రమ : రేయ్ నానీ నువ్వు ఆడుకుంటూ కూర్చో మేము వెళ్లి కేక్ తినేస్తాం..
నానీ : అమ్మో…. నాకు కేక్ కావాలి… అని లేచి వాళ్ళ అమ్మ వెనకాల పరిగెత్తాడు.
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
ఇంటికి వెళ్లి అమ్మతో చెప్పాను, అమ్మ కూడా వస్తానంది, అందరూ రెడీ అయ్యి మా ఇంటికి వచ్చేసారు, అందరం కలిసి గ్రీన్ లోటస్ హోటల్ కి బైలదేరాము.
హోటల్ లోపలికి వెళ్లి పార్కింగ్ చేసి ఒక్కసారి ముందు నుంచి ఆ హోటల్ చూసి అందరం ఆశ్చర్యపోయాం, అంత పెద్ద హోటల్ ముందు మానసకి విషెస్ చెప్తూ పెద్ద కట్ అవుట్, పక్కనే మిగతా రాజకీయ నాయకుల ఫోటోలు.
పూజ : అబ్బా ఎంత పెద్ద హోటల్, మనం కనీసం ఇందులో టిఫిన్ చెయ్యాలంటే ఇంట్లో ఒక నెల సరుకుల డబ్బులు కావాలి.
విక్రమ్ : మనం కూడా మానస వాళ్ళ నాన్నలాగ అక్రమాలు చేద్దాం అప్పుడు టిఫిన్ ఏం ఖర్మ ఇందులోనే ఉండొచ్చు.
అమ్మ నన్ను డోక్కలో పొడిచి ష్..అని సైగ చేసింది, లోపలికి వెళ్ళాము అస్సలు ఇంద్ర లోకం లోపలే ఉంది ఆ లైటింగ్స్, డెకొరేషన్ చాలా నీట్ గా ఉంది, ఇంకా మానస రాలేదు, వాళ్ళ నాన్న వచ్చే రాజకీయ నాయకులని ఆహ్వానిస్తున్నాడు..
కేక్ కటింగ్కి టైం ఇంకో పది నిముషాలు ఉందనగా మానస లోపలికి వచ్చింది అందరు తనని విష్ చేస్తున్నారు, థాంక్స్ చెపుతూ బొకేలు అందుకుని పక్కనే ఉన్న ఆవిడకి ఇస్తుంది తనేమో తన పక్కనే ఉన్న ఒక చిన్న పిల్లాడికి ఇస్తుంది.. మానస ఇంకో పక్క వాళ్ల అమ్మ అనుకుంట పోలికలు కనిపిస్తున్నాయి, చూస్తుంటేనే తెలుస్తుంది తను చాలా మంచిదని తన అందమే మానసకి వచ్చిందనుకుంటా…
అన్నిటికంటే నాకు నచ్చిన అంశం ఏమిటంటే మానస నేను కొనిచ్చిన చీరే కట్టుకు రావటం, దూరం నుంచే నన్ను చూసి నవ్వింది థాంక్స్ అన్నట్టుగా..మానస కార్పెట్ మీద నడుచుకుంటూ వస్తుంటే గాల్లో పూలు చల్లుతూ హడావిడి చేస్తున్నారు నిజంగా దేవత లాగే ఉంది…మానస వాళ్ల అమ్మకి ఇంకా తన పక్కన ఉన్న ఆమెకి నన్ను చూపించినట్టు అనిపించింది నాకు, వాళ్లు నడుచుకుంటూ దెగ్గరికి వస్తుంటే మేమందరం అలా చూస్తూ ఉండిపోయాం…అమ్మ నాకు రోజా పువ్వు అందించింది నన్ను దాటుకుని వెళ్తుండగా తన పక్కనే ఉన్న పిల్లాడిని పిలిచాను ఆ అబ్బాయి నా దెగ్గరికి వచ్చాడు, తనతో పాటే వాళ్ల అమ్మ అనుకుంటా తను కూడా ఆగింది…
“నీ పేరేంటి…?”
“నానీ”
“నానీ ఈ పువ్వు మీ అక్కకి ఇస్తావా?”
నానీ ఆలోచిస్తుండగా వాళ్ల అమ్మ తీస్కో అని సైగ చేసింది, నానీ ఆ పువ్వు తీసుకుని పరిగెత్తుకుంటూ మానస దెగ్గరికి వెళ్లి పువ్వు ఇచ్చి నన్ను చూపించాడు… మానస నన్ను చూసి సిగ్గుగా పువ్వు తీసుకుని తన చెవి దెగ్గర పెట్టుకుంది…
ఇంతలో నాకంట్లో ఎవరో చాటుగా గుస గుసగా మాట్లాడుకుంటూ మెట్లు ఎక్కడం గమనించాను… ఏదో అనుమానంగా ఉండి వాళ్ల వెనకే చిన్నగా పైకి వెళ్లాను…
లోపలకి వెళ్లి కర్టెన్ చాటున దాక్కున్నాను, అక్కడ ఇరవై మంది ఆడపిల్లల్ని కాళ్ళు చేతులు నోరు కట్టేసి ఉంచారు.. ఇంతలో
P1 : రేయ్ పదిహేనో తారీకు గుర్తు పెట్టుకో ఈ ఇరవై మందిని లంబసింగి చేర్చాలి.
P2 : లంబసింగిలో ఎక్కడ అన్నా?
P1 : భద్రాచలం కొత్తగూడెం నుంచి అరకు వెళ్లే రూట్లో.. మధ్యలో లంబసింగి వెళ్ళడానికి ఒక రోడ్ ఉంది ఆ రోడ్ లో మొదట కాలువ తగులుతుంది చిన్న బ్రిడ్జి అంతే.. దాని కిందే అక్కడ పెద్ద ట్రక్ ఉంటుంది అక్కడ నువ్వు నీ ట్రక్ ని డెలివరీ ఇస్తే చాలు… మిగతాది అన్న చూసుకుంటాడు…
P2 : అలాగే… అన్నా కొంచెం డబ్బులు అవసరం పడ్డాయి…
P1 : ఇప్పిస్తా లే అని అక్కడ నుంచి మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు..
నేను కిందకి వచ్చేసాను, అమ్మ వాళ్ళ దెగ్గరికి వచ్చేసరికి మా కాలేజీ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాడు.. దానికి అందరు క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
అమ్మ : ఎటు వెళ్ళావ్ అని సైగ చేసింది.

Super story. Title chusi skip cheste super story.miss avutam. Pl continue and show your talent writer garu