లవ్ పార్ట్ 2 438

ఇంకా తన చెయ్యి నా చేతిలోనే ఉంది, క్లాస్ లోకి ఎవరో వస్తున్నా చప్పుడుతొ సడన్ గా నా చెయ్యి వదిలేసి నా చేతిలో ఆయింట్మెంట్ పెట్టి తన బెంచ్ దెగ్గరికి పరిగెత్తింది.

ఈలోగా మా క్లాస్ స్టూడెంట్స్ అంతా వచ్చేసారు,

రమ్య : ఏంట్రా పడుకోలేదా?

విక్రమ్ : లేదు ఆయింట్మెంట్ తెచ్చుకోడానికి వెళ్ళా.

పూజ : తెచ్చుకున్నావా మరి?

విక్రమ్ : ఇదిగో.

నా బెంచ్ లో కూర్చోడానికి వెళ్తూ మానసని చూస్తుండగా సలీమా నా చేతిలో ఉన్న ఆయింట్మెంట్ తీసుకుంది, నాకు రాయడానికి, ఆ తరువాత కాలేజీ అయిపోయాక మానసని ఒకసారి చూసి ఇంటికి వచ్చేసాను సలీమాతొ పాటు.

ఇంటికి రాగానే అమ్మ ఏదో ఒకరకంగా నన్ను గమనిస్తూ సైగ చేసింది, నాకు అర్ధం కాలేదు ఇప్పటివరకు అమ్మ అలా చెయ్యనే లేదు.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

సాయంత్రం ఆరు అవుతుండగా మానస వాళ్ళ నాన్నతొ గొడవేసుకుంది, మానస వాళ్ళ అమ్మ ఒక పక్కన నిలబడి ఆశ్చర్యంగా చూస్తుంది.

వాళ్ళ నాన్న కూడా అయోమయంగానే ఉన్నాడు, ఎదురుగా సోనియా, పల్లవి ఇద్దరు తలలు దించుకుని ఉన్నారు.

మానస : ఎవరిని పడితే వాళ్ళని కొట్టడమేనా, చూసుకోవద్దు.

శివరాం : నిన్ను ఏడిపించారని చెప్పారు అందుకే మనుషుల్ని పంపించాను తల్లీ.

మానస : “పెద్ద గొప్ప పని చేసావ్… వాళ్ళు ఏది చెప్తే అది నమ్మేయ్యడమేనా, పనికిమాలిన మొహాలు” అని సోనియా, పల్లవి ఇద్దరినీ కోపం గా చూసింది.

శివరాం : ఇప్పుడేమైంది? కొడితే కొట్టారు ఏం కాదులే..

మానస : ఇలా ఆలోచిస్తావ్ కాబట్టే mla దెగ్గర ఆగిపోయావ్, ఆ అబ్బాయి ఎవరో తెలుసా, ఆ అబ్బాయి చెప్తే ఒక ఊరి స్టూడెంట్స్ మొత్తం కదులుతారు, చాలా ఫాలోయింగ్ ఉంది కాలేజీ లో.. మీరు ఇలా స్టూడెట్స్ అందరిని కనిపించినోడినల్లా కొట్టుకుంటు పోతే ఆఖరికి ఈ mla పోస్ట్ కూడా ఊడిద్ది….స్టూడెంట్స్ సపోర్ట్ లేకుండానే మీరు ఎదగ గలరని అనుకుంటున్నారా?

శివరాం : నువ్వు చెప్పిందీ కరెక్టే.. ఆ అబ్బాయికి సారీ చెప్పించనా?

మానస : చెప్పించాల్సింది కొట్టినోళ్లతో కాదు కొట్టించాల్సిన వాళ్ళతో…అని అక్కడనుంచి వెళ్ళిపోయింది, మానస వాళ్ళ అమ్మ తనలోని మార్పుని గమనిస్తూనే ఉంది .

మానస తన రూమ్ లోకి వెళ్లి అసహనంగా బెడ్ మీద కూర్చుంది, అక్కడే రమ ఆంటీ కొడుకు నాని కూర్చుని ఆడుకుంటున్నాడు.

సడన్ గా మానసని చూసి బెదిరిపోయాడు, నానీ ని చూడగానే మానసకి ఇందాక తన చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది “చెప్పించాల్సింది కొట్టినోళ్లతో కాదు కొట్టించాల్సిన వాళ్ళతో” అని కానీ కానీ నానీని ఒకప్పుడు తన్నిన్ది తనే కదా….

ఇంట్లో పని చేస్తున్న రమకి మానస పైకి వెళ్ళగానే తన రూమ్ లో ఆడుకుంటున్న తన కొడుకు గుర్తొచ్చి పైకి పరిగెత్తింది కానీ అక్కడే డోర్ దెగ్గర చాటుగా చూస్తున్న మానస వాళ్ళ అమ్మని చూసి ఆగిపోయింది.

మానస : నానీ ఇలా రా..

నానీ అప్పటికే మానసని చూసి బెదిరిపోయి ఉన్నాడు, భయం భయంగానే దెగ్గరికి వెళ్ళాడు.

మానస తన బ్యాగ్ లో నుంచి చాక్లేట్ తీసి నానీ కి ఇస్తూ.. ” సారీ నానీ ఇంకెప్పుడు నిన్ను కొట్టను ఏమి అనను సారీ ” అంది.

అయినా కూడా పిల్లాడు బెదిరిపోయి ఉండడంతొ మానస తన జేబు లోనుంచి ఫోన్ తీసి ప్లేస్టోర్ లో కార్ గేమ్ ఇన్స్టాల్ చేసి “ఇదిగో కార్ గేమ్ ఆడుకుంటావా?” అంది.

నానీ గాడికి ఫోన్ చూడగానే కళ్ళు మతాబుల్లా ఎలిగిపోయాయి వెంటనే అన్ని మర్చిపోయి చెయ్యి చాపాడు.

మానస నానీ నీ పక్కన కూర్చోబెట్టుకుని సారీ చెప్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్స్ అంది, నానీ గాడు ఇప్పుడు ఆ ఫోన్ కోసం ఏమైనా చేస్తాడు అందుకే నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు, నవ్వుకుంటూ ఫోన్ వాడి చేతికి అందించింది.

నానీ గేమ్ లో నిమగ్నమైపోయాడు మానస ఫ్రెషప్ అవ్వటానికి బాత్రూం లోకి దూరింది, ఇదంతా చూసిన మానస వాళ్ళ అమ్మ సంతోషంగా రమని కౌగిలించుకుని తన రూమ్ కి వెళ్ళిపోయింది….ఏం జరిగిందో తెలుసుకున్న రమ కూడా ఆనందంగా పని చేసుకోడానికి వెళ్ళిపోయింది.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

1 Comment

  1. Super story. Title chusi skip cheste super story.miss avutam. Pl continue and show your talent writer garu

Comments are closed.