లవ్ పార్ట్ 2 482

పల్లవి : సారీ కాదు ముందు మానసకి డ్రెస్ ఇప్పించు.

మానసకి కోపంతొ పాటు బాధ కూడా వచ్చింది ఇక ఇప్పుడు చేసేదేం లేక వాళ్ళ వెంట షాపింగ్ కి వెళ్ళింది.

లోపల సోనియా పల్లవి ఇద్దరు కలిసి మినీ స్కిర్ట్ అండ్ టీ షర్ట్ సెలెక్ట్ చేశారు, తనకి నచ్చకపోయినా బలవంతం చెయ్యడంతొ తప్పక తీసుకుంది.

కాలేజీకి వెళ్లారు, అందరు బర్తడే విషెస్ చెప్తున్నారు కానీ ప్రతి మగాడి కన్ను మానసని కామంతొ చూసేసరికి మానసకి సిగ్గుగా అనిపించింది, విక్రమ్ కి ఈ డ్రెస్ లో ఎలా కనిపించాలో అర్ధం కాలేదు.

ఇంతలో విక్రమ్ రానే వచ్చాడు కానీ రోజు తనని గుచ్చి గుచ్చి చూసే కళ్ళు అస్సలు తనని చూడకపోడంతొ బాధగా తల దించుకుని క్లాస్ కి వెళ్ళింది….క్లాస్ లో అందరు విషెస్ చెప్పారు కానీ మానసకి అస్సలు అవి వినపడలేదు.

≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

పూజ : ఇవ్వాళ మానస బర్తడే అంట, తెగ చెప్పుకుంటున్నారు..

రాగానే మానసని దూరం నుంచే గమనించాను ఆ డ్రెస్ చూసి కోపం వచ్చింది, తనని చూడకుండానే లోపలికి వెళ్ళాను, కానీ ఆ డ్రెస్ లో తను ఇబ్బంది పడటం చూసాను, నాకు తెలిసి ఇది కూడా ఆ ఇద్దరు దున్నపోతుల పనే అయ్యుంటుంది.

అందుకే అందరికీ ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటికి బైలుదేరాను.

విక్రమ్ : అమ్మా అమ్మా త్వరగారా అలా సిటీ దాకా వెళ్లొద్దాం.

అమ్మ : ఎందుకు రా? అని వెళ్ళు చూపించింది.

విక్రమ్ : మానస గురించి చెప్పాను, బర్తడే కి డ్రెస్ కొందాం అన్నాను.

అమ్మ మళ్ళీ ఎప్పుడు ఇచ్చే అర్ధం కానీ ఎక్సప్రెషన్ ఇచ్చింది, అప్పుడు అర్ధం అయ్యింది నాకు, నేను లవ్ లో పడ్డానని నన్ను వెక్కిరిస్తుంది అని.

విక్రమ్ : అమ్మా! నిన్నూ…..ఇన్ని రోజులు నాతో ఆడుకుంటున్నావ్ కదా…

అమ్మ : సరే సరే పదా వెళదాం.

అమ్మని తీసుకుని సంతోషంగా సిటీకి వచ్చి ఇద్దరం కలిసి మంచి చీర సెలెక్ట్ చేసాము, అమ్మ అందులో రెడీ మేడ్ ఉందేమో కనుక్కోమంది.

జాకెట్ కి సైజ్ అడిగితే అమ్మ నాకు సైగ చేస్తే షాప్ వాడికి చెప్పాను. అమ్మ నన్ను చూసింది నేను సిగ్గుపడ్డాను. మళ్ళీ నన్ను ఏడిపించాలని చూసింది కానీ తన చెయ్యి గట్టిగా పట్టేసుకున్నాను వద్దు అంటూ అమ్మ నవ్వుకుంది.

ఇద్దరం డ్రెస్ ప్యాక్ చేపించి మళ్ళీ అమ్మని ఇంట్లో దింపి కాలేజీకి వచ్చాను, అప్పటికే లంచ్ బ్రేక్ అయ్యింది.

కాల్ చేసి అందరిని కాంటీన్ దెగ్గరికి రమ్మన్నాను, మా వాళ్ళు అందరు బైటికి వెళ్ళిపోయాక క్లాస్ కి వెళ్ళాను, మానస ఒక్కటే బెంచ్ లో కూర్చుని ఉంది.

లోపలికి వెళ్లి నా బెంచ్ దెగ్గరికి వెళ్తున్నాను మానస నన్నే చూస్తుంది, తనని దాటి వెళ్తూ తన ఒళ్ళో పడేలా నా చేతిలో ఉన్న కవర్ వేసి మళ్ళీ బైటికి వెళ్లాను.

1 Comment

  1. Super story. Title chusi skip cheste super story.miss avutam. Pl continue and show your talent writer garu

Comments are closed.