అలానే ఉండిపోయింది సాత్వి.

ఆ రోజు నవీన్ తన వైపు చూసే ప్రతి చూపు ఎలా ఉంటుందో తెలుసు తనకి. అతని కళ్ళలో మెరుపు చూసి జీవితంలో మరిచిపోలేని ఆ క్షణాలు కోసం మెల్లగా ఊపిరి పీలుస్తూ చూస్తోంది తనని.

Responses (2)

Comments are closed.