ఇంతలో గింజలు నీళ్ళు పెట్టిన మంగ లోపలకి వెళ్తుంది, లోపల కూతురు స్వాతి తో ఫోన్ లో మాట్లాడుతూ వున్నా మధు అమ్మ గారు మంగ నీ పిలిచి మంగ వల్ల కి ఏమీ అయిన కావాలో చూడవే అంటుంది, వాళ్ళు ఎక్కడ వున్నారు అమ్మగారు వెళ్ళిపోయారు అంటే అదేంటే అప్పుడే వెళ్ళిపోయారు మీ అయ్యగారు ఎం చేస్తున్నారు అంటే అయ్యగారు అక్కడ పాప తో బిజీగా వున్నారు, ఎవరు పాప అని ఆశ్చర్యంగా అడుగుతుంది, ఏమో అమ్మగారు పక్షుల శబ్దం కి ఒక పాప లోపలకి పరిగెత్తు కుంటు వాస్తే నన్నే మో ఇంట్లో నుండి బయటకి పంపమని నా మీద అరిచారు, నేను పాప దగ్గరికి వెళ్ళి బయటికి పో అంటే నువు ఎవరు నాకు చెప్పటానికి అంది, నేను అయ్యగారికి చెప్తే ఆయన కోపంతో వుగిపోయి లోపలకి వెళ్లి పాప నీ చంక లో వేసుకొని బయటకి వచ్చి పక్కనే కూర్చొని ముచ్చట్లు చెప్తున్నారు, పాయిగ వాళ్ళని పంపించేసి మరీను అని మంగ చెప్తుంటే మధు అమ్మగారు ఫోన్ లో స్వాతి ఇద్దరు ఆశ్చర్యం గా వింటున్నారు, ఇంకా మధు అమ్మగారు నువు వుండవయ్ స్వాతి నేను మళ్ళీ ఫోన్ చేస్తాను ఆ పాప ఎవరో చూద్దాం, అని బయటకి వెళ్లి పక్కనే ఇంకో కుర్చీలో కూర్చొని ఆశ్చర్యంగా స్వీటీ వైపు చూస్తుంది, చెమ్మ గిల్లిన కాళ్ళతో వల్ల ఆయన వైపు చూస్తే, మధు నాన్న ఈ పాప పేరు స్వీటీ, స్వీటీ వల్ల తాత తప్పు చేస్తే ఇంట్లో నుండి బయటకి పంపారంట అనగానే మధు అమ్మగారు నవ్వుతూ పాప నీ దగ్గరకి తీసుకొని ముద్దు లూ పెట్టుకుంటు, మీ అమ్మ నాన్న ఎక్కడమ్మా అని అడుగుతారు, మా వూళ్ళో వున్నారు అని సమాధానం చెప్తుంది స్వీటీ, నువు ఎలా వచ్చావు అని అడిగితే ఉష పిన్నితో అని చెప్తుంది, ఇద్దరు విని విన్నట్టుగా సరే పద తల్లి ఏమన్నా తిందువు కానీ అని లోపలకి తీసుకెళ్తుంది, మధు నాన్నగారు పొలం లో పని చేసే వాళ్ళకి ఫోన్ చేసి కాయలు ఏమీ వుంటే అవి ఫ్రెష్ వి పంపియ్యమని చెప్తారు,
మధు అమ్మగారు ఏడుస్తూనే స్వీటీ నీ ఇంట్లోకి తీసుకువెళ్ళి వొళ్ళో కూర్చోపెట్టుకొని ముద్దులు పెడుతూ కళ్ళ ముందు పెరగ వలసిన పిళ్ళవి ఇన్నాళ్లు పట్టింది తల్లి నిన్ను చూడటానికి, బంగారు బొమ్మలా వున్నావు, ఎంత దిష్టి తగిలింది ఏమో వుండు తల్లి అని శుభ్రం గా దిష్టి తీసి వొళ్ళో కూర్చో పెట్టుకొని ఏడుస్తుంది, స్వీటీ కళ్ళు తుడుస్తూ ఎందుకు నానమ్మ అలా ఏడుస్తున్నావు, బంగారు తల్లి నికు నేను తెలుసా నానమ్మ ను అవుతాను అనీ, తెలుసు నానమ్మ నాన్న అమ్మ చూపిస్తారు మీ ఫొటోస్ అని ముద్దు ముద్దు గా చెప్తుంది. నా బంగారు తల్లి అని ముద్దు పెట్టుకొని మీ అత్త తెలుసా నికు హా తెలుసు ఫోటో చూసాను, నాన్నకు బాగా ఇష్టం అత్త అంటే అనగానే మాట్లాడతా వా తల్లి అత్తతో హా మాట్లాడతాను అంటుంది, మధు అమ్మగారు స్వాతి కి వీడియో కాల్ చేస్తుంది, స్వాతి ఫోన్ ఎత్తగానే మధు అమ్మగారు సంతోషం తో స్వాతి నికు ఒకల్ని చూపిస్తా ఎవరో చెప్పుకో అని స్వీటీ నీ చూపిస్తుంది.
మధు అమ్మగారు ఏడుస్తూనే స్వీటీ నీ ఇంట్లోకి తీసుకువెళ్ళి వొళ్ళో కూర్చోపెట్టుకొని ముద్దులు పెడుతూ కళ్ళ ముందు పెరగ వలసిన పిళ్ళవి ఇన్నాళ్లు పట్టింది తల్లి నిన్ను చూడటానికి, బంగారు బొమ్మలా వున్నావు, ఎంత దిష్టి తగిలింది ఏమో వుండు తల్లి అని శుభ్రం గా దిష్టి తీసి వొళ్ళో కూర్చో పెట్టుకొని ఏడుస్తుంది, స్వీటీ కళ్ళు తుడుస్తూ ఎందుకు నానమ్మ అలా ఏడుస్తున్నావు, బంగారు తల్లి నికు నేను తెలుసా నానమ్మ ను అవుతాను అనీ, తెలుసు నానమ్మ నాన్న అమ్మ చూపిస్తారు మీ ఫొటోస్ అని ముద్దు ముద్దు గా చెప్తుంది. నా బంగారు తల్లి అని ముద్దు పెట్టుకొని మీ అత్త తెలుసా నికు హా తెలుసు ఫోటో చూసాను, నాన్నకు బాగా ఇష్టం అత్త అంటే అనగానే మాట్లాడతా వా తల్లి అత్తతో హా మాట్లాడతాను అంటుంది, మధు అమ్మగారు స్వాతి కి వీడియో కాల్ చేస్తుంది, స్వాతి ఫోన్ ఎత్తగానే మధు అమ్మగారు సంతోషం తో స్వాతి నికు ఒకల్ని చూపిస్తా ఎవరో చెప్పుకో అని స్వీటీ నీ చూపిస్తుంది. స్వాతి కి కూడా స్వీటీ నీ చూడగానే ఎవరో కనిపెట్టాటనికి పెద్దగా టైం పట్టలేదు, స్వాతి కి మాటలు కూడా రావట్లేదు తనని చూసిన ఆనందంలో, స్వాతి కి తెలియ కుండానే కళ్ళ నుండి నీరు కారుతున్నాయి, కళ్ళు తుడుచకుంటూ నీ పేరు ఎంటి అని అడుగుతుంది, స్వీటీ అత్త అంటుంది, స్వాతి ఫోన్ లోనే స్వీటీ కి ముద్దులు పెడుతుంది, స్వాతి వెంటనే అమ్మ ఒక్క నిమిషం మళ్ళీ ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి, ఒక 15 mts తర్వాత ఫోన్ చేస్తుంది, అమ్మ నేను రేపు ఇండియా వస్తున్న టికెట్ దొరికింది ఎల్లుండి మధ్యానం వరకు వస్తాను నాన్న నీ రమ్మని చెప్పు, స్వీటీ అని నేను వస్తున్నారా నిన్ను చూడటానికి అంటుంది అలాగే అత్తయ్య అని స్వీటీ ముద్దు ముద్దు గా అంటుంది,
