ప్రేమ కథలు – Part 3 153

వినయ్ ఎవరితో ఎంత కఠినంగా ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీ రామ్ తో మాత్రం ఎప్పుడు సరదాగా ఉంటాడు వాడితోనే అని పంచుకుంటాడు ఆ రోజు ఆఫీస్ అవ్వగానే హవేలి అనే హోటల్ లో మేనేజర్ గా పనిచేసే శ్రీ రామ్ దగ్గరికి వెళ్లి కలిశాడు ఇద్దరు కొద్ది సేపు మాట్లాడుకున్నాక “జీవితం లో పెళ్లి చేసుకోను అన్నావు ఇప్పుడు ఎమ్ అయ్యింది నీ దరిద్రం కొద్ది నువ్వే పెళ్లి చేసుకున్నావు సరే కానీ ఎప్పుడు పరిచయం చేస్తావ్ తనని” అన్నాడు దానికి వినయ్ “సండే ఇంటికి రా నువ్వు మమత రండి పరిచయం చేస్తా” అన్నాడు ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్లాడు లోపలికి వెళ్లగానే తనకి ఇష్టం అయిన చేపల పులుసు వాసన తగిలింది దాంతో వినయ్ కొంచెం కూల్ అయ్యాడు అంతే కిచెన్ లోకి వెళ్లి రెండు పీస్ లు ప్లేట్ లో వేసుకొని ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అప్పటి వరకు ఇంట్లో పరిస్థితి ఏమాత్రం పట్టించుకో లేదు తనకి నచ్చింది తన కళ్ల ముందు ఉంటే ప్రపంచం తో సంబంధం లేకుండా బ్రతికేస్తాడు వినయ్ ఆ తర్వాత అప్పుడు చూశాడు తన ఇల్లు మొత్తం exhibition గ్రౌండ్ లాగా అంత మంది తో నిండిపోయింది దాంతో అంత సేపు ఉన్న ప్రశాంతత మొత్తం పోయింది దాంతో చిరాకు గా తన రూమ్ లోకి వెళ్ళాడు అప్పుడు విద్య బట్టలు మార్చుకుంటు కనిపించింది దాంతో కొద్ది సేపు బయట ఉన్నాడు ఆ తర్వాత విద్య బయటికి భయపడుతూ వచ్చింది.

” సారీ నాకూ తెలియదు వాళ్లు వస్తున్నారు అని సడన్ మార్నింగ్ ఎయిర్ పోర్ట్ లో ఉన్నాము అడ్రస్ చెప్పు అంటే ఇంక ఇలా వచ్చేసారు” అని చెప్పింది అ తరువాత ఆ ఆంటీ అన్న పదం గురించి అడిగింది దానికి వినయ్ అర్థం చెప్తే విద్య కొంచెం cool అయ్యింది ఇంకో రెండు రోజులు అమ్మ నాన్న వాలు ఉంటారు అనింది, దాంతో వినయ్ తన ఫోన్ తీసి రేపు ఉదయం 5 గంటల ఫ్లయిట్ కీ టికెట్ లు బుక్ చేసి వాళ్ల నాన్న కీ పంపించాడు అది చూసి ఆయన షాక్ అయ్యి వినయ్ తో మాట్లాడడానికి వెళ్లాడు “రేయ్ ఏంటి రా ఇది కనీసం రెండు రోజులు అయిన ఉండకుండా వెళ్లిపో అంటున్నావు ఎప్పుడు రానీయకుండా ఇపుడు వస్తే వెనకు పంపుతున్నావు” అని అన్నాడు దానికి వినయ్ “ఏదో పెద్ద నా మీద ప్రేమ ఉన్నట్లు నటించింది చాలు ఈ నెల బ్యాంక్ లోన్ కట్టడం లేట్ అయ్యింది అనే కదా నీ ఏడుపు రేపు కట్టేస్తా ఇంకో సారి నాకూ చెప్పకుండా వస్తే చంపేస్తా నువ్వు మీ నాన్న ఉన్న ఆస్తి మొత్తం దాన ధర్మాలు చేశారు నాకూ తినడానికి తిండి లేక చేశారు పేరు కీ జమీందారు కుటుంబం కాని పైన ఏమీ లేదు నీ వల్ల నా కలలు అని చంపుకొని బతుకుతున్నా మళ్లీ ఇక్కడికి రావ్వోదు ఇక్కడ నను ప్రశాంతంగా ఉండనివ్వు “అని చెప్పి తన రూమ్ లోకి వెళ్లి పడుకున్నాడు.

రాత్రి 12 కీ విద్య వినయ్ రూమ్ కొట్టి లేపింది వినయ్ నిద్ర మబ్బులో లేచి డోర్ తీసి చూస్తే అందరూ హ్యాపీ బర్త్ డే అని అరిచారు (పొద్దున ఫేస్ బుక్ లో చూసిన విషయం ఇదే) అప్పుడు వినయ్ అందరినీ చూసి విద్య నీ గట్టిగా లాగి కొట్టి వెళ్లి పడుకున్నాడు,అది చూసి విద్య కుటుంబం వినయ్ అమ్మ నాన్న అంతా షాక్ అయ్యారు పెళ్లి అయిన వారం కీ తన కూతురిని ఏడిపించాడు అని బాధ తో ఉదయం ఫ్లయిట్ కీ అందరూ తిరిగి వెళ్లిపోయారు కానీ విద్య మైండ్ లో ఒకటే ఆలోచన ఉంది.

(కొన్ని రోజుల క్రితం)

ఒక రోజు విద్య గుడికి వెళ్లి “దేవుడా నాకూ ఒక మంచి అబ్బాయి నీ నా జీవితంలోకి పంపు నా ఫ్రెండ్స్ కీ అందరికీ ఉన్నారు నాకూ ఒకడిని ఇవ్వు” అని కళ్లు మూసుకుని దండం పెట్టుకుని ఉంటే అప్పుడే పూజారి “శతమానంభవతి పండంటి పిల్లలతో సంతోషంగా ఉండండి” అని ఆశీర్వదించాడు అప్పుడు కళ్లు తెరిచి చూసిన విద్య పక్కన ఉన్న వినయ్ నీ చూసి అలాగే ఉండి పోయింది దానికి వినయ్ సారీ చెప్పి వెళ్లాడు అప్పటి నుంచి వినయ్ నే దేవుడు తన కోసం పంపాడు అని అనుకుంటుంది విద్య.

రాత్రి జరిగిన విషయం తలుచుకుంటు విద్య అలాగే సోఫా లో పడుకొని ఆలోచిస్తూ ఉంది వినయ్ ఆఫీస్ కీ టైమ్ అయ్యింది అని కిందకి వచ్చి తన వరకు తాను టిఫిన్ వండుకోని తిని వెళ్లిపోయాడు ఇది ఏమీ విద్య పట్టించుకోలేదు, వినయ్ కూడా విద్య గురించి పట్టించుకోలేదు ఆ తర్వాత ఎవరో కాలింగ్ బెల్ కోడితే వెళ్లి తీసింది ఒక డెలివరీ బాయ్ వచ్చి ఒక పార్శిల్ ఇచ్చి వెళ్లాడు అది విద్య పేరు మీదే వచ్చింది తీసి చూస్తే ఒక చీర ఉంది దాంతో పాటు ఒక లెటర్ ఉంది అందులో.