పూర్ణ చంద్రుడు Part 3 1

శ్రీ కిందకు దిగాలి అని చూసింది కానీ శ్రీను వద్దు అని సైగ చేశాడు “నాకూ తెలిసి తను ఈ చుట్టూ పక్కల ఉండి ఉండాలి” అనింది విద్య “నాకూ మాత్రం ఆ శ్రీను గాడు దొరికితే బాడి మొత్తం నుజ్జు నుజ్జు చేసి వాడి రక్తం లో ఎముకలు నములుకోనీ తింటా నా సల్మాన్ నీ చంపేశాడు” అని బాధ, కోపం కలిసిన గొంతు తో చెప్పింది అయేషా దానికి విద్య “అందులో తన తప్పు లేదు చూస్తే సల్మాన్ దే తప్పు already పొద్దున అంతలాగ తనులు తిని మళ్లీ ఎటాక్ చేశాడు కానీ ఏ మాటకు ఆ మాట శ్రీను నిజం గా దమ్మునోడు శ్రీ వాడిని లవ్ చేయక పోయి ఉంటే నేనే తగులుకున్నే దాని” అని చెప్పింది విద్య దానికి అయేషా “అందరూ వాడి మాయలో పడ్డారు నాకూ తెలిసి ఆ పద్దు, శ్రీ ఇద్దరు కలిసి ఇది అంత చేస్తున్నారు అని నా అనుమానం నాకూ తెలిసి ఆ శ్రీను గాడు vampire hunter అయ్యి ఉంటాడు అందుకే వాడికి వీళ్లిద్దరు సహాయం చేస్తున్నారు ” అని చెప్పి వెళ్లిపోయింది అయేషా ఆ తర్వాత విద్య ఒకటే ఉండటం చూసి ముగ్గురు కిందకి దిగి జరిగింది అంత తనకు చెప్పారు రేపు ఉదయం ఎవరిని బయటకు రానివ్వకుండా చూడమని చెప్పి వెళ్లిపోయారు, అలా అడవిలో వాళ్లు వెళ్తుండగా పద్దు సడన్ గా ఆగింది.

అక్కడ దట్టమైన అటవీ లోకి వెళ్లే దారి వైపు చూస్తూ “ఇక్కడి నుంచి నాకూ కొత్త వాసన వస్తోంది నాకూ తెలిసి devils ఇటు వైపే ఉండి ఉంటారు” అని చెప్పింది దానికి శ్రీ “అయితే వేటాడాల్సిన టైమ్ వచ్చింది” అని చెప్పింది దానికి పద్దు కూడా సరే అన్నట్టు తల ఆడించింది “నేను కూడా వేటాడానికి వస్తా” అన్నాడు శ్రీను దానికి ఇద్దరు ఏదో చెప్పాలని చూస్తే “నేను permission అడగడం లేదు information మాత్రమే ఇస్తున్నా” అని చెప్పి ఆ దారి వైపు అడుగు వేశాడు అప్పుడే అయేషా వచ్చి శ్రీను మీద దాడి చేసింది.

అయేషా అలా వచ్చి శ్రీను మీద దాడి చేయగానే శ్రీను కొంచెం దూరం వెళ్లి పడ్డాడు, అప్పుడు శ్రీ, అయేషా నీ ఆపాలని చూసింది కానీ తన ఆవేశము ముందు గాయాలతో నిండి ఉన్న శ్రీ ఆపలేక పోయింది దాంతో శ్రీ కూడా కింద పడింది అప్పుడు పద్దు తనలో ఉన్న సానుభూతి నీ, సాత్వికత నీ పక్కన పెట్టి VAMPIRE గా మారి అయేషా తో యుద్ధానికి దిగింది ఆవేశం కట్టలు తెగి వస్తున్న అయేషా వెనకు వెళ్లి మెడ మీద గోళ్లు తో కోసి ఎడమ కాలు కుడి చెయ్యి పట్టుకుని విరిచి మెడ పట్టుకుని వెనకు తిప్పి చంపేసింది అది అంత చూస్తున్న శ్రీ , గట్టిగా చప్పట్లు కొడుతూ “నీలో కూడా ఒక vendatin ఉంది lotus నీతో ఇప్పుడు పోటీ నాకూ సమానంగా ఉంది ఈ గొడవ అయ్యాక మనం ఇద్దరం వాడి కోసం కొట్టుకుందాం” అని చెప్పి నవ్వుతూ కన్ను బొమ్మలు ఎగురవేసింది దానికి పద్దు “challenge accepted” అని చెప్పింది ఆ తర్వాత ఇద్దరూ కలసి శ్రీను వెతికారు శ్రీను అక్కడ పొదలో పడి ఉన్నాడు దాంతో ముగ్గురు కలిసి దట్టమైన అటవీ ప్రాంతంలోకీ వెళ్లాలి అని సిద్ధం అయ్యారు అప్పుడే ఒక జీప్ గట్టిగా హార్న్ సౌండ్ చేస్తూ వచ్చింది శ్రీ, పద్దు ఇద్దరు Vampires గా మారారు అప్పుడు ఆ జీప్ నుంచి శేషు, స్వప్న తో కలిసి ఒక బాగ్ తో కిందకి దిగాడు, శ్రీను నీ చూసిన ఆనందం లో స్వప్న వచ్చి శ్రీను నీ గట్టిగా కౌగిలించుకున్ని నుదుటి మీద ముద్దు పెట్టింది అప్పుడు శ్రీ, శేషు నీ చూసి “నువ్వు ఏంటి ఇక్కడ” అని అడిగింది దానికి శేషు వాళ్ల కోసం కొత్త బట్టలు, తినడానికి తిండి, టెంట్ బాగ్ తీసుకోని వచ్చాడు.

శ్రీను నీ చూసిన స్వప్న “నాన్న నీకు ఇది అంత అవసరమా మనం ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలి ఎందుకు లేని పోని గొడవలు మనకి” అని అడిగింది దానికి శ్రీను “ఈ సమస్య పరిష్కారం కోసం మనం ఈ ఊరికి వచ్చాం అది పరిష్కరించకుండ నేను ఎక్కడికి రాను అమ్మ నీ భయం నాకూ తెలుసు నాకూ ఏమీ కాదు వాళ్లు ఇద్దరు తమ ప్రాణాలను అడ్డు వేసి నను కాపాడుతారు Vampires అందరూ రక్తం కోసం ఆరట పడే వాళ్లు ఉండరు అదిగో ఆ శేషు లాగా నిస్వార్థంగ ఉండే వాళ్లు ఉన్నారు, ప్రేమ పంచె పద్దు లాంటి వాళ్లు ఉన్నారు, శ్రీ లాగా ఆవేశపరులు ఉన్నారు” అని చెప్పాడు దానికి స్వప్న “అవును ఆ పద్దు ఏంటి నను అత్తయ్య అంటుంది నిను మొగుడు అంటుంది ఏమీ జరిగింది” అని అడిగింది దానికి శ్రీను సిగ్గు పడుతూ మాట్లాడానికి తడబడుతూ “అంటే ఏ ఆడ Vampire అయిన తన ఉంగరం ఎవరికైనా ఇస్తే వాళ్లకు పెళ్లి అయిపోయినట్టే అంట” అని చెప్పాడు దానికి స్వప్న షాక్ అయ్యింది దాంతో శ్రీను, శేషు పిలిస్తే వెళ్లాడు అప్పుడు శేషు “బ్రో నీ కోసం ఒక స్పెషల్ ఐటం తెచ్చా” అని పద్దు వాళ్ల నాన్న vampire hunter సూట్ తెచ్చాడు దాంతో పాటు ఆయన తయారు చేసుకున్న ఒక చిన్న వెండి గొడ్డలి కూడా తెచ్చి ఇచ్చాడు అది చూసిన శ్రీను తన షర్ట్ విప్పి ఆ సూట్ వేసుకొని దానికి ఉన్న హుక్ లో తన కత్తి ఒకటి, ఆ గొడ్డలి ఒకటి పెట్టుకున్నాడు అది చూసిన పద్దు, శ్రీను దగ్గరికి వచ్చి తన తండ్రి డ్రస్ లో ఉన్న శ్రీను నీ చూస్తూ ఆ సూట్ సర్దుతు “ఇన్ని రోజులు నాకూ ముద్దుగా కనిపించే వాడివి ఇప్పుడు ఏమో చాలా డాషింగ్ గా ఉన్నావు” అని చెప్పి శ్రీను నుదుటి మీద ముద్దు పెట్టింది అది చూసిన స్వప్న గట్టిగా దగ్గడం తో ఇద్దరు వెనకు జరిగారు అప్పుడు శ్రీను శేషు తో మాట్లాడానికి పక్కకు వెళ్లితే పద్దు నీ ఆపి స్వప్న ఇలా అడిగింది “నిజంగా నా కొడుకు అంటే అంత ఇష్టమా నీకు నా కొడుకి నాకూ తెలియకుండా పెళ్లి కూడా అయిపోయింది అని తెలిశాక మీ Vampires గురించి తెలిసిన దానికంటే ఎక్కువ షాక్ అయ్యాను” అని చెప్పింది, దానికి పద్దు “నేను ఆపాలని చూసిన కూడా నా మనసు మీ కొడుకు వశం అయిపోయింది ఎవరూ లేని నా జీవితంలో తను వచ్చాకే కొంచెం వెలుగు చూశాను కాబట్టి నను అర్థం చేసుకోండి నేను తనని బాగా చూసుకుంటాను తనకి ఏమీ కానీవ్వను” అని చెప్పింది దానికి స్వప్న “వాడితో పాటు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు” అని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *