పూర్ణ చంద్రుడు Part 3 1

శేషు, శ్రీను బయటకు తీసుకొని వస్తూ “సూపర్ బ్రో అసలు ఎలా చేశావు ఇది అంత” అని అడిగాడు దానికి శ్రీను “భయం, ప్రేమ బ్రో అది నిన్ను ఏమైనా చెప్పిస్తుంది, ఎంతకైన తెగించేలా చేస్తుంది నేను ప్రేమించే వాళ్ల కోసం నేను ఉండాలి అనే భయం నను గెలిచేలా చేసింది” అని చెప్పాడు దానికి శ్రీ, శ్రీను నీ పక్కకు లాగి పక్కన గోడకి ఆనించి “మరి ఇందాక నా గొంతు పట్టుకున్న కూడా నేను నిన్ను ఏమీ అనలేదు దానికి కారణం ఏమీ అయ్యి ఉంటుంది నాకూ నీ మీద ఉన్న ప్రేమనా, లేదా భయమా” అని అడిగింది దానికి శ్రీను నవ్వుతూ శ్రీ నడుము పట్టుకొని దగ్గరికి లాగి తన మెడ భాగంలో ఎక్కడ నోప్పిగా ఉందో అక్కడ ముద్దు పెడుతూ ఉన్నాడు, దాంతో ఇది expect చేయని శ్రీ తన బుగ్గ నీ శ్రీను చెంప పైన రుద్దుతు ఇద్దరు ఒకరికొకరు గట్టిగా కౌగిలించుకున్నారు అప్పుడే శ్రీను అని ఒక అరుపు వినిపించింది దాంతో ఇద్దరు పక్కకు చూస్తే అక్కడ స్వప్న కార్ లో నుంచి కోపంగా దిగుతు వచ్చి శ్రీను నీ కొట్టి లాకుని వెళ్లింది ఆ తర్వాత శ్రీ వైపు తిరిగి “నా కొడుకు దూరంగా ఉండు” అని చెప్పింది అప్పుడే శేషు వచ్చి “శ్రీ, నిషా లేచింది అంట ఇంటికి రమ్మని అమ్మ ఫోన్ చేసింది” అని చెప్పాడు దాంతో వాళ్లు ఇంటికి వెళ్లారు అక్కడ నిషా భయం తో కేకలు వేస్తూ ఉంది “వాళ్లు మనల్ని చంపేస్తారు ఆది చాలా పెద్ద తప్పు చేశావ్” అని అరుస్తూ ఉంది అది చూసి శేఖర్ “పదే పదే ఇలాగే చెబుతుంది” అని అన్నాడు. అప్పుడే శేఖర్ కీ ఒక మెసేజ్ వచ్చింది అది చూసి శేఖర్ కోపంతో ఫోన్ పగల కోట్టి గట్టిగా గర్జించాడు దానికి ఇంట్లో ఉన్న అద్దాలు అని ధ్వంసం అయ్యాయి.

శ్రీను నీ కోపంగా ఇంటికి తీసుకోని వచ్చిన స్వప్న “వెళ్లి నీ luggage సర్దుకో మనం urgent గా ఈ ఊరి నుంచి ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్లిపోవాలి” అని చెప్పింది “అసలు ఏమీ జరిగింది అమ్మ” అని అడిగాడు శ్రీను దానికి స్వప్న తన బాగ్ లో ఉన్న ఫోటోలు తీసి చూపించింది “ఆది చనిపోయిన చోట, ఎస్పి ఠాకూర్ చనిపోయిన చోట ఈ రెండు చోట్ల దొరికిన కామన్ clue నీ షూ మార్క్స్” అని చెప్పింది స్వప్న. |

స్వప్న చెప్పింది విన్న శ్రీను షాక్ అయ్యాడు తన షూ మార్క్స్ క్రైమ్ స్పాట్ లో దొరకడం ఏంటి తను ఇద్దరు Vampires నీ చంపడం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు “ఆలోచించింది చాలు ఈ విషయం ఇంక ఎవరికి తెలియక ముందే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి” అని చెప్పింది స్వప్న దానికి శ్రీను “అమ్మ నేను ఎవరినీ చంపలేదు” అని అన్నాడు దానికి స్వప్న “నాకూ తెలుసు కాకపోతే ఇక్కడ సాక్ష్యాలు అన్ని నీ వైపే చూపిస్తున్నాయి” అని చెప్పింది స్వప్న దాంతో శ్రీను ఆలోచిస్తూ తన రూమ్ లోకి వెళ్లాడు తన షూ మార్క్స్ ఎలా వచ్చాయి అక్కడికి అని అప్పుడే శ్రీను అని స్వప్న గట్టిగా అర్వడం తో బయటకు వచ్చి చూశాడు కొంతమంది Vampires స్వప్న నీ తీసుకొని వెళ్లుతున్నారు అప్పుడు వాళ్ళు శ్రీను కొట్టి లాకుని వెళ్లారు, స్వప్న నీ శ్రీను నీ Vampires న్యాయ ధర్మాసనం దగ్గరికి తీసుకొని వచ్చి మోకాలి పైన నిలబెట్టారు అప్పుడు స్వప్న “ఎవరూ మీరు మేము ఎక్కడ ఉన్నాం అసలు ఇది ఏ చోటు” అని భయం తో అడుగుతు ఉంది అప్పుడు శేఖర్, అనిత, బచ్చు, అందరూ కలిసి కట్టుగా ధర్మాసనం దగ్గరికి వచ్చారు వాళ్ళని చూసి శ్రీను కీ ఒకటి అర్థం అయ్యింది తనకు ఈ రోజే ఈ భూమి మీద చివరి రోజు అయితే తన తల్లి నీ కాపాడిన తరువాతే తను చావలి అని నిర్ణయించుకున్నాడు అప్పుడే బచ్చు తన అన్న చావుకు శ్రీను కారణం అని కోపంగా శ్రీను మీదకు దూకి ఇష్టం వచ్చినట్లు కొట్టడం మొదలు పెట్టాడు స్వప్న వద్దు అని అరుస్తూ ఉంది అది చూసి శేఖర్ “హంతకుడిని ఇంట్లోనే పెట్టుకొని కనిపెట్టడం చాత్తా కాలేదు నీకు ఎందుకు ఈ అవార్డులు, మెడల్స్ నా మేనల్లుడు చావుకు కారణమైన వీడు ఈ రోజు చావాల్సిందే” అని చెప్పి తన vampire రూపం లోకి మారాడు శేఖర్ అది చూసి స్వప్న ఒక్కసారిగా భయం తో కేకలు వేసింది దాంతో శేఖర్ కూడా బచ్చు తో కలిసి శ్రీను నీ ఎగిరేసి కొట్టడం మొదలు పెట్టారు దాంతో స్వప్న “వాడికి split personality disorder ఉంది” అని చెప్పింది దానికి శేఖర్, బచ్చు నీ ఆగమని చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *