జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 21 56

రాత్రి కాలేజ్ లో ఆలస్యం అయినందువల్ల అలసిపోయి కారులోనే ఘాడంగా నిద్రపోతున్నారు అమ్మమ్మ అని చెప్పగా ,ఈ అమ్మమ్మకు కలవడం కోసం గోవా నుండి ఒక్కడివే డ్రైవ్ చేసుకుంటూ వచ్చావా బంగారు అని అడుగగా , అమ్మలిద్దరికి ఇక్కడికి వస్తున్న విషయం ఇప్పటికీ తెలియదు అమ్మమ్మ , సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదు అందుకే వాళ్ళను డిస్టర్బ్ చెయ్యకుండా ఒక్కడినే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను , కాళ్ళు చేతులు పట్టేసాయి ఇప్పుడు నిద్రపోయానంటే ఎప్పుడు లేస్తానో నాకే తెలియదు అంత అలసిపోయాము అని మెల్లిగా చెప్పగా , వెంటనే నా చెంపలను అందుకొని నుదుటిపై ఆప్యాయంగా ముద్దు పెడుతూ , బంగారు త్వరగా కారును తలుపు వరకు తీసుకురా , అమ్మలతో పాటు హాయిగా బెడ్ పై రెస్ట్ తీసుకుందువు అని సెక్యూర్టీకి గేట్ పూర్తిగా తెరవమని చెప్పగా , కారును సరాసరి గుమ్మం వరకు తీసుకెళ్లి ఆపుతూ ,

ఇప్పుడెలా అని అమ్మమ్మ ఆలోచిస్తుండగా వెనుక డోర్ తెరిచి ముందుగా అమ్మను ఎత్తుకొని కిందకు దిగగా , అమ్మమ్మ నన్ను ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోగా , అమ్మమ్మ , అమ్మమ్మ అని పిలువగా , sorry బంగారు లోపలికి రా అంటూ ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తూ పైకి వెళ్లగా ఒక రూమ్ లోకి తీసుకువెళ్లి లైట్స్ వెయ్యబోతుండగా ఆపుతూ నెమ్మదిగా వెళ్లి మాస్టర్ బెడ్ పై పడుకోబెట్టగా , అమ్మమ్మ అమ్మ పక్కనే కూర్చుంటూ కాళ్ళ దగ్గర ఉన్న రగ్గును భుజం వరకు కప్పుతూ నా మనువడిని ఇంత వాణ్ణి చేసి మళ్ళీ నా దగ్గరకి తీసుకువచ్చినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అమ్మ చెయ్యి అందుకొని , తను చేసిన తప్పును తలుచుకుంటూ పశ్చాఅత్తాపం పడుతుండగా ,

అమ్మమ్మ అదంతా మరిచిపో అంటూ అమ్మమ్మ తలపై ముద్దు పెట్టి , నువ్వు అమ్మ దగ్గరే ఉండు అమ్మమ్మ , ఇందు అమ్మను తీసుకొని వస్తాను అని కిందకు వెళ్లగా , అమ్మమ్మ అమ్మ ఒక చేతిని అలాగే పట్టుకొని మరొక చేతితో చెంపపై ప్రేమగా నిమురుతూ ఉండగా , కారు లోపలికి వెళ్ళి బట్టలు ఉన్న బ్యాగును వెనుక వేసుకొని ఇందు అమ్మను రగ్గుతో పాటు ఎత్తుకోగా , నా స్పర్శ తగలగానే నిద్రలోనే బేబీ ఇంటికి వచ్చేసామా , చాలా అలసిపోయాను లోపలికి నువ్వే ఎత్తుకొని బెడ్ పై నీ వెచ్చటి కౌగిలిలో పడుకోబెట్టుకో అని నా మెడ చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా పట్టుకొని గువ్వ పిట్టలా నా చేతులలో వొదిగిపోగా , మా అమ్మ ఎలా చెబితే అలా అంటూ పెదాలపై వెచ్చటి ముద్దును పెట్టగా , మ్మ్…..అంటూ ఇంకా గట్టిగా హతుక్కుపోగా , పెదాలపై చిరునవ్వుతో లోపలికి రాగా ,

ఎదురుగా గోడపై మొన్న గోవా చర్చి లో అమ్మలిద్దరితో దిగిన సెల్ఫీ ని అమ్మమ్మకు పంపినది అప్పుడే పెద్దగా ఫ్రేమ్ చేయించి గోడపై ఉండగా , ఇంతకు ముందు గమనించలేదు అని అమ్మమ్మకు మేమే తన లోకం అని మురిసిపోతూ పైన రూమ్ లోకి వెళ్లి బెడ్ కు అటువైపున ఇందు అమ్మను పడుకోబెడుతుండగా , ఇందు అమ్మ నా చెయ్యిని వదలకుండా గట్టిగా తన గుండెలపై పట్టేసుకొని ఉండగా , బ్యాగును కిందకు జార్చేస్తుండగా , బంగారు రాత్రంతా నిద్రపోకుండా డ్రైవ్ చేసుకొని వచ్చావు నువ్వుకూడా ఇక్కడ మధ్యలో పడుకో అని చూపించగా , సరే అమ్మమ్మ అని మధ్యలోకి వస్తూ బెడ్ పై వాలిపోగా బేబీ …..అంటూ నాకు దగ్గరగా జరుగుతూ హత్తుకుపోతూ తలను నా ఛాతిపై వాల్చి వెచ్చగా ఇందు అమ్మ నిద్రపోగా ,అమ్మమ్మ నా కాళ్ళ దగ్గరకు వచ్చి బెడ్ పై కూర్చుంటూ నా పాదాలపై రెండు చేతులతో సున్నితంగా ఒత్తడం మొదలుపెట్టగా , అమ్మమ్మ వద్దు అంటూ కాళ్ళను వెనక్కు తీసుకోగా , నిన్ను చిన్నప్పటి నుండి ఈ చేతులతో , ఒడిలో పెంచే భాగ్యం నాకు కలుగలేదు , కనీసం ఇప్పుడైనా ఈ అదృష్ట బాగ్యాన్ని కలిగిస్తావా బంగారు అని కన్నీళ్లు కారుస్తూ ఉద్వేగంతో బాధగా అడుగగా , అమ్మమ్మ బాధపడుతుండటం చూసి ఏమి చెయ్యాలో తెలియక , మిమ్మల్ని బాధపెట్టడానికి కాదు మేము వచ్చినది కావున మీకు ఏది సంతోషం అనిపిస్తే అలా చెయ్యండి అని కాళ్ళు చాపగా , నా మనవడు నిజంగా బంగారు కొండే అని ఆనంద భాస్పాలు కారుస్తూ మురిసిపోసాగింది.

అలసిపోయి ఉండటం వలన వెంటనే నిద్రపట్టెయ్యగా కొద్దిసేపటికి అమ్మ కూడా నా వైపుకు జరుగుతూ నా గుండెలపై తల వాల్చి నన్ను కౌగిలించుకోవడానికన్నట్లు చేతిని నా చుట్టూ వెయ్యబోగా ఇందు అమ్మ తగలగా మెల్లిగా ముఖం దగ్గరకు తీసుకువెళ్లి చెంపపై సున్నితంగా నిమురుతూ నాకు పూర్తిగా హతుక్కుపోగా , అమ్మమ్మ మా ముగ్గురిని ఆప్యాయంగా చూస్తూ నిద్రలోనే ఒకరిమీద మరొకరు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా మనసులో అనుకుంటూ , నా కూతుర్లు మరియు మనవడు చాలా అదృష్టవంతులని మురిసిపోతూ తనివితీరా చాలసేపటి వరకు నా కాళ్ళను సంతోషంగా వొత్తుతూ ,

తెల్లవారుతుండగా మేము లేచేలోపు మంచి మంచి వంటలు తయారుచేసి ఉంచాలని పైకి లేచి కిటికీల నుండి వెలుతురు పడకుండా కర్టైన్స్ మూసివేసి బయటకు వస్తూ చలి ఎక్కువగా ఉండటంతో మా ముగ్గురికి మరొక దుప్పటిని భుజాల వరకు కప్పుతూ నా బంగారు మనవడు అంటూ గాలిలో ఒక ముద్దు విసిరి చప్పుడు కాకుండా తలుపు వేసి కిందకు వెళ్లి అమ్మమ్మకు ఎల్లప్పుడూ తోడుగా ఉండే నమ్మకమైన ఇద్దరు పనిమానుషులను లేపుతూ ఏమేమి చెయ్యాలో వివరించి అర గంటలో స్నానం రెడి అయ్యి ముగించి వంటపనిలో నిమగ్నమయ్యారు.పని మనుషులకు వంటలు చాలా రుచిగా ఉండాలని చెబుతూ దగ్గరుండి చేయిస్తూ ఉండగా , ఇక్కడ బెడ్ పై ముందుగా అమ్మకు మెలకువ రాగా కళ్ళుతెరిచి నా గుండెలపై ప్రేమగా ముద్దులు పెడుతూ తల ఎత్తి నా ముఖం చూస్తూ ఇంకా దగ్గరగా అతుక్కుపోతూ ఒక చేతితో ఇందు అమ్మ చెంపలపై మెల్లిగా నిమురుతూ ఇందు అమ్మ నిద్రలోనే కొద్దిగా కదలగా నా చెంపపై మరియు పెదాలపై చిన్నగా తియ్యటి ముద్దులు పెడుతూ గుడ్ మార్నింగ్ కన్నయ్య అని నెమ్మదిగా చెబుతూ లేత వెలుతురులో చుట్టూ చూడగా అంతా కొత్తగా కనిపిస్తుండగా ,

మెల్లిగా నానుండి విడివడి బెడ్ పై లేచి కూర్చుంటూ చుట్టూ ఆశ్చర్యంగా గోడలపై చూస్తూ నన్ను లేపడానికన్నట్లు మా వైపు చూడగా ఘాడంగా నిద్రపోతుండగా , కన్నయ్య ఎక్కడికి తీసుకువచ్చాడా అని కళ్ళను రెండు చేతులతో తుడుచుకుంటు గోడలపై ఉన్న ఒక్కొక్క ఫోటో ఫ్రేమ్ నే దీర్ఘన్గా చూడసాగింది.

కొద్దిసేపటి తరువాత ఇందు అమ్మకు అక్కయ్యకు , బేబీ కి ఆకలి వేస్తుందేమో లేచి వంట పని చూడాలని ఆతృతగా లేస్తూ ప్రశాంతంగా నిద్రపోతున్న నా ముఖాన్ని చూసి పెదాలపై చిరునవ్వుతో లవ్ యు బేబీ అంటూ నా పెదాలపై వెచ్చటి ముద్దును పెట్టి మత్తుగా లేచి కూర్చుంటూ కళ్ళు మూసుకుని కురులను వెనుక ముడివేసుకుంటూ పక్కకు చూడగా అమ్మ ఆశ్చర్యంగా ఎదురుగా చూస్తుండగా ,

అక్కయ్య అని పిలిచినా కూడా కదలకపోయేసరికి ఏమి చూస్తోందా అని కళ్ళు తుడుచుకుని ఒకసారి అమ్మ చూస్తున్న వైపు చూడగా చుట్టూ నాలుగు వైపులా గోడలపై ఇందు అమ్మ నవ్వుతున్న మరియు నేను ఇందు అమ్మ సంతోషంగా తీసుకున్న ఫోటోలను ఫ్రేమ్ లుగా తయారు చేసి గోడలపై తగిలించి ఉండగా అక్కడక్కడా నేను చిన్నప్పుడు జానకి అమ్మతో దిగిన ఫోటోలు కూడా ఉండటంతో,ఇందు అమ్మ ఫోటోలన్ని కూడా నేను ఇందు అమ్మను కలిసిన క్షణం నుండి తీసినవే ఉండటంతో ఆశ్చర్యంతో ఎక్కడ ఉన్నామని చుట్టూ చూడగా ఇది అమ్మ రూమ్ అని గుర్తుకు రాగా , అంటే ఇప్పుడు ముంబై లో అమ్మ దగ్గరకు వచ్చామన్నమాట అని కంగారుపడుతూ కొద్దిగా ముందుకు జరిగి అమ్మ భుజం పై చెయ్యి వేసి ,

అక్కయ్య అని పిలువగా ఇందు అమ్మ వైపు తిరిగి చెల్లి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము , నాకేమి అర్థం కావడం లేదు అని కంగారుపడుతుండగా , అక్కయ్య మనం ఇప్పుడు ముంబైలో ఉన్న అమ్మ ఇంట్లో ఉన్నాము , మీరేమి కంగారుపడకండి , రాత్రికి రాత్రి మనకు తెలియకుండా బేబీ తీసుకువచ్చాడు అందుకే అలసిపోయి ఘాడంగా నిద్రపోతున్నాడు అంటూ నా చెంపలపై ప్రేమగా నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టి బెడ్ దిగి ఫోటోలు చూడటానికి వెల్లసాగింది.

అమ్మ కూడా ఇందు అమ్మతో పాటు వెళ్లగా , ఇందు అమ్మ అమ్మ చెయ్యి అందుకొని ఒక్కొక్క ఫోటోనే చూపిస్తూ అప్పుడు జరిగిన సంఘటనను సంతోషంగా నవ్వుతూ , సిగ్గుపడుతూ వివరిస్తుండగా ,

కొద్దిగా ముందుకు వెళ్లగా చిన్నప్పుడు మొదటిసారిగా స్కూల్ కి వెళ్ళేటప్పుడు అమ్మతో పాటు తీయించుకున్న ఫోటో కనిపించగా ఇందు అమ్మ దానిని అందుకొని ఫోటోను ఆనందంగా చూస్తూ తన గుండెలపై హత్తుకుంటూ , అక్కయ్య మన బేబీ స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఏడ్చేవాడా అని అడుగగా , అమ్మ ఇందు అమ్మ చెంపపై చెయ్యి వేసి నిమురుతూ అప్పటి వరకు కన్నయ్యను విడిచి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండేదాన్ని కాదు , వాళ్ళ నాన్న స్కూల్ గురించి చెప్పగా నాకయితే స్కూల్ కే అయినా కూడా సాయంత్రం వరకు చూడలేనన్న బాధతో కన్నీళ్లు ఆగలేదు,