జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 21 56

హాల్ బయట స్వాతి స్నేహితులంతా తన చుట్టూ చేరి జరిగిన విషయం తెలుసుకోవాలని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నట్లుగా తనను అటు ఇటు తిప్పుతూ అడుగుతుండగా , తను మాత్రం తల దించుకొని బాధపడుతూనే ఉండసాగింది.రకరకాల వంటలు ముఖ్య అతిథులతో పాటు కొంతమంది స్టాఫ్ కు వడ్డించగా అమ్మలిద్దరూ నావైపు చూడగా ఆకలి వేస్తుండటం వలన కమ్మేస్తుండగా , నన్ను చూసి ఆనందంగా నవ్వుతూ భోజనాలు ముగించగా సమయం 10 గంటలు అవుతుండగా ఇక బయలుదేరుతామని ఇందు అమ్మ ప్రిన్సిపాల్ గారికి చెప్పగా అందరూ గౌరవంగా అమ్మను కారు దగ్గర వరకు వదిలి , గౌరవంగా ఇచ్చిన వస్తువులను వెనుక కారులో పెట్టించి విక్రమ్ సర్ ను ఒకసారి కలిసి పనిమీద రెండు రోజులు ముంబై కు వెళ్తున్నామని చెప్పగా , ఏదైనా ప్రాబ్లెమ్ అయితే కాల్ చెయ్యమని చెప్పగా సరే అని చెప్పి కారు దగ్గరకు రాగా ,

అమ్మలిద్దరూ ఒకరి చెయ్యి ఒకరు అందుకొని వెనుక కూర్చొని మాట్లాడుతూ నాకోసం ఎదురు చూస్తుండగా , అమ్మ ఇక వెళదామా అని అడుగగా , బేబీ చాలా అలసిపోయాము మేము ఇక్కడే నిద్రపోతాము అని కళ్ళుమూసుకోగా సరే అమ్మ జాగ్రత్త అంటూ సీట్ బెల్ట్స్ ఇద్దరికి పెట్టి కారు ఎక్కి కాలేజ్ బయటకు వచ్చి కొంత దూరం ప్రయాణించగా ,

మొబైల్ మ్రోగుతుండగా జేబులో నుండి తీసి చూడగా మహి నుండి వస్తుండగా చిరునవ్వుతో అమ్మలిద్దరిని చూడగా అలసిపోయినట్లు ఘాడంగా నిద్రపోతుండగా కాల్ ఎత్తగా , బావ అంతా ok కదా ఏమి జరిగింది అని అడుగగా , చిన్నగా డ్రైవ్ చేస్తూ జరిగినదంతా చెప్పగా , మన ఇద్దరి కోసం తన నిజమైన ప్రేమను వదులుకుంటోంది బావ , బావ నీ మనసులో మాట చెప్పకుండా వచ్చేసావ , తను ఎంత బాధపడుతుంటుందో , బావ చెప్పాను కదా తనను వదులుకోవద్దు అని వెంటనే తనకు నా మాటగా నీ మనసులో మాటను చెప్పి తను ఎంత సంతోషపడ్డదో నాకు చెప్పు బావ అని మనఃస్ఫూర్తిగా చెప్పగా ,

మహి లైన్ లోనే ఉండమని చెబుతూ కారును అమాంతం వెనక్కు తిప్పి వేగంగా 5 నిమిషాలలో కాలేజ్ కు చేరుకొని లోపలికి వెళుతుండగా సెక్యురిటి ముందుగా ఆపడానికి ప్రయత్నించగా , కారును చూసి sorry చెబుతూ లోపలికి పంపగా హాల్ దగ్గర వెళుతుండగా ఒక్కరు కూడా కనిపించకపోవడంతో అందరూ హాస్టల్ కు చేరుకొని ఉంటారని అటువైపు వెళుతుండగా గ్రౌండ్ లో లైట్ కింద కొంత మంది చీరలు కట్టుకున్న అమ్మాయిలు గుంపుగా ఉండటంతో అది స్వాతి గ్యాంగ్ అని నిర్దారించుకొని ,

కారును ఆపి A C on చేసి విండోస్ అన్ని వేసి బయటకు దిగి మహితో చిన్నగా మాట్లాడుతూ వారి దగ్గరికి చేరుకోగా అందరూ చేతిలో భోజనం ప్లేట్ లు పట్టుకొని స్వాతి ప్లీస్ తినవే , అసలు ఏమి జరిగింది మహేష్ ఏమన్నా అన్నాడా , నీ ప్రేమను తిరస్కరించాడా , ఉదయం నుండి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టలేదు , రేపు మనమంతా వెళ్లి మహేష్ ను కలిసి నీ ప్రేమ గురించి చెబుదాము , నువ్విలా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నీలో నువ్వే భాధపడితే ఎలా చెప్పు……… అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న వేస్తూ బాధపడుతూ చేతిలో అన్నంతో నోటికి అందిస్తుండగా ,

స్వాతి మధ్యలో బండపై కూర్చొని తల వొంచుకొని మాట్లాడకుండా కదలకుండా ఉండగా , ఇదంతా విన్న మహి, బావ నీ హృదయంలో నాతో పాటు తనకు సమాన స్థానం ఉంది అని నేనే చెప్పినట్లుగా చెప్పి నీ మనసులో మాట చెప్పేంతవరకు తను చుక్క నీరు కూడా తగదు బావ తన మనసు నాకు బాగా తెలిసిపోయింది , నీ కోసం తన ప్రాణాలను కూడా లెక్కచెయ్యడం లేదంటే ఎంత ప్రేమ బావ వెంటనే నీ మనసులో మాట చెప్పి ఫోన్ స్పీకర్ on చేసి తనకు అందివ్వు బావ మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పగా ,అమ్మాయిల వెనుక నిలబడి ఒక ప్లేట్ అందుకొనగా నన్ను చూసి అందరూ షాక్ లో చూస్తూ ఉండిపోగా , మాట్లాడబోతుండగా “ష్…” అని సైగ చెయ్యగా అందరూ నెమ్మదిగా దూరంగా వెళ్లి నిలబడటానికి వెనక్కు పాదాలను తీసుకుంటుండగా , ఏమిటన్నట్లుగా స్వాతి తల ఎత్తి చూడగా ఎదురుగా నేను కనబడగా , సంతోషంతో ఒక్కసారిగా పైకి లేచి “మహేష్” అంటూ నన్ను గట్టిగా కౌగిలించుకోబోయి మహి గుర్తుకు వచ్చినట్లుగా ఆగిపోయి , చెంపలపై కారుతున్న కన్నీళ్లను నాకు కనబడరాదని ఆత్రంగా తుడిచేసుకుంటు , లేని సంతోషాన్ని పెదాలపై కష్టంగా తీసుకువస్తూ “మహేష్ నువ్వు ఇంకా వెళ్లలేదా” అని అడుగగా , “నీకు ఒకసారి నా హృదయం లోని మాటను మనసారా చెబుదామని ఆగిపోయాను , నాకు ఎలా చెప్పాలో తెలియటం లేదు” అంటూ నా రెండు చేతులను తన బుగ్గలపై వేసి,

“i love you” అని చెబుతూ నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టగా , “మహేష్ ఈ మాట వినడం కోసం ఎన్నో రోజుల నుండి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసాను , i love you too మహేష్ , కానీ ఎప్పుడైతే మహి నీ హృదయం లో ఉందని తెలిసిందో మీ కోసం నా ప్రేమను వధులుకోవాలి అని నిర్ణయించేసుకున్నాను , ఈ బాధ అంటావా కొన్ని రోజుల తరువాత అదే వెళ్ళిపోతుంది” అని కన్నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ తడబడుతూ చెబుతుండగా , “స్వాతి అక్క నిజంగా మహేష్ బావను మరిచిపోగలవా” అని మహి సడెన్ గా మాట్లాడగా , “నా ప్రాణం పోయేంతవరకు అది జరుగదు” అని వెంటనే సమాధానమిస్తూ , తానేమీ మాట్లాడిందో తెలిసి “మరిచిపోతాను” అని తడబడుతూ చెప్పగా ,

“బావ, స్వాతి అక్కను గట్టిగా కౌగిలించుకొని ప్రేమగా ముద్దు పెట్టెయ్. అలా కాని తను బయటపడదు” అని చెప్పగా , స్వాతిని గట్టిగా కౌగిలించుకొని “love you స్వాతి” అని నుదుటిపై అత్యంత ప్రేమతో చప్పుడొచ్చేలా ముద్దు పెట్టగా,
నా కౌగిలి స్పర్శకు ఇక ఏమాత్రం తట్టుకోలేక నన్ను గట్టిగా కౌగిలించుకుంటూ , “మహేష్ నీలో ఎక్కడో ఒక స్థానంలో నేను ఉండిపోతాను , నీకు, మహికి పనిమనిషిగా మీ ఇంటిలో నిన్ను చూస్తూ బతికేస్తాను” అని నా గుండెలపై ప్రేమగా ముద్దులు పెడుతుండగా , “స్వాతి అక్క, నేను మహిని మాట్లాడుతున్నాను. ఎక్కడో కాదు బావ హృదయంలో నీ స్థానం ఎప్పుడూ ఉంటుంది”.

“మహి గారు” అని ఏదో చెప్పబోతుండగా “నేను బావ కోసం ఏదైనా చేస్తాను , మీరు కూడా బావ కోసం అంత ప్రేమని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఇంతకంటే నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది, మీరు సంతోషంగా బావను ప్రేమిస్తూ ఉండండి , ఎలా జరగాలో కాలమే నిర్ణయిస్తుంది , ఏది ఒకసారి బావకు ప్రేమను తెలియజేసి నవ్వండి అక్క” అని ఆప్యాయంగా అడుగగా , కొద్దిసేపు మౌనం తరువాత “మహి నువ్వు నా గుండెల్లో స్థిరపడిపోయావు , నీ రుణం నా జీవితంలో తీర్చుకుంటానో లేదో , ఇంత మంచి చెల్లి నాకు దొరకడం నా పూర్వ జన్మ సుకృతం” అంటూ,

“లవ్ యు మహేష్” అని సిగ్గుపడుతూ చెబుతూ నవ్వగా , “sooo happy అక్క , బావ ఇప్పుడు నా మనసు కుదుటపడింది , ఇక మీ ఇష్టం” అని చెప్పగా , “లవ్ యు మహి” అంటూ ఫోన్ లో ఘాడంగా ముద్దు పెట్టగా , “లవ్ యు బావ” అని చెబుతుండగా

ఇద్దరికి ఒక రెండు రోజులు ముంబై వెళ్తున్నాను వచ్చాక కలుస్తాను అని చెప్పి స్వాతిని గట్టిగా మనసారా కౌగిలించుకొని నుదుటిపై గట్టిగా ముద్దు పెట్టగా , తల ఎత్తి నా పెదాలపై వెచ్చగా చిరునవ్వుతో ముద్దు పెట్టగా , కార్లో అమ్మ వాళ్ళు మాత్రమే ఉన్నారు అంటూ అందర్నీ పిలిచి స్వాతిని జాగ్రత్తగా చూసుకొమ్మని చెబుతూ కౌగిలించుకున్న సెల్ఫీని తీసుకొని రాగానే కలుస్తాను అని చెప్పి వదిలి వెళ్లలేక వదిలి తను హాస్టల్ కు వెల్లేంతవరకు చూసి లోపలికి వెలుతూ ఒకసారి వెనక్కు తిరిగి చూడగా నవ్వుతూ కారు దగ్గరికి వెళ్లగా అమ్మలిద్దరూ హాయిగా నిద్రపోతున్నారు.వెనుక డోర్ ను నెమ్మదిగా తెరిచి కారు లోపలికి వెళ్లి ఒకరి చేతిలో మరొకరి చెయ్యి వేసి అమ్మ భుజంపై ఇందు అమ్మ తల వాల్చి , ఇందు అమ్మ తలపై అమ్మ తల వాల్చి అలసిపోయి హాయిగా నిద్రపోతుండగా , నెమ్మదిగా అమ్మలిద్దరి సీట్ బెల్ట్స్ ను తీసివేసి సీట్ ను మెల్లిగా వెనుకకు వాలుస్తూ సమతలంగా మార్చుతూ అమ్మలిద్దరిని నెమ్మదిగా ఎత్తి వెనుకకు పడుకోబెడుతుండగా ,