నా చిటికిన వేలు చూపించాను.. అమ్మ మానస వైపు చూపించి వెక్కిరించింది.. ప్లీజ్ ఒద్దు అందరూ ఉన్నారని సైగ చేసాను..అమ్మ నవ్వింది.
సలీమా : మానస డ్రెస్ బాగుంది కదా?
విక్రమ్ : హ్మ్మ్ సూపర్ సెలక్షన్.
సలీమా : అబ్బా ఛా నిన్ను నువ్వే పొగుడుకుంటున్నావ్.. ఇచ్చింది నువ్వేగా?
వెంటనే తన నోటిని మూసేసాను… “నీకెలా తెలుసు?”
సలీమా : ఆరోజు నిన్ను పిలుద్దామని క్లాస్ కి వచ్చాను నువ్వు మానస వైపు కవర్ విసిరేయ్యడం ఆ తరువాత తన డ్రెస్స్ మారిపోవడం అన్నీ గమనిస్తూనే ఉన్నాలే… మీ ఇద్దరి సైగలు అబ్బో బలే సింక్ లో ఉంటారు ఇద్దరు.. ఇప్పుడు పువ్వు సంగతి కూడా…
విక్రమ్ : ఇంకా ఎవరెవరికి తెలుసు.. అనగానే అందరు ఇటు తిరిగి “మా అందరికి తెలుసు బంగారం” అన్నారు.
పూజ : మాకు తెలీదు అనుకున్నావా? నేను రమ్యతొ బెట్ కట్టాను కూడా, నువ్వు మొదటి సారి మానసని చూసినప్పుడే అనుకున్నా నేను ఏమన్నాడు ఏమన్నాడు “ఇది మానస పని కాదు” హ హా హా…
అందరు నవ్వారు.
విక్రమ్ : అరవ్వే అరూ.. అందరికీ వినపడి మనల్ని ఇక్కడే పాతేస్తే సరిపోద్ది.
ఇంతలో నానీ మాదెగ్గరికి వచ్చాడు..
నానీ : అన్నా ఒక సారి ఇలా రా..
చందు : ఎల్లెల్లు చుట్టాలు పిలుస్తున్నారు..
చందు గాడిని చూసాను…
భరత్ : చూసింది చాలు వెళ్ళు.. (భరత్ గాడి వైపు చూడగానే) అటు తిరిగి ఎవరినో చూస్తూ .. చూసింది చాలు వెళ్ళు బాబు… అన్నాడు.. దానికి చందు వాళ్లంతా నవ్వుకున్నారు అమ్మ కూడా.. ఏం చేస్తాం అడ్డంగా దొరికిపోయాను అందుకే చిన్నగా నవ్వుతూ అక్కడనుంచి జారుకున్నాను…
………………………………………………………..
రమ : మానస ఇలా రా..
మానస : ఏంటక్కా?
రమ : విక్రమ్ ఇటే వస్తున్నాడు నేను చూడకుండా నెడతాను తన మీద పడిపో..
మానస : ఆమ్మో వద్దక్కా.. నాకు భయం.
రమ : భయం లేదు ఏం లేదు నువ్విలానే ఉంటే ఇక మీరు మాట్లాడుకోడానికి ఏడాది పడుద్ది.. రా చెప్తా అని మానస చెయ్యి పట్టుకు లాగింది.
రమ : నానీ ఓకే నా వెళ్ళు.. మేము రెడీ..
……………………………………………………….

Super story. Title chusi skip cheste super story.miss avutam. Pl continue and show your talent writer garu