మానస కవర్ లో డ్రెస్ ఉండటం చూసుకుని ఆనందంగా మార్చుకోడానికి వెళ్ళింది.
నేను కాంటీన్ కి వెళ్లి మా వాళ్ళతో క్లాస్ కి వచ్చాను, ఇంకా మానస రాలేదు.
అందరు క్లాస్ కి వచ్చారు రూప మేడం కూడా వచ్చి క్లాస్ తీసుకుంటుంది, నేను మానస కోసం చూస్తున్నాను, ఇక సహనం కోల్పోయి బైటికి వెళ్లి తనని చూడాలన్న ఆత్రంతొ లేవబోయాను.
అప్పుడు ఎంట్రీ ఇచ్చింది నా దేవత… తెల్లటి చీర, గోల్డెన్ అంచు, అదే రంగు చంకీలతో సన్నని పైట, జాకెట్ భుజానికి అటు ఇటు మెత్తటి ఈకల లాంటి డెకొరేషన్ చీరకి ముత్యాల డిజైన్ అబ్బబ వర్ణించడం కంటే చూడటం మేలు అని కన్ను అర్పకుండా నోరు తెరుచుకుని అలానే చూస్తున్నాను, మానస నన్ను చూసి నవ్వుకుంటూ వెళ్ళి కూర్చుంది.
ఆఖరికి రూప మేడం కూడా నైస్ సారీ అని మెచ్చుకుంది, అన్నిటికంటే మానసకి అప్పటి వరకు కామంతొ చూసిన కళ్ళన్ని ఇప్పుడు ఆకర్షణతొ ఆరాధిస్తున్నట్టు చూస్తుంటే విక్రమ్ మీద ఇంకా ఇష్టం పెరిగిపోయింది.
కాలేజీ అయిపోయే టైం కి అందరు తనతో మాట్లాడాలంటేనే భయపడేవారు అలాంటిది అందులో చాలా మంది ఏది అయితే అది అయ్యింది అని ప్రొపోజ్ కూడా చేసేసారు, మానస నవ్వుతూ సున్నితంగా రిజెక్ట్ చేసింది, మానసకి గర్వంగా అనిపించింది.
ఇంతక ముందు తను చూసుకుని పడే గర్వానికి, ఇప్పుడు ఒచ్చిన గర్వానికి ఉన్న తేడా కూడా తెలుసుకుంది.
కాలేజీ అయిపోయి అందరు ఇంటికి వెళ్లిపోతుండగా మానస అందరిని పిలిచి “ఇవ్వాళ నా బర్తడే సందర్బంగా చిన్న పార్టీ అందరు తప్పకుండా రావాలి అని నన్ను చూస్తూ అందరు తప్పకుండా రవాలి” అని ఎవ్వరికి కనిపించకుండా నాకు మాత్రమే కనిపించేలా పెదాలు వణికిస్తూ ప్లీజ్ ప్లీజ్ అంది….అందరం ఇన్విటేషన్ కార్డ్స్ తీసుకుని బైటికి వచ్చాం.
పూజ : అరేయ్ మనం కూడా వెళదాం రా..
విక్రమ్ : నీకు తనంటేనే పడదు ఎందుకే అక్కడికి మనం.
పూజ : రేయ్ పార్టీ ఎక్కడో తెలుసా గ్రీన్ లోటస్ హోటల్ లో మన జీవితంలో మళ్ళీ అక్కడికి వెళ్లలేము ప్లీజ్, ప్లీజ్….. ప్లీజ్ రా వెళదాం.
విక్రమ్ : సరే సరే ముందు ఇంటికి వెళ్ళండి, అందరు రెడీ అయ్యి ఉండండి వెంకట్ అన్న కార్ తీసుకుని వెళదాం.
అందరు ఆనందంగా “యే” అని హై ఫయ్ కొట్టుకున్నారు.
విక్రమ్ : పూజ ఆ హోటల్ పేరేంటి?
పూజ : గ్రీన్ లోటస్…….
మానస విక్రమ్ ఇచ్చిన చీరతొ నే ఇంట్లోకి అడుగుపెట్టింది అక్కడ నానీ చూసి “ఏయ్ మానసక్క ఒచ్చిందోచ్”… అని అరవడం చూసి “ష్” అని నానీ పెదాల మీద వేలు పెట్టింది, కిచెన్ లోనుంచి రమ చూసి సూపర్ అని వేళ్ళతో సైగ చేసింది.
మానస నానీ చెయ్యి పట్టుకుని రమని చూసి నవ్వుతూ వాళ్ళ అమ్మ రూమ్ దెగ్గరికి వెళ్ళింది.
మానస : అమ్మా…
మానస అమ్మ : తల్లీ వచ్చేసావా?
మానస : “ఆగు… కళ్ళు మూసుకో… నేను వచ్చేదాకా తెరవకూడదు..” అని అమ్మ ముందుకి వెళ్లాను.
మానస : అమ్మా కళ్ళు తెరువు..
మానస వాళ్ళ అమ్మ కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తూ, నుదిటి మీద ముద్దు ఇచ్చి “తల్లీ ఎంత అందంగా ఉన్నవో అచ్చు దేవతలా ఉన్నావ్”.
వెనకే వచ్చిన రమ కూడా “నేను అదే అందమనుకుంటున్నా మీరు అనేసారు అమ్మగారు”.
మానస సిగ్గుపడింది.
మానస అమ్మ మానసని మంచం మీద కూర్చోబెట్టి “తల్లీ ఎవరా అబ్బాయి?”. అనేసరికి మానస షాక్ అయ్యింది, తనతో పాటే రమ కూడా…
మానస నానీ గాడి అవస్థ గుర్తించి బ్యాగ్ లో నుంచి నానీ కోసం కొన్న కొత్త ఆపిల్ టాబ్ సీల్ తీసి వైఫై కనెక్ట్ చేసి గేమ్ ఇన్స్టాల్ చేసి వాడికి ఇచ్చింది.

Super story. Title chusi skip cheste super story.miss avutam. Pl continue and show your talent writer garu