లవ్ పార్ట్ 2 482

మానస : “నానీ ఇలా రా, ఇదిగో ఇది నీకోసమే కొన్నాను ఎప్పుడు నీ దెగ్గరే ఉంటుంది కానీ నీకు ఇదివ్వాలంటే నాకు ప్రామిస్ చెయ్యాలి”, అని చెయ్యి చాపి.. “బాగా చదువుకుంటానని నాకు ప్రామిస్ చెయ్”.

నానీ ప్రామిస్ చేసి టాబ్ తీసుకుని ఇల్లంతా ఆనందంగా తిరుగుతున్నాడు, రమ ఇబ్బందిగా చూసింది కానీ ఏమనలేకపోయింది…. ఇప్పుడు రమకి కావాల్సింది అది కాదు మానస ఎవరిని ఇష్టపడుతుందా అని.

మానస : ఇక అమ్మని చూసి “మా నీకెలా తెలుసు?”

మానస అమ్మ : ఒక్క రోజులో ఇన్ని మార్పులు ప్రేమలో పడితే తప్ప సాధ్యం కావులే..

మానస : అది… మా క్లాస్ లో…

రమ : ఆ క్లాస్ లో…

మానస అమ్మ : ఆ…చెప్పు…

మానస : రెండు చేతులతో మొహం దాచుకుని “నన్ను చెప్పనిస్తారా లేదా?”

మానస అమ్మ : సరే చెప్పు చెప్పు.

మానస : మా క్లాస్లో అబ్బాయి.. పేరు విక్రమ్, మొన్న నాన్న కొట్టించారని అరిచా కదా తనే.

రమ : ఎలా ఉంటాడు నీ అంత అందంగా ఉంటాడా, హైట్, మనిషి దిట్టంగా ఉంటాడా?

మానస : సాయంత్రం పార్టీకి రమ్మని పిలిచాను అప్పుడు చూద్దు…వస్తాడో రాడో..

మానస అమ్మ : పిలిచావుగా తప్పకుండా వస్తాడు.

మానస : క్లాస్ అందరితొ పాటు పిలిచాను, అస్సలు ఇప్పటి వరకు తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు దూరం నుంచి చూడటమె..

రమ : ఇదేం ప్రేమ.. విడ్డురంగా?

మానస అమ్మ : ఎప్పటినుంచి ప్రేమిస్తున్నావ్ తల్లీ?

మానస తన అమ్మని వాటేసుకుని ఈ వారం రోజుల నుంచే…

మానస అమ్మ : మా పొగరుబోతు మానసని ఒక్క వారంలో చూపులతో మార్చేశాడా?

మానస : మా…. ఇది గోరం.. పోండి నేను చెప్పను..

రమ : నువ్వు చెప్పు మానస…. అమ్మగారు మీరుండండి..

మానస : ఒక్క రోజులో… కాదు కాదు ఒక్క చూపులో మార్చేసాడు.. అమ్మా ఎట్టి పరిస్తుతుల్లో విక్రమ్ ని వదిలిపెట్టకూడదు… నాకు విక్రమ్ కావాలి ఏం చెయ్యాలో చెప్పండి.

రమ : వెళ్లి ముద్దు పెట్టెయ్ ఇక నీ చుట్టే తిరుగుతాడు..

మానస : పో అక్కా..

మానస అమ్మ : నువ్వుండేవే రమ..తల్లీ మంచివాడా తనగురించి నీకేం తెలుసు?

మానస విక్రమ్ గురించి తనకి తెలిసింది చెప్పింది.

మానస అమ్మ : ఒక ” అమ్మాయిని చెల్లెలా చూసుకుంటున్నాడు అంటే మంచివాడే అందులోనూ నీకు నచ్చాడుగా చూద్దాం వస్తాడుగా పార్టీకి, ఇక పదండి రెడీ అవ్వండి.

1 Comment

  1. Super story. Title chusi skip cheste super story.miss avutam. Pl continue and show your talent writer garu

Comments are closed.