పూర్ణ చంద్రుడు Part 3 1

ఆ తర్వాత ముగ్గురు కలిసి అడవి లోకి వెళ్లారు అప్పుడు శ్రీ తనకు ఇందాక తన మీద దాడి చేసిన వాడి వాసన తగిలి అటు వైపు వెళ్లారు దారి లో వాళ్లకు ఒక వాగు కనిపించింది అప్పుడు శ్రీ, పద్దు ఇద్దరు శ్రీను వైపు చూసి “నువ్వు ఈ వాగు దాటడం కష్టం కాబట్టి నువ్వు మా ఇద్దరి లో ఎవరో ఒకరి వీపు మీద ఎక్కు నిను అవతలికి తీసుకోని వెళ్లతాము” అని అన్నారు దానికి శ్రీను నవ్వి ఆ వాగు వైపు చూసి దాంట్లో ఉద్రిక్తత ఎక్కువ ఉంది అయిన కూడా “catch me if you can” అని ఛాలెంజ్ చేసి ఆ వాగు మధ్య లో ఉన్న రాయి మీదకు దూకి అక్కడి నుంచి పరిగెత్తి ఎదురుగా ఉన్న ఒక చెట్టు మీదకు తన దెగ్గర ఉన్న తాడు విసిరి అవతలి ఒడ్డుకు చేరుకున్నాడు కానీ బురద వల్ల జారీ వాగులో పడబోతుంటే అప్పుడే ఒక తోడేలు ఎగురుకుంటు వచ్చి శ్రీను నీ అవతలి ఒడ్డుకు తోసి అడవిలోకి మాయం అయ్యింది శ్రీను ముందు షాక్ అయ్యాడు కానీ తరువాత పొగరు గా లేచి నిలబడి కాలర్ ఎగురవేశాడు దానికి పద్దు, శ్రీ ఇద్దరు షాక్ అయ్యారు ఎలా చేశాడు అని ఆ తరువాత ఇద్దరు అవతలి ఒడ్డుకు చేరారు, అలా ముగ్గురు కలిసి ఇంకొంచం దూరం వెళ్లాక పద్దు watch లో అలారం మొగింది దాంతో పద్దు కంగారుగా చూసింది అది చూసిన శ్రీను ఎమైంది అని అడిగాడు. పద్దు తన చేయి ఎత్తి పైకి చూపింది ఆకాశం నుండి సూర్యుని కిరణాలు అడవిలోని ఆకులు చీల్చుకుంటు రావడం చూశాడు శ్రీను వెంటనే పద్దు నీ తన జాకెట్ లోకి లాకున్నాడు అప్పుడే శ్రీ గట్టిగా అరవడం తో వెనకు చూశాడు శ్రీను, శ్రీ మీదకు ఒక ఎలుగుబంటి దాడి చేసింది అసలే బలహీనంగా ఉన్న శ్రీ ఆ ఎలుగుబంటి నీ ఎదుర్కోలేక పోయింది అది చూసిన పద్దు, శ్రీ నీ కాపాడాలని జాకెట్ నుంచి బయటకు వచ్చి ఎలుగుబంటి మీదకు వెళ్లింది కానీ ఎండ తాకడం తో స్ప్రుహ కోల్పోయి కింద పడిపోయింది దాంతో శ్రీను ఇద్దరిని కాపడం కోసం తన ఆయుధాలు ఉన్న జాకెట్ నీ పద్దు మీద కప్పి రెండు రాలు తీసుకొని ఎలుగుబంటి మీద దాడి చేశాడు అప్పుడు అది శ్రీను వెంట పడింది, వెంటనే దాని నుంచి పారిపోతూ ఒక చెట్టు కొమ్మకు కొట్టుకుని కింద పడ్డాడు శ్రీను అప్పుడు ఆ ఎలుగుబంటి శ్రీను మీదకు రాగానే ఒక తోడేలు ఆ ఎలుగుబంటి మీద దాడి చేసి దాని కొరికింది దాంతో శ్రీను, శ్రీ నీ తీసుకోని వచ్చి పద్దు తో పాటు జాకెట్ లోపల దాచ్చాడు ఆ తోడేలు తనకు సహాయం చేయడం తో దాని కూడా కాపాడాలని ఇంకో రాయి ఎలుగుబంటి మీద విసిరాడు దాంతో ఆ ఎలుగుబంటి శ్రీను మీదకు వచ్చింది అప్పుడు శ్రీను కీ ఆ తోడేలు వెనుక నుంచి ఎగిరి వచ్చి తన నోటిలో ఉన్న గొడ్డలి వేసి తన పంజా తో ఆ ఎలుగుబంటి కీ గాటు పెట్టి దాని చూపు మళ్లించింది అప్పుడు శ్రీను తన గొడ్డలి తో సరిగ్గా ఎలుగుబంటి గుండెల్లో గట్టిగా వేటు వేసి దాని చీల్చుకుంటు వెళ్లాడు అప్పుడు ఆ ఎలుగుబంటి రెండు గా చీలి చనిపోయింది అప్పుడు చూస్తే ఆ తోడేలు ఒక గుహ లోకి వెళ్లడం చూసిన శ్రీను వెంటనే శ్రీ, పద్దు ఇద్దరిని భుజం మీద వేసుకొని ఆ గుహ లోకి వెళ్ళాడు.

ఆ తర్వాత ఇద్దరూ చాలా బలహీనం గా ఉండటం చూసిన శ్రీను వాళ్ళని ఎలాగైనా కాపాడాలని చూశాడు ఏమీ చేయాలో తెలియక ఉంటే ఆ తోడేలు ఊళ వేస్తూ బయటికి వెళ్లింది టెంట్ బాగ్ తీసి దాంట్లో ఇద్దరిని పడుకోబెట్టీ దాని వెంబడిస్తూ బయటకు వెళ్లాడు శ్రీను ఆ తోడేలు ఇందాక చనిపోయిన ఎలుగుబంటి గుండె నుంచి రక్తాన్ని చూపించింది దాంతో శ్రీను అక్కడ ఉన్న ఆకుల లో ఆ గుండె రక్తం పట్టుకుని వెళ్లి ఇద్దరికి తాగించాడు ఆ తర్వాత బయటకు వచ్చి కూర్చున్నాడు ఆ తోడేలు మళ్లీ ఊళ వేసి పిలిచింది దాంతో దాని వెనుక వెళ్లాడు అప్పుడు ఆ తోడేలు ఒక తోట లాంటి ప్రాంతాల్లోకి శ్రీను నీ తీసుకోని వెళ్లింది అప్పుడు శ్రీను అక్కడ పళ్లు తీసుకోవడానికి చెట్టు పైకి ఎక్కాడు అప్పుడే ఏదో గన్ సౌండ్ విన్నాడు ఏంటి అని దిగి చూశాడు ఒకతను ఒక జింకను వేటాడి కాల్చి చంపాడు దాంతో శ్రీను, కిందకి దిగి వెళ్లి అతని గమనిస్తు ఉన్నాడు అప్పుడు అతను శ్రీను ఉన్న పొదల వైపు గురి చూసి కాల్చబోతుండగా శ్రీను పైకి లెచి తనని పరిచయం చేసుకున్నాడు అతను “ఆ ఎస్పి నీ చంపింది నువ్వే కదా నిన్ను పట్టుకోవడం కోసమే నేను కొత్తగా అపాయింట్ అయ్యాను” అని గన్ చూపించి శ్రీను చెబుతున్న వినిపించుకోకుండా అతని అరెస్ట్ చేశాడు అలా ఇద్దరు అడవి దారిలో వెళ్ళుతుంటే శ్రీను కీ సడన్ గా ఒకటి strike అయింది బుర్ర లో ఏంటి అంటే ఈ కొత్త ఆఫీసర్ చేతి మీద కూడా ఆది చేతి మీద ఉన్న tattoo ఉంది దాంతో అనుమానం వచ్చి వెనకు చూస్తూ ఆ ఆఫీసర్ ఒక గబ్బిలం లాగా మారి శ్రీను మీదకు రాబోయాడు అది చూసి శ్రీను వేగంగా పరిగెత్తాడు శ్రీను వేగం చూసి ఆ కొత్త vampire కూడా షాక్ అయ్యింది ఆ తర్వాత శ్రీను ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు ఆ గబ్బిలం రూపం లో ఉన్న vampire శ్రీను నీ దాటి వెళ్లాక శ్రీను దాని వెనుక నుంచి పారిపోతూ విజిల్ వేశాడు ఆ సౌండ్ కీ ఆ గబ్బిలం శ్రీను వెంట పడింది శ్రీను ఇందాక తను ఆ గబ్బిలం నీ చూసిన చోటు కీ మళ్లీ వచ్చాడు అప్పుడు అక్కడ సూర్యుని కాంతి వల్ల శ్రీను గొడ్డలి మెరిసింది దాంతో శ్రీను తన చేతులు కట్టేసి ఉండటం తో తన కాలి తో ఆ గొడ్డలి పైకి లేపి ఇంకో కాలు తో కొట్టాడు దాంతో అది ఆ గబ్బిలం తలకు తగిలి అది భస్మం అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *