వారసత్వం 2 172

అదంతా గుర్తొచ్చేసరికి నా మొహం అంతా చెమటలు. కావేరి నన్ను అలానే చూస్తూ, “గుర్తొచ్చిందా బావా!” అని, తరవాత జరిగింది చెప్పసాగింది.

“ఆ ఒక్కదెబ్బతోనే, నా కళ్ళ ముందే నీ ప్రాణాలు పోయాయి. మా నాన్న నిన్ను అక్కడే పూడ్చేసాడు. కళ్ళ ఎదురుగా అంత దారుణం జరిగేసరికి, నేను కూడా మొండికేసాను. పెళ్ళి కోసం నాన్న ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను ఒప్పుకోలేదు. బలవంతం చేయబోతే, ఆత్మ హత్య చేసుకోడానికి కూడా ప్రయత్నించా. బయటివాళ్ళను అయితే చంపగలడు గానీ, కన్న కూతుర్ని చంపుకోలేడుగా. అందుకే, ఆ దిగులుతోనే కళ్ళు మూసాడు. నేను ఇలా నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని, కన్నెగానే నీకోసం ఎదురు చూస్తున్నా.. ఆ పెళ్ళి పందిట్లో నిన్ను చూడగానే గుర్తించా.. నువ్వే నా బావవనీ, నా కోసం పుట్టావనీ.. కానీ నీకే తెలియలేదు.”

చెప్పి, బుంగ మూతి పెట్టుకున్న కావేరిని చూస్తుంటే, మళ్ళీ పద్దినిమిదేళ్ళ కావేరినే చూస్తున్నట్టు ఉంది నాకు. ఇక ఈ మరదలిని వదలకూడదు. లోకం ఒప్పుకోదని తెలుసు. కానీ, ఈ లోకం కంటే, ఒక జన్మంతా నాకోసం ఎదురు చూసిన కావేరి ముఖ్యం నాకు. కిందటి జన్మలో చేసిన తప్పు మళ్ళీ చేయను. అదే మాట ఆమెతో చెప్తూ, అపురూపంగా హత్తుకున్నాను. అలా హత్తుకుంటూ ఉంటే, చిత్రంగా అంతకు ముందు ఉన్న కామపు వేడి అంతా పోయి, ఏదో హాయిగా అనిపిస్తూ ఉంది. కావేరి గువ్వ పిట్టలా ఒదిగిపోయి, కళ్ళు మూసుకుంది. ఇంత కాలం నుండీ ఉన్న వేదన తీరిపోగా.. అలా.. అమాయకంగా.. ఏం చేస్తుందీ నా గుండెల పైన తన తల ఉంచి? ఆమె వైపు చూసాను. కళ్ళు మూసుకొనే ఉంది, లయ బద్దంగా ఊపిరి పీలుస్తూ. “నిద్ర పోయిందా!? హ్మ్మ్..” అనుకుంటూ, ఆమె నుదిటిపై చిన్నగా ముద్దు పెట్టాను. ఆ ముద్దుకి చిన్నగా కదిలి, మరింత గట్టిగా వాటేసుకుంది.

అయిపోయింది

1 Comment

  1. Don’t close this story,,
    Continue ????????????

Comments are closed.