లవ్ పార్ట్ 2 482

వారం రోజులుగా నేను మానస చూసుకోడం తప్ప పెద్దగా ఏం జరగలేదు, ముకుంద సినిమా లాగ గడిచిపోయింది ఈ వారమంతా, ఎవ్వరు లేనప్పుడు ఎవరూ మమ్మల్ని గమనించనప్పుడు నన్ను చూసి నవ్వేది అది నవ్వు కుడా కాదు నవ్వినట్టు కళ్ళతోనే చెప్పేది

అమ్మ నన్ను గమనిస్తూనే ఉంది, అప్పుడప్పుడు కళ్ళతో అర్ధంకానీ సైగలు చేసేది కానీ నేను అడిగితే మాత్రం నేను ఏం అనలేదే అని వేళ్ళతో చూపించేది.

రేపు కాలేజీకి వెళ్లొద్దు అమ్మతో ఉండి ఆ సైగలకి అర్ధం తెలుసుకోవాలి అనుకున్నాను కానీ నా వల్ల మళ్ళీ సలీమా ఎందుకు ఆగిపోవాలని బైలుదేరాను.

≈≈≈≈≈≈≈≈≈≈≈

ఇవ్వాళ నా పుట్టినరోజు అమ్మకి లంగా ఓణిలో కనిపించాలని తెగ ప్రయత్నించాను కానీ దొరకలేదు, వారం ముందే కుట్టించుకోవాలట నాకు తెలియక నేను ఒక్క రోజు ముందు వెళ్ళాను.

అందుకే ఇక మాములు డ్రెస్ వేసుకుని బైటికి వచ్చాను అందరు విష్ చేసారు, అమ్మ దెగ్గర ఆశీర్వాదం తీసుకుందామని అమ్మ రూమ్ లోపలికి వెళ్ళాను.

మానస : అమ్మా…! అని చుట్టు చూసింది.

అప్పుడే రూమ్ లోపలికి వెళదామని లోపలికి వచ్చి మానసని చూసింది వాళ్ళ అమ్మ.

మానస అమ్మ : మానసా…

మానస వెనక్కి తిరిగింది.

మానస అమ్మ : హ్యాపీ బర్తడే అని నవ్వుతూ చెయ్యి ఇచ్చింది.

మానస ఏడుస్తూ చెయ్యి నెట్టేసి గట్టిగా హత్తుకుపోయింది.. మానస వాళ్ళ అమ్మ వెన్ను నిమురుతూ, “కొత్త డ్రెస్ వేసుకోవా?” అని అడిగింది.

మానస : నాకు నచ్చింది దొరకలేదు మా..

మానస అమ్మ : నీకోసం నేనొక డ్రెస్ కొన్నాను వేసుకుంటావా?

మానస : ఆనందంగా “ఏది మా”

మానస అమ్మ : ఇదిగో అని లంగా ఓణి అని చేతికిచ్చింది.

మానస వాళ్ళ అమ్మని కౌగిలించుకుని లోపలికి వెళ్లి మార్చుకుని వచ్చింది.

మానస : అమ్మా ఎలా ఉంది..

మానస అమ్మ : బాగుంది కానీ నీకు సెట్ అవ్వాలా..

మానస : పర్లేదు మా నాకు నచ్చింది అని హత్తుకుని కాలేజీకి బైల్దేరింది.

లంగా ఓణిలో వచ్చిన మానసని చూసిన సోనియా పల్లవి ఓర్చుకోలేక కుళ్ళకుని, కావాలని జ్యూస్ ఒంపి సారీ అన్నట్టు నాటకమాడారు.

సోనియా : అయ్యో సారీ మానస చూసుకోలేదు, నీ బర్తడే రోజే ఇలా అవ్వాలా ఇంకా నీకు విషెస్ కూడా చెప్పలేదు, అని పల్లవికి కన్ను కొట్టింది.

1 Comment

  1. Super story. Title chusi skip cheste super story.miss avutam. Pl continue and show your talent writer garu

Comments are closed.