ఊహిం 5 234

రఘురామయ్య తల ఆడించి రాజా వైపు నమ్మకం గా చూసి.. ఆనందరావు..బుజం మీద చెయ్యి వేసి..అతని చేతికి
నామినేషన్ పేపర్ ఇచ్చి..మీ ఆవిడ చేత నామినేషన్ వేయించు అన్నాడు..

ఆనందరావు.రఘురామయ్య వైపు చూసి…”పెద్దాయన మీరు చెపుతున్నారు అంటే నాకు నా భార్య గెలవగలదు అని నమ్మకం కలుగుతుంది కానీ అంగబలం అర్ధ బలం ఉన్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ముందు..అందుకు తగ్గ ఖర్చు నేను భరించలేను ..” అని..అన్నాడు..

రాజా నవ్వి ఆ సంగతి నాకు వదిలెయ్యండి..మీ భార్యని గెలిపించే పూచి నాది అన్నాడు.

ఆరోజు ఆనందరావు అతి కష్టం మీద తన భార్య నయనతార ని..ఉపఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఒప్పించాడు..నయనతార కూడా..తన టీవీ రిపోర్టర్ పోస్ట్ కి రాజీనామా చేసి..రాజా పార్టీ తరుపున నామినేషన్ వేసింది..

ఇంక ఉపఎన్నిక..ప్రచార పర్వం మొదలయ్యింది…నయనతార తో పాటు రాజా నే స్వయం గా ప్రచారం చేసాడు..

ప్రతిపక్ష పార్టీ కి కంచుకోట లాంటి నియోజక వర్గం లో..రాజా.తన అనుచర వర్గం తో…ఇంటి ఇంటికి తిరిగి…వోటర్లని ఆకట్టుకునేలా ప్రచారం చేసాడు..ఆ నియోజకవర్గం లో..ప్రతి ఇంట్లో యువతీ యువకుడు ఉంటే..తమ రాష్ట్రం లో పెట్టబోయే.విదేశీ…కంపెనీ ద్వారా ఉద్యోగం..ముసలి వాళ్ళు ఉంటే..ప్రభుత్వం ద్వారా ఉచిత వైద్యం .పిల్లలకి ఉచిత విద్య..అందేలా చేస్తాను అని హామీల వర్షం కురిపించాడు..

దానికి తోడు టీవీ రిపోర్టర్ గా నయనతార పని చేసే ముందు ఆ ప్రాంతపు ప్రజల నీళ్ల కష్టాల గురించి..ముఖ్యమంత్రి స్థాయికి వెళ్లేలా..టీవీ లో ప్రచారం చేసింది. దానితో…అధికార పార్టీ కి ఒక రకమైన..అనుకూల ఫలితం వచ్చేలా..సంకేతం.కనపడింది..

ఇంకో రోజులో.. ప్రచారం ముగిసిద్ధి అనగా… నయనతార…ఆనందరావు. ఇద్దరూ రాజా దగ్గరకి వచ్చారు
ఆనందరావు..తటపటాయిస్తూ..”రాజా…నయనతార గెలుస్తుందో లేదో.నాకు టెన్షన్ గా ఉంది”…అన్నాడు..
రాజా నవ్వి..ఇప్పటి దాక ప్రచారం చేసాం ఇప్పటిదాకా ఒక పద్ధతి రాబోయే మూడు రోజులు ఒక పద్ధతి..అదంతా.. ఈ ఊరిలో ఉన్న నా ఫామ్ హౌస్ లో మాట్లాడుకుందాం సాయంత్రం రండి అన్నాడు..
వాళ్ళకి ఆ మాట చెప్పి..రాజా. ఊరిలో పచ్చని పొలం మధ్యన ఉన్న ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోయాడు…

రాజా ఫామ్ హౌస్ ఊరికి చివర్న పెద్ద పొలం లో ఉంది..
అది పెద్ద కోట లాంటి ఇల్లు…చుట్టూ పదులు సంఖ్యలో పనోళ్ళు..ఉంటారు.

రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలకి. .ఆనందరావు..నయనతార కార్ లో ఫామ్ హౌస్ కి.. వచ్చారు..

వాళ్ళు రాగానే..బయట ఉన్న పని వాడు వచ్చి అయ్యగారు స్నానం చేస్తున్నారు…కూర్చోండి అని సోఫా చూపించి. వాళ్ళకి చెరో గ్లాస్ లో..వేడి వేడి పాలు ఇచ్చాడు..మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కూర్చుని పని వాడు అందించిన గ్లాస్ అందుకుని పాలు తాగుతూ ఉండగా..అనసూయ కూడా అందం గా రెడీ అయ్యి.. తన కార్ లో ఫామ్ హౌస్ కి వచ్చి..మొగుడు పెళ్ళాలు ఇద్దరికి నమస్కారం పెట్టింది..ఇంతలో పని వాడు కూడా అనసూయ కి ఇంకో గ్లాస్ పాలు ఇవ్వబోతే వద్దు అని..తనకు జ్యూస్ ఇవ్వమంది వాడు సరే అని తెచ్చి ఇచ్చాడు..

అనసూయ జ్యూస్ గ్లాస్ అందుకుని తాగుతూ..”ఈ మూడు రోజులు ఏం చెయ్యాలో ముఖ్యమంత్రి గారు మాట్లాడతాం అన్నారు అందుకే వచ్చా ” అంది..

నయనతార..చిరు నవ్వు నవ్వి “ముఖ్యమంత్రి గారు ఏం అంటారో ఎలా చెయ్యాలో ప్రచారం” అంది..
ఇంతలో రాజా..తెల్లని షర్ట్ పంచె కట్టుకుని ఒంటికి మంచిగా సెంట్ కొట్టుకుని వచ్చి వాళ్లకి ఎదురుగా ఇంకో సోఫా లో కూర్చుని…దూరం ఉన్న పని అమ్మాయిని పిలిచి..చెవిలో ఏదో చెప్పి పంపాడు..
ఆనందరావు “ఏం రాజా ఎలా చేద్దాం ప్రచారం ఇక నుండి” అన్నాడు.

రాజా..నవ్వి..”రేపు ఎలాగో చివరి రోజు కాబట్టి..మన పార్టీ పెద్దలు అయినా మా తాత గారు చూసుకుంటారు ప్రచారం..మనం తెర వెనుక కార్యక్రమాలు చూసుకుందాం” అని…అన్నాడు..ఆనందరావు..నయనతార..అనసూయ. ముగ్గురూ.”తెర వెనుక కార్యక్రమాలా” అని ఆశ్చర్యం గా చూసారు.

ఇంతలో ఒక పని అమ్మాయి.. గదిలోకి నుండి …తెల్లని చీర…ఎర్రని రవిక.వాటి పైన గాజులు..అరటికాయలు..తాంబూలం..ఒక బంగారు పళ్లెం లో పెట్టుకుని వచ్చింది..

ఆ బంగారు పళ్లాన్ని రాజా అందుకుని…అనసూయ ద్వారా..నయనతారకి ఇవ్వమని చెప్పి..”ఇది..మా వంశాచారం ప్రకారం …తొలి సారిగా గెలవబోయే..ఎమ్మెల్యే కి ఇచ్చే కానుక కొత్త బట్టలు..నగలతో కాబోయే కొత్త ఎమ్మెల్యేని అలకంరించి పంపించడం .మా వంశాచారం..మాకు ఎప్పటి నుండో ఆనవాయితీ” అని నవ్వుతూ అన్నాడు
ఆ బంగారు పళ్లాన్ని అనసూయ నవ్వుతూ నయనతారకి ఇచ్చింది..నయనతార పళ్లెం అందుకుని..”అయ్యో ఇవన్నీ ఎందుకు అయినా నేను ఇంకా ఎమ్మెల్యే గా గెలవలేదు కదా ” అంది మొహమాటం గా
ఆనందరావు..”వాళ్ళ వంశాచారం..ఆచారాల్ని మనం కాదు అనకూడదు తీసుకో” అన్నాడు

నయనతార మొగుడి మాటలకి.సరే అని తల.ఆడించి పళ్లెం అందుకుంది.

రాజా. చిరునవ్వు నవ్వి “మా కానుక .. తీసుకున్నందుకు.. ధన్యవాదాలు”..అని చిటిక వేసి.దూరం గా ఉన్న ఇద్దరు పని అమ్మాయిలని .పిలిచి..”కాబోయే ఎమ్మెల్యే గారిని కొత్త చీర నగలతో అలంకరించండి..అనసూయ గారు మీరు సాయం చేస్తే చెయ్యండి.” అన్నాడు..అనసూయ రాజా చూపులు గమనిస్తూ..”హ్మ్మ్ ఈరోజు వీడు దీనికి స్కెచ్ వేశాడా ఏంటి” అని మనసులో అనుకుంటూ నయనతార వైపు చూసింది..
నయనతార “అయ్యో ఇప్పుడు అలకరించడమా వద్దు అండి నేను ఎమ్మెల్యేగా గెలిచాక అలకరించుకుంటా” అంది

ఆనందరావు కూడా “అవును గెలిచాక మీరు ఇచ్చిన కొత్తబట్టలు నగలు వేసుకుంటే అందం ఇప్పుడే అయితే తొందర పడినట్టు ఉంటదేమో” అన్నాడు

రాజా మొగుడు పెళ్ళాల ఇద్దరి వైపు మార్చి మార్చి సూటిగా చూసి…”నా మదిలో నయనతార ఎమ్మెల్యేగా ఎప్పుడో గెలిచేసింది..ఆమె కానుక ఓడిపోతే నేను నా ముఖ్యమంత్రి పదివికి రాజీనామా చేస్తా” అని నిబ్బరం గా అన్నాడు

ఆనంద రావు..”రాజా నువ్వు ఇంతలా చెపుతున్నారు అంటే నాకు నమ్మకం గా ఉంది” అని నయనతార వైపు చూసి “అలంకరించుకో” అన్నాడు..నయనతార మొహమాటం గా చూసి “సరే” అంది దాంతో..రాజా..పని అమ్మాయిలని..అనసూయ ని..నయనతారకి తోడుగా అలంకరణలో.. సాయం చేసిరమ్మని పంపాడు..
వాళ్ళు ఆలా గదిలోకి వెళ్ళగానే..ఆనందరావు.చెప్పు రాజా..ఇక నుండి ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు..