ప్రేమ కథలు – Part 3 153

( పెళ్లి)

(ఫ్రెండ్స్ ఈ కథ నీ నేను చండీగఢ్ బ్యాక్ డ్రాప్ లో రాస్తున్నా అప్పుడప్పుడు మన సౌకర్యం కోసం అంతా తెలుగు లోనే రాస్తున్న ఈ కథ లో ఎలాంటి adult content ఉండదు ప్యూర్ లవ్ స్టోరీ ఇంక కథ లోకి వెళితే)

చండీగఢ్ ఎయిర్ పోర్ట్ లో ఫ్లయిట్ దిగి కాబ్ లో ఇంటికి వెళ్తున్నారు విద్య, వినయ్ పేరు కీ కాబ్ లో పకపక నే కూర్చుని ఉన్న విద్య నుంచి దూరం గా జరిగి కూర్చున్నాడు వినయ్, విద్య ఆ దూరం తొందరగా కరిగి పోవాలి అని ఎదురు చూస్తుంది అప్పుడు కార్ కిటికీ నుంచి అలా బయటకు చూసింది చాలా అందమైన సిటీ అంత అందమైన సిటీ తను ఎప్పుడు చూడలేదు అనే కంటే తను తన ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు అని అనడం లో న్యాయం ఉంది ఎప్పుడు తన సొంత ఊరు దాటి మహా అయితే తీర్థ యాత్రకు తీసుకొని వెళ్లే వాలు తన అమ్మ నాన్న అప్పుడే కార్ ఒక మంచి posh కాలనీ లో ఆగింది వినయ్ కాబ్ వాడికి డబ్బులు ఇస్తూ ఉంటే విద్య మొత్తం కాలనీ నీ చూస్తూ ఉంది అలాంటి ఒక posh కాలనీ తన జీవితంలో తను చూడలేదు అప్పుడు వినయ్ తన వైపు చూసి చిటికె వేసి లోపలికి పద అని సైగ చేశాడు అప్పుడే వినయ్ పక్క ఇంట్లో ఉండే ఒక సర్దార్జీ అలా వాకింగ్ కోసం బయటికి వచ్చాడు అప్పుడు వినయ్ నీ పలకరించాడు అప్పుడు “ఎవరూ ఆ అమ్మాయి” అని అడిగాడు, దానికి వినయ్ “నా భార్య” అని బదులు ఇచ్చాడు విద్య కూడా ఎంతో మర్యాదగా ఆయనకు నమస్కారం పెట్టింది అంతే ఆ సర్దార్జీ మొత్తం కాలనీ అంతటికి వినిపించేలా “ఏంటి వినయ్ నీ పెళ్ళి కీ పిలవలేదు” అని అన్నాడు దాంతో ఎదురింటి వాళ్లు పక్క ఇంటి వాళ్లు అంత వినయ్ ఇంటి ముందు కీ చేరుకున్నారు అందరూ ఒకటే ప్రశ్న పెళ్లి కీ ఎందుకు పిలవలేదు అని వినయ్ మనసులో “నా పెళ్లి అని నాకూ తెలిస్తే నే కదా మీకు చెప్పడానికి” అని అనుకున్నాడు, కానీ బయటికి మాత్రం నవ్వుతూ ఉన్నారు ఆ సర్దార్జీ భార్య వినయ్ విద్య ఇద్దరికి దిష్టి తీసి లోపలికి పంపింది విద్య కీ ఒక్కసారిగా తన సొంత ఊరు ఫీలింగ్ వచ్చింది.

కానీ ఇంటి లోపలికి వెళ్లగానే బయటి వాతావరణం కీ లోపల చాలా తేడా ఉంది అంత పెద్ద ఇంట్లో మొత్తం నిశబ్దం రాజ్యం ఏలుతుంది ఆ నిశబ్దం విద్య కీ కొత్తగా ఉంది ఎందుకంటే తనది చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబం ఎప్పుడు ఇంట్లో బాబాయ్ పిల్లలు, తన అత్త పిల్లలు అందరితో కలిసి అల్లరి చేస్తూ సందడిగా ఉండే తన ఇంటి వాతావరణం కీ ఈ ఇల్లు చాలా తేడా ఉంది అప్పుడు వినయ్ వచ్చి “నీ రూమ్ అది నా రూమ్ పైన ఉంది ఇంక అది కిచెన్ దాంట్లో మధ్య లో లైన్ వేస్తా నీ సైడ్ వంట నువ్వు చేసుకో నా సైడ్ వంట నేను చేసుకుంటా ఇంట్లో మాత్రం ఫ్రీ గా ఉండు నా రూమ్ లోకి మాత్రం రాకూడదు ఈ 6 నెలల పాటు ఏదైన కోర్సు చేస్తావో లేదా ఇంట్లోనే ఉంటావో నీ ఇష్టం కానీ నాకూ ఇబ్బంది పెట్టోదు”అని చెప్పి పైన తన రూమ్ కీ వెళ్లాడు విద్య కూడా తన రూమ్ లోకి వెళ్లి బాత్రూమ్ లో షవర్ కింద తడుస్తూ రెండు వారాల క్రితం వరకు తన జీవితం ఎలా ఉండేదో ఊహించుకుంటు ఉంది.

(రెండు వారాల క్రితం)