ప్రేమ కథలు – Part 3 152

శిల్పా కౌర్ వినయ్ పని చేసే కంపెనీ CEO అంటే ఆ కంపెనీ వాళ్ల నాన్నది ఆయనకి దాంట్లో 60 percent షేర్లు ఉండటం వల్ల ఆయన తరువాత శిల్పా CEO అయ్యింది తనకి ఏదైనా వెండి పళ్లెం లో దొరకడం తో తనే గొప్ప మిగిలిన వాళ్లు తన బానిసలు అనే మనస్తత్వం తనది దాంతో ఎవరిని లేక చేయదు ఒక సారి ప్రాజెక్ట్ మీటింగ్ బెంగళూరు బ్రాంచ్ కీ వెళ్లినప్పుడు వినయ్ నీ చూసింది అందరూ తనకి లేచి నిలబడి రెస్పెక్ట్ ఇస్తుంటే వినయ్ ఏమీ పట్టనట్లు కూర్చుని ఉన్నాడు దాంతో శిల్పా కీ వాడి పొగరు నచ్చలేదు దాంతో ప్రాజెక్టు మీటింగ్ లో వినయ్ ఇచ్చిన presentation బాగాలేదు అని చెప్పింది దానికి వినయ్ తన ముందు ఉన్న బాటిల్ లో నీళ్లు శిల్పా మీద పోసి వెళ్లిపోయాడు (జాబ్ నుంచి తీసేస్తారు అని అలా చేశాడు కావాలి అనే) కానీ శిల్పా కీ వినయ్ attitude, ధైర్యం అని నచ్చాయి దాంతో ప్రమోషన్ ఇచ్చి చండీగఢ్ కీ తెప్పించింది, అప్పటి నుంచి తన ప్రేమ నీ పొగరు గానే చెప్పింది కానీ వినయ్ పట్టించుకోవడం లేదు దాంతో శిల్పా కీ బాధ అంటే ఏంటో అర్థం అయ్యింది ముందు లాగా ఉండలేక పోతుంది తనని చూసిన వాళ్ల అమ్మ అడిగింది ఏంటి సమస్య అని శిల్పా మొత్తం చెప్పింది దాంతో వాళ్ల అమ్మ “ప్రేమ అనేది నిస్వార్థం తో కూడుకున్నది దాని నువ్వు చెప్పిన అతను అర్థం చేసుకోలేదు అంటే అతనికి నీ పైన కానీ ప్రేమ మీద నమ్మకం ఇష్టం లేదని కాబట్టి నీ ప్రేమ unconditional నువ్వు ఏమీ ఆశించాల్సిన పని లేదు నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు తనకు అర్థం అయ్యేలా చూడు అర్థం కాకపోయినా ఒక జ్ఞాపకం లాగా అయిన మిగులుతుంది ” అని చెప్పింది శిల్పా అప్పటి నుంచి వినయ్ నీ దూరం నుంచి చూస్తూ ప్రేమించడం మొదలు పెట్టింది తన పద్ధతి పూర్తిగా మారిపోయింది కొత్తగా తనకు తానే కనిపించడం మొదలైంది.

అలా డిన్నర్ చేస్తుండగా వినయ్ ఇంకా రాలేదు అప్పుడు వాళ్లలో వాళ్లే మాట్లాడుతూ ఉండగా శిల్పా విద్య తో

శిల్పా : vidya I pitty you

విద్య : Excuse me what are you talking

శిల్పా : చూడు ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం వినయ్ నీ పెళ్ళి అయిన దగ్గరి నుంచి నిన్ను టచ్ చేశాడా పోనీ ఇలా చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అని నీకోసం ఏమైనా చేసాడా వాడి కోసం నువ్వు ఎమైన చేస్తే మెచ్చుకున్నాడా వాడికి వాడే ముఖ్యం మనం ఎవ్వరం అవసరం లేదు వాడికి కావాల్సింది వాడి సంతోషం అంతే అని చెప్పింది

దానికి విద్య మమత, శ్రీ రామ్ వైపు చూసింది దాంతో వాళ్లు కూడా అవును అన్నట్లు తల ఊప్పారు “నిజం వదిన అన్నయ్య కీ ఎప్పటికైనా మొదటి preferance వాడే వాడు సంతోషంగా ఉండాలి అంటే ఏమైనా చేస్తాడు” అని చెప్పింది అప్పుడే వినయ్ వస్తే అందరూ సైలెంట్ అయ్యారు అప్పుడు విద్య వినయ్ చేతికి రక్తం రావడం గమనించింది అంతే తన చీర చింపి వినయ్ చేతికి కట్టింది శ్రీ రామ్ “ఏమైందిరా ఆ రక్తం ఏంటి “అని అడిగాడు కానీ వినయ్ సైలెంట్ గానే ఉన్నాడు ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్తుండగా కొంతమంది అబ్బాయిలు దెబ్బలతో పడి ఉన్నారు దాంతో అర్థం అయ్యింది చేతికి రక్తం ఎలా వచ్చిందో (విద్య హోటల్ లోకి వస్తున్నప్పుడు తన పైన కామెంట్ చేయడం వినయ్ చూశాడు అందుకే తరువాత వెళ్లి కొట్టాడు) అప్పుడు శ్రీ రామ్ అక్కడ పడి ఉన్న ఒక్కడిని చూసి షాక్ అయ్యాడు అక్కడ ఉన్న వాడి పేరు ప్రిన్స్ ఇండియన్ బాక్సింగ్ చాంపియన్ అంతేకాకుండా MMA(mixed martial arts) లో కూడా బెస్ట్ ఫైటర్ ఇంటర్నేషనల్ గా ఇండియా నీ represent చేశాడు.

దాంతో వెంటనే శ్రీ రామ్ వినయ్ నీ కార్ లో కూర్చోబేటి వినయ్ బైక్ తీసుకొని వాడి ఇంటికి వెళ్లాడు ఇంట్లోకి వెళ్లగానే “రేయ్ పిచ్చి నా కోడకా నీకు కోపం వస్తే ఎవరినైన కోడతావా వాడు celebrity రా” అని తీడుతు ఉన్నాడు అప్పుడు విద్య వినయ్ తన కోసం ఒక్కడిని కొట్టాడు అని ఆనందం లో వినయ్ కీ పెదవి పైన ముద్దు పెట్టింది దానికి శిల్పా షాక్ అయ్యింది ఈ సారి అప్పుడే కాలింగ్ బెల్ మొగడంతో వెళ్లి తలుపు తీశాడు శ్రీ రామ్ వాడిని పక్కకు తోసి లోపలికి వచ్చింది యశోద ఆమెను చూడగానే మమత “అమ్మ నువ్వు ఏంటి ఇక్కడ” అని అడిగింది కానీ వినయ్ లేచి “పిన్ని ఏంటి లేట్” అని కౌగిలించుకోబోతుంటే కొట్టింది దాంతో వినయ్ నవ్వుతూ hug చేసుకున్నాడు ఆమె నీ అప్పుడు విద్య “మమత మీ అమ్మ బెంగళూరు లో కాకుండా మీతో ఉంటుందా” అని అడిగింది అవును అని తల ఆడించింది మమత “అవును మీ నాన్న ఎప్పుడు కనిపించరు ఎక్కడ ఉంటారు” అని అడిగింది విద్య దానికి మమత తన చిన్నప్పటి ఫోటో చూపించింది అందులో వినయ్ వాళ్ల నాన్న నీ చూసి షాక్ అయ్యింది విద్య “మా ఇద్దరికీ తల్లి వేరు తండ్రి ఒక్కడే “అని చెప్పింది మమత.