హసీనా అండ్ శృతి Climax 93

రెండు రోజుల తర్వాత ఢిల్లీ లో హైపవర్ మీటింగ్ జరిగింది

అన్ని సరిహద్దు రాష్ట్రాల డీజీపీ లు సమావేశం అయ్యారు .
స్మిత కూడా మినిష్టర్ తో ఉంది .కోల్కతా నుండి శృతి కూడా ఢిల్లీ వచ్చింది .
“iam శృతి మాడం “సెల్యూట్ చేసింది స్మిత కు .
“హాయ్ “అంటూ వసున్ధరా కు కూడా పరిచయం చేసింది స్మిత .
మీటింగ్ స్టార్ట్ అయ్యాక “చుడండి , మన దేశం లోకి అటు పాక్ నుండి ఇటు బాంగ్లాదేశ్ నుండి చాల స్ముగ్గ్లింగ్ జరుగుతోంది “అన్నాడు మినిష్టర్
“సార్ కేవలం నల్లమందు లాంటివే కాదు , మనుషులు కూడా “అన్నాడు ఒక స్టేట్ మినిష్టర్
“మే బి మనుషులు కూడా వస్తుండవచు “అన్నాడు సెంట్రల్ మినిష్టర్
స్మిత కల్పించుకుంటూ “మన దగ్గర ఉన్న వివరాల ప్రకారం గన్స్ నుండి చాలా అక్రమ రవాణా జరుగుతోంది
అది కాకుండా చాల మంది బోర్డర్ దాటి మన దేశం లోకి అక్రమం గ వస్తున్నారు “అంది స్మిత
‘ఇది స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఉన్నదే కదా “అన్నాడు ఒక స్టేట్ మినిష్టర్
“కానీ వాళ్ళు అక్రమం గ మన దేశంలోకి వచ్చి చాల పనులు చేస్తున్నారు ,ఇక్కడే సెటిల్ అవుతున్నారు “అంది వసుందర
“ఇది పొలిటికల్ ఇష్యూ “అన్నాడు ఒక స్టేట్ మినిష్టర్
‘”శాంతి భద్రతలు సమస్యగా మారుతుంటే కేంద్రం చట్టం చేయాల్సి ఉంటుంది “అన్నాడు సెంట్రల్ మినిష్టర్
కొంత మంది అవును అని , కొంత మంది కాదు అని అరుచుకుంటున్నారు .
లంచ్ బ్రేక్ లో “నువ్వేమంటావు “అడిగింది స్మిత , శృతి ని .
“చూస్తున్నాము కదా మేడం , ఎంత క్రైమ్ జరుగుతోందో ,,కోల్కతా లోకి చాల మంది బాంగ్లాదేశ్ నుండి అక్రమం గ వచ్చి సెటిల్ అవుతున్నారు “అంది శృతి .
“పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి ,మన వంతు పని మనం చేస్తున్నాము “అంది వసుందర
మీటింగ్ తర్వాత శృతి మల్లి కోలకతా వచ్చేసింది ..
######
అయితే కేంద్రం ఆర్మీ నుండి సెక్యూరిటీ అధికారి నుండి సేకరించిన వివరాలతో బిల్ తయారు చేసి సభలో ప్రవేశ పెట్టింది .

ఇది ఊహించని స్మిత , వసున్ధరా , శృతి ఫస్ట్ షాక్ తిన్నారు , కానీ ఆనందించారు .

సాగర్ ఈ న్యూస్ విని “ఇలాంటి ఎన్ని చట్టాలు చేసిన నా పని ఆగదు “అన్నాడు సరితా తో

కొన్ని బోర్డర్ స్టేట్స్ వ్యతిరేకించిన కానీ ముందు ఫ్రీడమ్ వచ్చినప్పటి నుండి జరుగుతున్న చొరబాట్లు , వాటి వల్ల వస్తున్న క్రైమ్ ను దృష్టిలో ఉంచుకుని బిల్ ను సభ పాస్ చేసింది .

“ఇది అమలు అయినా కాకపోయినా ముందు చొరబాట్లు ఆపడానికి ఆఫీసర్స్ కి ఒక ఆయుధం దొరికింది ,, అక్రమం గ వచ్చిన వారిని వెనక్కి పంపవచ్చు ఇక నుండి “అంది వసున్ధరా స్మిత తో .
ఆ చట్టాన్ని శృతి కూడా స్టడీ చేసుకుంది , అవసరమైతే వాడటానికి పనికొస్తుంది అని …
శ్రుతి నెల నుండి తన కస్టడీ లో ఉన్న వారిని”మీరు ఎక్కడి వారు, ఐడీ లు కావాలి”అడిగింది.
చాలా మంది బంగ్లాదేశ్ నుండి వచ్చిన వారే.
శ్రుతి లోకల్ సెక్యూరిటీ అధికారి లను తీసుకుని సొన గచి లో రైడింగ్స్ మొదలెట్టింది.
ముందు ఒక్కొక్కరి ఐడీ కార్డు లు వెరిఫై చేస్తూ,దొంగ కార్డు లు ఉన్నవారిని అరెస్ట్ చేస్తూ వెళ్ళింది.
రాజకీయ నాయకులు అడ్డం పడటం వల్ల మూడో రోజు తన రైడింగ్స్ ఆపింది శ్రుతి.
అప్పటికే బంగ్లాదేశ్ నుండి అక్రమం గా వచ్చిన మూడు వందల మంది నీ కోర్టు ముందు నిలబెట్టింది.
“చాలా మంది వ్యభిచారం చేస్తున్నారు.
కొందరు మాత్రం ఏదో ఒక పని చేసుకుంటూ బతుకుతున్నారు.”చెప్పింది పబ్లిక్ ప్రాసిక్యూటర్.
“వీళ్ళు భారత్ లోకి అక్రమం గా వచ్చారు కాబట్టి వెనక్కి పంపండి”చెప్పింది మళ్లీ.
కోర్టు కేసు ను వాయిదా వేసి , వాళ్ళకి బెయిల్ మంజూరు చేసింది..

“ఇదేమిటి మాడం”అడిగింది శ్రుతి , స్మిత కి ఫోన్ చేసి.
“మన దేశం లో రాజనీతి అలాగే ఉంటుంది.కోర్టు లు స్లో గా పని చేస్తాయి.
నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు”అంది స్మిత..