ఊహిం 5 234

రాజా నయన్ చేతిలో పెన్ లాక్కుని పెన్ క్యాప్ నోటితో తీసి..ఆ క్యాప్ లో మైక్రో కెమెరా బయటకి తీసి ఆ మైక్రో కెమెరా వేలితో నలిపేస్తూ..ఇలాంటి కెమెరాలు పెట్టుకోకుండా వస్తే. ఆస్ట్రేలియా పర్యటన ఏ క్షణం ఎలా సాగిందో పూస గుచ్చినట్లు పొల్లు పోకుండా చెప్పేవాడిని” అన్నాడు…

నయనతార కాస్త కంగారు పడి తడబడుతూ చూస్తూ..”అది..అది.అంటూ నసిగి ..కెమెరాని పగలకొట్టేసారుగా…ఇప్పుడు చెప్పండి పర్లేదు” అంది..
రాజా నవ్వుతూ… కొంచెం ముందుకి వంగి తన వేలితో నయనతార మొహం మీద నుదిటి మీద నుండి..పెదాలు ..గడ్డం మీదుగా కిందకి..వేలుతో రాసుకుంటూ..గడ్డం కింద మెడ మీదకి వచ్చి…మెడ లో చక్కిలిగిలి పెట్టినట్టు మీటి..ఆమె మెడలో రబ్బర్ బ్యాండ్ ని..ఒక్కలాగు లాగి.తెంపి “ఇందులో గుచ్చిన కెమెరా వుంది గా” అన్నాడు..

నయనతారకి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు మొహం పెట్టి..”సారీ ముఖ్యమంత్రి గారు..” అంది
రాజా తన కుర్చీలో నుండి లేచి.తన గాడి తలుపులు వేసేసి నయనతార కూర్చున్న కుర్చీ ముందు..బల్ల మీద కళ్ళు ఆడిస్తూ కూర్చుని..నయనతార తల మీద జుట్టు సవరదీస్తూ..ఇవేనా కెమెరాలు..ఇంకేమన్నా ఉన్నాయా అన్నాడు..
నయనతార తడబడుతూ చూస్తూ “ఏం లేవు ముఖ్యమంత్రి గారు” అంది..
రాజా నవ్వి “దాచి పెట్టుకుని వచ్చిన రెండు కెమెరాలు తీసేసాలే” అని..ఏంటి..నా నుండి ఏం చెప్పించి నన్ను వెధవలా చిత్రీకరిద్దాం అని కంకణం కట్టుకున్నారు.. మీ మొగుడు పెళ్ళాం “అన్నాడు..

నయనతార మొహం ఇబ్బందిగా పెట్టి..అది అది..మా ఆయనకేమి తెలియదు అంది..
మిమ్మల్ని ప్రజల్లో చెడుగా చూపిస్తే..నా మొగుడు ముఖ్యమంత్రి అవుతాడు అన్న ఆశతో…ఆలా..చేశా..
“అబ్బో మొగుడు మీద ప్రేమతో..ఆలా ప్రయత్నం చేసావా అని..గడ్డం కింద చెయ్యి పెట్టి తడుముతూ నువ్వే చేసావా నీ వెనుక ఎవరన్నా ఉన్నారా” అన్నాడు..
నయనతార తడబడుతూ..”అయ్యో లేదు ముఖ్యమంత్రి గారు ఎవరూ లేరు” అంది..

రాజా కొంచెం గట్టిగా నవ్వి కసిగా బుగ్గ పట్టుకుని గిల్లి “చెప్పు నయనతార చెప్పు నేనేమి అనను” అన్నాడు..
నయనతార “అహ్హ్” అని మూలిగి కొంచెం కళ్లనీళ్లు నిండిన మొహం పెట్టి..”నిజం..ఎవరు లేరు” అంది..
“పార్టీ కి ఎంతో విధేయుడిలా ఉండే ..ఆనందరావు ఆలా ఏం చెయ్యమనడు లే నాకు నమ్మకం ఉంది” అని. డోర్ దగ్గరకి వెళ్లి మెల్లిగా డోర్ తీసి..ఆనందరావు ని పిలిచాడు..

ఆనందరావు లోపలకి వచ్చి ఏంటి ముఖ్యమంత్రి గారు ఏం అయ్యింది అన్నాడు.
రాజా వికటం గా నవ్వి “నువ్వే అడుగు నీ అందాల శ్రీమతిని ఏం అయ్యిందో” అన్నాడు..
ఆనందరావు నయనతార వైపు చూసి “ఏం జరిగింది” అని అడగగానే ..నయనతార..తాను రాజా పేరుని చెడగొట్టడానికి. ని ఏం చెయ్యబోయింది ఎలా దొరికింది” మొత్తం చెప్పింది..

ఆనందరావు భార్య వైపు చూసి..”అసలు ఎందుకు ఇలా చెయ్యబోయావు” అన్నాడు..
నయనతార తడబడుతూ “అది మిమ్మల్ని ముఖ్యమంత్రిని చెయ్యడం కోసం.
ఈ రాజా బాగోతాలు అన్ని జనాల ముందు పెడితే..తరవాతి స్తానం లో వున్నా మీరు ముఖ్యమంత్రి అవుతారు అందుకే ఆలా చేశా..” అంది..ఆనందరావు..కోపం గా భార్య వైపు చూసి “ఛీ పిచ్చి మొహమా..ఇలాంటి పనులు చేసే ముందు నాకు చెప్పే పనిగా వద్దు అని వారించే వాడిని..అసలు నాకు ముఖ్యమంత్రి కావాలని ఉందని నేనెప్పుడైనా చెప్పానా ” అని..రాజా వైపు చూసి..”క్షమించు రాజా..నా భార్య నిన్ను చెడు చేయాలన్న ఉద్దేశం తో ఇంటర్వ్యూ చెయ్యడానికి వచ్చింది.. అనుకోలేదు” అన్నాడు..

రాజా..ఆనందరావు వైపు చూసి..బుజం తట్టి. మొగుడు మీద ప్రేమతో..చేసి ఉంటుంది లే…ఇక నుండి ఇలాంటివి..మళ్ళీ జరగకుండా చూసుకోండి అని .
నయనతార వైపు ఎగా దిగా చూసి..”మొగుడు మీద ప్రేమతో.చేసి ఉంటావు అనుకుంటున్నా అదే వేరే ఎవరి ప్రోద్బలం తో చేసినట్టు అనిపిస్తే.రేపొద్దున నువ్వు నడిపే ఛానల్ ఉండదు..ఉపముఖ్యమంతిగా ఆనందరావు ఉంటాడో లేదో..చెప్పలేను” అన్నాడు.. నయనతార ఏమి మాట్లాడలేదు..
ఆనందరావు తల ఊపి నయనతారని తీసుకుని వెళ్లిపోయాడు..

ఆ సంఘటన జరిగినప్పటి నుండి…ముఖ్యమంత్రికి..ఉపముఖ్యమంత్రికి..పాలనా పరమైన నిర్ణయాల్లో….పార్టీ నిర్ణయాల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి అని రాజకీయ వర్గాల్లో.ఒక రకమైన చర్చ మొదలయ్యింది.
ఇద్దరూ పలు మార్లు ఖండించినా కూడా ఫలితం లేకపోయింది..

అయితే ఇలాంటి పరిస్థితులు మధ్య రాష్ట్రం లో ఒక శాసన సభ నియోజక వర్గానికి.. ఉప ఎన్నిక అవసరం అయ్యింది..

ఆ నియోజక వర్గం..ప్రతిపక్ష పార్టీ కి కంచుకోట లాంటిది. ఆ పార్టీ ఉన్నప్పటి నుండి ఆ నియోజక వర్గం లో ప్రతిపక్షం పార్టీ వాళ్ళు.. అసలు ఓడిపోలేదు..

ఆ పార్టీ సీనియర్ లీడర్ అయినా జలంధర రావు ఆ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు..అతను వీరేంద్రకి రాజకీయ గురువు లాంటి వాడు..ఆయనకి..ప్రతి రెండేళ్లకోసారి..రాజీనామా చేసి మళ్ళీ గెలిచి..తన బలం చూపించుకోవడం ఒక సరదా…

ఆ నియోజక వర్గం లో రాజా వాళ్ళ పార్టీ కి క్యాడర్ ఉన్న సరైన నాయకత్వం వహించే .. అభ్యర్థి. లేడు..
ప్రతిపక్ష పార్టీ నేత..వీరేంద్ర.. ఆ నియోజక వర్గం వాళ్ళకి కంచుకోట కనుక.. ఆ నియోజక వర్గం లో గెలిచి ప్రజల్లో ముఖ్యమంత్రి రాజా మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని ప్రచారం చెయ్యడానికి సిద్ధం గా వున్నాడు…

ఉప ఎన్నిక ప్రకటన రాగానే అధికార పార్టీలో ముఖ్య నేతలు అయినా..రఘురామయ్య..రాజా…ఆనందరావు..అనసూయ…తదితరులు… పార్టీ కార్యాలయం లో సమావేశమయ్యారు..

ఆ నియోజకవర్గం లో ఎవరిని అభ్యర్థి గా నిలబెడతాం అని. ఆలోచిస్తూ…మల్ల గుల్లాలు పడుతున్నారు.
రఘురామయ్య .ఇంకా ఆనందరావు..అనసూయ ని నిలబెడతాం అని తీర్మానించారు..

అనసూయ..”తను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గం చాలు అని..అది రాజీనామా చేసి..అనవసరం గా రిస్క్ చెయ్యను” అని చెప్పింది..

ఒకవేళ అంతకుముందు ఓడిన అభ్యర్థిని మళ్ళీ.. నిలబెడతాం అంటే..అతను తన వల్ల కాదు అని..చేతులెత్తేశాడు

రాజా..దీర్ఘం గా అలోచించి..అందరి వైపు చూస్తూ..”అక్కడ ఆ ముసలాయన ముందు..మన పార్టీ అభ్యర్థి గెలవాలి అంటే..మనం కొత్త అభ్యర్థిని నిలబెట్టాలి..మంచి సామాజిక పలుకుబడి ఉన్న..వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టాలి” అన్నాడు..

ఆనందరావు….”ఇప్పటికిప్పుడు మనకి అలాంటి కాండిడేట్ ఎవరు దొరుకుతారు” అన్నాడు

రాజా..ఆనందరావు వైపు చూసి..” మీ ఇంట్లోనే ఉంది..మీ భార్య నయనతార..ఆమెని నిలబెడతాం మన కాండిడేట్ గా” అన్నాడు..

ఆనందరావు..కొంచెం..ఆశ్చర్యం గా మొహం పెట్టి..”నయనతార నా తను నిలబడటానికి ఒప్పుకుంటుందో లేదో అయినా ఆమె ఏ విధం గా కరెక్ట్ కాండిడేట్ ” అన్నాడు..

రాజా చిరునవ్వు నవ్వి..”తను ఒక టీవీ రిపోర్టర్ అక్కడ ప్రాంత ప్రజలని చైతన్యవంతం చెయ్యగలదు.నాకు ఆమె గెలవగలదు అన్న నమ్మకం ఉంది” అన్నాడు.