జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం – Part 21 56

“బేబీ పూర్తిగా అలసిపోయాము” అని నిద్రలోనే కలవరిస్తూ నా చేతిని పట్టుకోగా “అమ్మ నేనున్నాను కదా, హాయిగా పడుకోండి నేను చూసుకుంటాను” అని అమ్మలిద్దరి పెదాలపై వెచ్చగా ముద్దులు పెట్టగా “మ్మ్..” అంటూ ముడుచుకొని పడుకొంటుండగా వెనుక బ్యాగులో ఉంచిన రగ్గులు తీసి అమ్మలిద్దరి భుజాల వరకు కప్పుతూ కిందకు దిగి నెమ్మదిగా డోర్ వేసి ,

డ్రైవింగ్ సీట్ లో కూర్చొంటూ మొబైల్ అందుకొని తెల్లవారిలోపు ముంబై చేరుకుంటామని మెసేజ్ పెట్టి కారు స్టార్ట్ చేసి , AC on చేస్తూ లైట్ గా మ్యూజిక్ పెట్టుకొని హుషారుగా బయటకు వస్తూ క్యాంపస్ ఊరి బయటే ఉండటం వలన 10 నిమిషాలలో గోవా ముంబై హైవే ఎక్కగా వీలైనంత వేగంగా టోల్ గేట్ దాటుకుని గంట పాటు ప్రయాణించగా ,

నిద్ర ఆవహిస్తున్నట్లుగా కళ్ళు మూతలు పడుతుండగా బాటిల్ అందుకొని నీళ్లు తాగుతూ ప్రయాణిస్తుండగా , 10 నిమిషాలలో చిన్న ఊరు రాగా టీ స్టాల్ కనిపించగా అటువైపుకు పోనిస్తూ, రెండు టీ లు తాగి డబ్బులు ఇచ్చేసి అర గంట సాఫీగా ప్రయాణించగా , నేను కూడా అలసిపోయి ఉండటం వలన మళ్ళీ కళ్ళు మూతలు పడుతుండగా కళ్ళు తిక్కుకుంటు కష్టంగా కారును తొలుతుండగా ,

కళ్ళు మూతలు పడుతుండగా వాటంతట అవే కళ్ళు ముసుకోగా పెద్దగా మొబైల్ రింగ్ అవుతున్న చప్పుడుకు ఆత్రంగా కళ్ళు తెరుస్తూ ఒంపు తిరిగిన రోడ్ ను వెంటనే గమనించి తిప్పుతూ నెమ్మదిగా పోనిస్తూ , thank గాడ్ అని తలుచుకుంటూ మొబైల్ అందుకోగా , మహి నుండి కాల్ వస్తుండగా “నిజంగా నా దేవత” అని నిద్ర మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోగా మ్యూజిక్ ఆఫ్ చేస్తూ పెదాలపై చిరునవ్వుతో , హెడ్ ఫోన్స్ మొబైల్ కు తగిలించి చెవిలో పెట్టుకొని ,

కాల్ ఎత్తుతూ “లవ్ యు మహి, నువ్వు నా దేవతవని మరోసారి నిరూపించావు” అని ప్రేమగా ముద్దుల వర్షం కురిపించగా , “లవ్ యు బావ , ఇప్పుడు ఎక్కడ ఉన్నావు” అని అడుగగా , “ముంబై హైవే మీద ఉన్నాను మహి. సరైన సమయం లో కాల్ చేసావు , నిద్ర పట్టడం లేదా” అని అడుగగా , “నా శరీరంలో ప్రతి అణువు నీకోసం ఆరాటపడుతుంటుంది బావ , నీకు ఏదైనా అవసరం పడితే నా హృదయం వెంటనే నాకు చెప్పేస్తుంది. నీవు డ్రైవ్ చేస్తుంటావు కదా బావ, నీతో మాట్లాడుతూ యాక్టీవ్ గా ఉంచుతూ సేఫ్ గా ముంబై చేరుకునేంతవరకు నీకు కంపెనీ ఇద్దామని చేశాను బావ” అని చెప్పగా ,

“ఇప్పుడు జరిగింది అదే మహి, లవ్ యు” అంటూ మొత్తం నిద్ర ఎగిరిపోగా చాలా యాక్టీవ్ గా కారును వేగంగా పోనిస్తూ “అత్తయ్య, పిల్లలు ఎలా ఉన్నారు” అని అడుగగా , “బాగున్నారు బావ, తినేసి పడుకున్నారు, అక్క, మావయ్య ఎప్పుడు వస్తారు అని రోజు అడుగుతున్నారు బావ” , “తొందరలోనే వచ్చేస్తాను అని చెప్పు” అని అత్తయ్య గురించి అడుగగా , “అమ్మ చాలా ఆనందంగా ఉంది బావ కానీ ఒక్కసారైనా అల్లుడి దర్శనార్థం దొరుకుతుందేమో అని వెయ్యి కళ్లతో ఆశగా ఎదురు చూస్తోంది బావ , అమ్మకు ఏమైనా చెప్పాలా” అని సిగ్గుపడుతూ అడుగగా , “అంతా నా మరదలు దేవి గారి దయ” అని నవ్వుతూ చెప్పగా ,

“నా దేవుడి కోసం ఏదైనా చేస్తాను” అని మనఃస్ఫూర్తిగా చెప్పగా , మనసు ఉప్పొంగిపోతూ ఆనందంతో మాటలు రాకపోవడంతో “బావ బావ …” అని పిలుస్తుండగా , ఉద్వేగంతో “మహి నువ్వు నా జీవితంలో లేకపోతే నేను ఏమయిపోయేవాన్నో” అంటూ చెబుతుండగా , “బావ నువ్వు నా ప్రాణం బావ ఇంకెప్పుడూ ఆ మాట అనొద్దు” అని నేను నిద్రపోకుండా మాట్లాడుతూ మాట్లాడిస్తూ ఉండగా ,

అంతలో స్వాతి నుండి కూడా కాల్ వస్తుండగా , మహితో చెప్పగా “అయితే కాన్ఫరెన్స్ కాల్ లో పెట్టెయ్ బావ ముగ్గురమూ మాట్లాడుతూ ప్రయానిద్దాము” అని చెప్పగా , “సరే మహి” అంటూ స్వాతిని కూడా కాల్ లోకి తీసుకొని , “స్వాతి ఇంకా నిద్రపోలేదా” అని అడుగగా , మహి చెప్పిన విషయమే చెప్పగా , “బావ same to same. చెప్పానుగా స్వాతి అక్క గురించి” అని చెప్పగా ,

“లవ్ యు both ఏంజెల్స్. ఇక ముంబై వరకు కళ్ళు మూతలు పడతాయనే భయమే లేదు. మీతో హాయిగా మాట్లాడుతూ తెల్లవారిలోపు ముంబై చేరుకోవచ్చు” అంటూ హుషారుగా వీలైనంత వేగంగా ముందుకు పోనిచ్చాను. “స్వాతి అక్క, ఇప్పటికైనా కడుపునిండా భోజనం చేసావా” అని అడుగగా , “చెల్లి…” అని పిలిచి మళ్ళీ ఎందుకో “మహి” అని పిలువగా , “స్వాతి అక్క, నేను నీ చెల్లిగా ఉండటానికి సరికానా” అని అడుగగా ,

“చెల్లి నువ్వు నా ప్రాణం , ఎవ్వరూ ఇవ్వని ప్రేమను నీతోపాటు సగభాగం హృదయపూర్వకంగా నాకు పంచావు , నీకు అక్కగా ఉండే అర్హత ఉందా అని నేనే నిన్ను బ్రతిమాలుకోవాలి. అంతటి దేవతవు నువ్వు , జీవితాంతం నిన్ను సేవిస్తూ, తరించే భాగ్యం నాకు కల్పించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటాను” అని తీవ్ర ఉద్వేగంతో మనసారా చెప్పగా ,

“అక్కా, బావను ఇద్దరమూ సంతోషంగా ఉంచి, ప్రేమగా చూసుకోవాలి. అంతే నాకు ఇంకా ఏ ఆశ లేదు” అని వారిద్దరే ఏదేదో మాట్లాడుతుండగా , వింటున్న నాకు హృదయం పొంగిపోతూ ఏమి మాట్లాడాలో తెలియక వారి ప్రేమను ఎంజాయ్ చేస్తుండగా , “బావ , మహేష్ ఏంటి మాట్లాడటం లేదు” అని అడుగగా , “ఇద్దరు దేవకన్యలు నన్ను దంతోషంగా ఉంచడం కోసం చేస్తున్న త్యాగాలకు ఆనందంతో మాటలు రావడం లేదు” అని చెప్పగా , “లవ్ యు బావ , మహేష్” అని బదులివ్వగా ,

“ఇంతకూ నేను ముంబై ఎందుకు వెళుతున్నానో తెలుసుకోవాలని ఆతృత మీకు లేదా?” అని అడుగగా , “చెప్పే విషయం అయ్యి ఉంటే ముందే చెప్తుంటివి కదా బావ , మహేష్” అంటూ ఒకేసారి చెప్పగా , “లవ్ యు మహి , స్వాతి” అని మురిసిపోతూ , మహి , స్వాతి జనరల్ గా ఆడవాళ్లు మాట్లాడుకునే విషయాలను సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటుండగా , మధ్యమధ్యలో నన్ను పలకరించినపుడు “ఊ” కొడుతూ ఉండగా 2 గంటల సమయంలో ఇద్దరూ అలసిపోయినట్లుగా నెమ్మదిగా మాట్లాడుతూ “బా…..బావ.., మాహే…మహేష్…” అంటూ నిద్రలోకి జారుకోగా “స్లీప్ వెల్ దేవకన్యలు” అని చెరొక ముద్దు పెడుతూ గేర్ మారుస్తూ నెమ్మదిగా వీలైనంత వేగంగా పోనిస్తూ వాహనాలను దాటుకుంటూ ముందుకు పోనివ్వసాగాను.సమయం 4 గంటలు అవుతుండగా welcome to mumbai అన్న బోర్డ్ చూడగా హమ్మయ్య అనుకోని లోపలికి వస్తూ మొబైల్ తీసి నిన్న వచ్చిన మెసేజ్ లో ఉన్న అడ్రస్ ను gps ట్రాక్ లో పెట్టగా , ఉన్న చోటు నుండి 15 km దూరంలో ఉండగా ట్రాఫిక్ లైట్స్ అన్ని ఆఫ్ చేసి ఉండటం వలన అర గంటలో ఆ ఏరియా ని చేరుకోగా , ఆ ఏరియా అంతా చాలా పోష్ గా పెద్ద పెద్ద బంగళాలతో ప్రతి ఇంటి ముందు సెక్యురిటి కాపు కాస్తూ మిలియనీర్స్ నివాసం ఉంటున్నట్లుగా హుందాగా ఉండగా 10 నిమిషాలలో ఇంటి ముందు కారును ఆపగా , అది కూడా మూడంతస్తుల బిల్డింగ్ తో చుట్టూ పెద్ద కాంపౌండ్ తో ఇండిపెండెంట్ హౌస్ లా ఇంటి ముందు సెక్యురిటి కుర్చీలో గురకలు పెడుతూ నిద్రపోతుండగా , వెనుకకు చూడగా అమ్మలిద్దరూ కదలకుండా ప్రశాంతంగా నిద్రపోతుండగా , కారు దిగి గేట్ సందులో నుండి చూడగా గ్రౌండ్ ఫ్లోర్ లో లైట్స్ వెలుగుతుండగా ,

మొబైల్ తీసుకొని కాల్ చేయగా మొదటి రింగుకే లిఫ్ట్ చెయ్యగా అమ్మమ్మ వచ్చేసాము ఇంటి బయట ఉన్నాము అని చెప్పగా , మరు క్షణమే బయట లైట్స్ అన్ని వెలుగుతూ సెక్యురిటి , సెక్యురిటి అని గట్టిగా అరుస్తూ మా దగ్గరికి వస్తుండగా , మేడం అంటూ కంగారుగా కుర్చీలో నుండి లేవగా ఓపెన్ ద గేట్ అని అరవగా , జీ మేడం అంటూ ఒక గేట్ తెరువగా , వేగంగా నా దగ్గరకు రాగా నన్ను ఆనందంతో పై నుండి కింద వరకూ చూస్తుండగా , అమ్మమ్మ ఎలా ఉన్నావు అంటూ పాదాలకు నమస్కరించగా , మహేష్ అంటూ రెండు చేతులతో పైకి లేపుతూ ఆప్యాయంగా కౌగిలించుకుంటు అమ్మమ్మకు కలవడానికి ఇన్ని రోజులు పెట్టిందా బంగారుకొండ అని అటు ఇటు ఆప్యాయంగా కౌగిలించుకుంటు ఆనంద భాస్పాలు కారుస్తూ ఉప్పొంగిపోతుండగా ,

బంగారు నిన్ను ఇంత ప్రయోజకున్ని చేసిన నా పెద్ద కూతురు జానకి ఎక్కడ అని ఆతృతగా నా వెనుక చూస్తుండగా , ఒక్కసారిగా కళ్ళల్లో ఆనంద భాస్పాలు కారుతుండగా అది చూసి , బాధగా ఏమయ్యింది బంగారు అని అడుగగా , ఇన్ని సంవత్సరాల తరువాత కలవబోతున్నా కూడా మొదట ఇందు అమ్మను చూడాలని ఆశపడకుండా అమ్మను అడుగుతున్నారు , అది కూడా నా పెద్ద కూతురు అన్నందుకు సంతోషంతో హృదయం పరవశించిపోతూ ఆనంద భాస్పాలు కారసాగాయి అమ్మమ్మ అని చెప్పగా , బంగారు ఎప్పుడైతే నేను ఇందు గురించి బాధపడుతున్నానని తెలుసుకొని తన ఆనందంగా జ్ఞాపకాలను పంపిస్తూ ప్రేమగా చూసుకున్నారో అప్పుడే జానకి నా పెద్ద కూతురుగా ఫిక్స్ అయిపోయాను , ఎక్కడ నా పెద్ద కూతురు అని ఆతృతగా అడుగగా ,