ప్రేమ కథలు – Part 3 153

డిగ్రీ లో కాలేజీ టాపర్ అయ్యింది విద్య తనకి పెద్ద కళలు లేవు తన కుటుంబం తో కలిసి అలాగే సంతోషం గా ఉండాలి అని కాకపోతే కొన్ని రోజులు తను ఏమీ చేసిన ఎవరూ పట్టించుకోకుడదు తన బెస్ట్ ఫ్రెండ్ పింకీ లాగా posh గా మాడర్న్ డ్రస్లు వేసుకొని ఒక కార్ లో సొంతం గా షికారు కు వెళ్లాలి అని అనుకుంది దాంతో పాటు తన కుటుంబం తనకి చాలా ముఖ్యం, ఆ మరుసటి రోజు ఉదయం తను లేచి చూస్తే ఇంట్లో హడావిడి గా ఉంది ఎందుకంటే ఆ రోజు విద్య కీ నిశ్చితార్థం అన్నారు తనకి చెప్పకుండా ఇలా పెళ్లి నిశ్చయించడం తనకి అసలు నచ్చలేదు కానీ తన కుటుంబం లో అందరూ సంతోషంగా ఉండడం చూసి తను కొంచెం ఆలోచిస్తూ ఉంది అప్పుడే తన చెల్లి వచ్చి “అక్క బావ ఫోటో కావాల” అని ఏడిపిస్తూ ఉంది కానీ విద్య అది ఏమీ పట్టించుకోకుండా ఉంది ఆ తర్వాత వాళ్ల పిన్ని, అమ్మ, అత్త అందరూ వచ్చి తనని రెడీ చేసారు ఇంతలో అబ్బాయి వాళ్లు వచ్చారు అని అందరూ కిందకి వెళ్లారు అప్పుడు విద్య దొంగ చాటుగా కిటికీ నుంచి కిందకు చూసింది అప్పుడు కార్ లో నుంచి దిగాడు వినయ్ ఒకసారి వినయ్ నీ చూసి షాక్ అయ్యింది అంతే గుండె లో ఆనందం పొంగింది విద్య ఆ నిశ్చితార్థం అయ్యాక వినయ్ తన జీవితంలోకి రావడం ఆనందం గా ఉంది అప్పుడే వినయ్ విద్య కీ ఫోన్ చేసి రేపు కళ్లుదాం అని అడిగాడు విద్య గుడికి రమ్మని చెప్పింది ఇద్దరు గుడి లో కలిశారు.

అప్పుడు వినయ్ ఏమీ చెప్తాడు అని ఆలోచిస్తూన్న విద్య కీ వినయ్ సడన్ గా “నాకూ పెళ్లి ఇష్టం లేదు నాకూ అసలు పెళ్లి అంటేనే ఇష్టం లేదు నేను పెళ్లి చూపులు అంటే రాను అని మా జేనాన్న హార్ట్ ఎటాక్ వచ్చినట్లు నాటకం ఆడి నను పిలిచి బలవంతంగా నిశ్చితార్థం చేశారు ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లి నేను నీతో misbehave చేశాను అని చెప్పు తాగుబోతు అని చెప్పు మీ వాళ్లు పెళ్లి కాన్సిల్ చేస్తారు “అని చెప్పాడు వినయ్ చెప్పింది విని విద్య కీ బ్రైన్ ఆగిపోయింది దాంతో కొంచెం తెరుకోని “చూడండి మీ ఫ్యామిలీ కీ మా ఫ్యామిలీ కీ ఊరి లో మంచి పేరు ఉంది కాబట్టి ఇలా చేస్తే పెళ్లి ఆగినందుకు మా ఫ్యామిలీ లో వేరే ఎవరికి పెళ్లి కాదు మీ కారెక్టర్ చెడ్డది అని తెలిస్తే మీ నాన్న పరువు పోతుంది కాబట్టి ఏమీ చేయాలో నువ్వే చెప్పు” అని అడిగింది దానికి వినయ్ తన ఫ్రెండ్ ఒక లేడి లాయర్ కీ ఫోన్ చేసాడు జరిగింది చెప్పి రమ్మని చెప్పాడు అప్పుడు ఆమె వచ్చి ఇద్దరికి రెండు డాక్యుమెంట్ లు ఇచ్చి “మీరు ఇద్దరు ఫ్యామిలీ pressure మీద పెళ్లి చేసుకుంటున్నారు అని మీకు పెళ్లి ఇంటరెస్ట్ లేదు అని పెళ్లి తరువాత ఎలాంటి మానసిక లేదా శారీరక సంబంధం మా మధ్య ఉండదు 6 నెలల తరువాత విడాకులు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇద్దరం ఇష్ట పూర్వకంగా ఈ అగ్రిమెంట్ లో సంతకం పెడుతున్నాం” అని రాసి ఉంది అది చూసి వినయ్ ఏ మాత్రం ఆలోచించకుండా సంతకం పెట్టాడు దాంతో విద్య కూడా వేరే దారి లేక సంతకం పెట్టింది అలా ఒక వారం కీ వాళ్ల పెళ్లి అయ్యింది మొదటి రాత్రి రోజు కూడా విద్య బెడ్ పైన పడుకుంటే వినయ్ పక్కన సోఫా లో పడుకున్నాడు.

ఇలా ఆలోచిస్తున్న విద్య ఫోన్ మొగడంతో బయటికి వచ్చింది అప్పుడు విద్య వాళ్ల నాన్న ఫోన్ చేసాడు “బుజ్జి మీ ఇల్లు ఎక్కడ అమ్మ” అని అడిగాడు, “ఇది sector 16 అంటారు నాన్న ఇక్కడ గురుమీత్ రెసిడెన్షియల్స్ నాన్న ఎందుకు నాన్న” అని అడిగింది, “ఏమీ లేదు రా నిను చూడకుండా కష్టం గా ఉంది అందుకే బావ గారు మేము అంతా కలిసి వస్తున్నాం ఎయిర్ పోర్ట్ లో బయలుదేరాం” అని చెప్పాడు అది విని విద్య షాక్ అయ్యింది వినయ్ పెట్టిన మొదటి రూల్ ఆ ఇంటికి చుట్టాలు ఎవరూ రాకూడదు.

ఎప్పుడైతే వాళ్ల అమ్మ నాన్న అందరూ వస్తున్నారు అని ఫోన్ చేశారో అప్పుడు విద్య కీ ఏమీ చేయాలో తెలియక రెడీ అయ్యి బయటకు వస్తే అప్పుడే వినయ్ తన రూమ్ నుంచి కిందకు దిగుతు వస్తున్నాడు విద్య నీ “నాకూ ఆఫీస్ కీ టైమ్ అయ్యింది నేను వెళ్లాలి ఇంట్లో సరుకులు లేవు అనుకుంట మన కాలనీ నుంచి అలా ముందుకు వెళితే సూపర్ మార్కెట్ ఉంటుంది ఏమీ కావాలి అన్న తెచ్చుకో నీకు కార్ డ్రైవింగ్ వచ్చు కదా కార్ ఉంటుంది వాడుకో” అని చెప్పి గ్యారేజ్ లో ఉన్న తన బైక్ తీసుకొని ఆఫీసు కీ వెళ్లిపోయాడు వినయ్ దాంతో విద్య కొంచెం ఊపిరి పీల్చుకుంది వినయ్ అలా ఆఫీస్ వెళ్లగానే విద్య ఫ్యామిలీ, వినయ్ ఫ్యామిలీ అంతా ఇంటికి వచ్చారు అసలు నిజానికి వినయ్ అక్కడ 7 సంవత్సరాల నుండి పనిచేస్తున్న తన అమ్మ నాన్న నీ ఏ రోజు తన ఇంటికి రానివ్వలేదు అందుకే మొదటిసారి తన కొడుకు ఇంటికి రావడంతో ఇళ్లు మొత్తం చూసి మురిసి పోయారు, ఇలా ఇళ్లు మొత్తం సందడి సందడిగా మారింది దాంతో విద్య లో కొంచెం ధైర్యం పెరిగింది ఆ తర్వాత తన ఫోన్ లో ఫేస్ బుక్ చూస్తూ ఉంటే తనకి ఒక నోటిఫికేషన్ కనిపించింది దాంతో వెంటనే పక్కింటి సర్దార్జీ దగ్గరికి వెళ్లి “సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్లాలి ఆంటీ నీ తోడు పంపిస్తారా” అని అడిగింది దానికి ఆయన కూడా వాళ్ల భార్య నీ విద్య తో సూపర్ మార్కెట్ కీ పంపారు.

కార్ లో వెళ్తున్నంత సేపు సూపర్ మార్కెట్ లో తిరుగుతున్నంత సేపు ఆమె బాగానే మాట్లాడింది కానీ మాటిమాటికి “ముండియా (పంజాబీ లో అమ్మాయి అని అర్థం)” అని పిలుస్తుంటే విద్య కీ చిరాకుగా అనిపించింది అంటే దాని అర్థం తెలియక ఏదో తీడుతుంది అనుకుంది ఆ తర్వాత ఇంటికి వెళ్లి అందరితో సరదాగా సాయంత్రం వరకు గడిపింది, ఇక్కడ వినయ్ పరిస్థితి వేరేగా ఉంది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు ఇష్టం లేని ఉద్యోగం ఇష్టం లేని లైఫ్ కాకపోతే ఇంకో రెండు నెలల తరువాత ఆ కంపెనీ తో కాంట్రాక్ట్ అయిపోతుంది దాంతో పాటు ఇప్పుడు తను చేస్తున్న ప్రాజెక్ట్ లో తనకి 40% partnership వస్తుంది అందుకే ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా పూర్తి చేయాలని ఉన్న స్టాఫ్ నీ 4 నెలల నుంచి పని రాక్షసుడు లాగా పీడిస్తున్నాడు రెండు వారాలు తను ఆఫీస్ కీ రాక పోయేసరికి ఎక్కడి పని అక్కడే ఆగిపోయింది అసలు trail submission కూడా అవ్వలేదు దాంతో తన స్టాఫ్ సాలరీ సగం కట్ చేసి ఆ submission తనే చేశాడు ఆ తరువాత ఎవరికి రెండు నెలల పాటు సెలవు ఉండదు అని తేల్చి చెప్పాడు ఎవరూ ఎవరూ అయితే పని ఏగోటారో వాళ్ళని పని పూర్తి అయ్యే వరకు రాత్రి ఆయన సరే అక్కడే ఉండి పని చేయాలి అని రూల్ పెట్టాడు.