విక్రమ్ : ఏంటి అలా చూస్తున్నారు పదండి వెళదాం.
పూజ : ఆ మానస సలీమాకి సారీ చెప్పమని చెప్పి వెళ్ళింది అందుకే అలా షాక్ లో ఉండిపోయాం, మళ్ళీ మనల్ని ఆటపట్టించట్లేదు కదా…
ఇంతలో నా భుజం మీద వెనక నుంచి ఎవడో రాడ్ తొ కొట్టాడు.. మొన్న ఫాతిమా అమ్మని స్మశానం వరకు ఒక్కన్నే ఎవ్వరికి ఇవ్వకుండా మోసాను కదా అక్కడ కొంచెం కమిలింది దెబ్బ కరెక్ట్ గా అక్కడే పడేసరికి కింద కూర్చుండిపోయాను.
చందు వాడిని ఒక్క తన్ను తన్నాడు, దూరం నుంచి సంధ్యతొ మాట్లాడుతున్న భరత్ చూసి పరిగెడుతూ వచ్చి మిగతా వారి మీద కలపడ్డాడు నేను లేచి మిగతా వాళ్ళ మీద కలబడ్డాను, చుట్టు స్టూడెంట్స్ అంతా మూగి చూస్తున్నారు.
ఊరివాళ్ళం కదా ఆరుగురిని ముగ్గురం కలిసి బాగానే హేండిల్ చేసాం, మా పిడి గుద్దుళ్ళకి తట్టుకోలేక వాళ్ళు పారిపోయారు, మేము క్లాస్ కి వెళదాం అని మెట్లు ఎక్కుతుండగా ఎవరో మాట్లాడుకోగా విన్నాం (అరే వీళ్ళు ఆ mla మనుషులు కదా వాళ్ళతో వీళ్ళకేంటి గొడవ) అని.
పూజ అది విని : చెప్పాగా ఆ మానస మంచిగా మాట్లాడినప్పుడే అర్ధం చేసుకోవాల్సింది ఇలాంటిదేదో ఉంటుందని వాళ్ళనీ….
విక్రమ్ : ఇది మానస పని కాదు, ఇంతటితొ వదిలేయ్…
పూజ : మరి.. ఇంకెవరి పని?
విక్రమ్ : అదిగో అక్కడ చెట్టు కింద ఉన్నారు కదా సోనియా, పల్లవి వాళ్ళ పని.
అందరు అటు చూసారు మమ్మల్ని కొట్టడానికి వచ్చిన మనుషులని తిడుతున్నారు, పారిపోయి వచ్చారనేమో.
క్లాస్ లోకి ఎంటర్ అవుతూనే నా కళ్ళు ఆటోమేటిక్ గా మానస కోసం క్లాస్ మొత్తం స్కాన్ చేసేసాయ్, చివరి బెంచ్ లో కూర్చుని నన్నే చూస్తుంది, తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చింది అది గమనించాను…తనని చూస్తూ వెళ్లి కూర్చున్నాను, మానస నన్నే చూస్తుంది ఓర కళ్ళతో.
సలీమ : విక్రమ్ దెబ్బ చాలా గట్టిగా తగిలిందా ఏది చూడని…
విక్రమ్ : లేదు చిన్నదే.. తగ్గిపోతుంది.
పూజ : అవునురా మానస కాదు అని అంత గట్టిగా ఎలా చెప్పావ్?
విక్రమ్ : ఏదో అలా చెప్పా వదిలేయ్యవే… (నమ్మకం మా అమ్మ తన గురించి చెప్పినదాని బట్టి తన మీద ఉన్న నమ్మకం అని మనసులో అనుకున్నాను).
కాసేపటికి సోనియా, పల్లవి వచ్చి మానస పక్కన కూర్చున్నారు, వాళ్ళు మానసతొ ఏం చెప్పారో తెలీదు కానీ వాళ్ళని తిట్టి నన్ను చూస్తూ లేచి అక్కడనుంచి వెళ్ళిపోయింది.
అందరం క్లాస్ వింటూ జోకులు వేసుకుంటూ ఉన్నాం ఇంతలో ల్యాబ్ పీరియడ్ లో అందరు ల్యాబ్ కి వెళ్లారు, నేను కొంచెం సేపు పడుకుంటానని చెప్పి క్లాస్ లోనే ఉండిపోయాను, లేచి క్లాస్ లో అటు ఇటు తిరుగుతూ డోర్ వైపు వెళ్తుండగా మానస లోపలికి వచ్చింది.
ఇదే మొదటి సారి ఇద్దరం ఎదురెదురుగా మా పక్కన ఎవ్వరు లేకుండా ఒకరి కళ్ళలోకి ఇంకొకరం చూసుకోడం, నన్ను చూస్తూనే నోరు తెరిచి అలానే ముందుకు వస్తూ బెంచ్ కి కాలు తట్టి ముందుకు పడబోయింది, చెయ్యి అందించడానికి చెయ్యి పైకి లేపాను, నా అర చేతిలో తన చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని పడిపోకుండా నీలాదొక్కుకుని నిల్చుని నన్నే చూస్తుంది.
Super story. Title chusi skip cheste super story.miss avutam. Pl continue and show your talent writer garu