“మరి…..”
“టీస్ చేస్తున్నానే……”
ఎం మాట్లాడలేదు.
“ఇంతే అలాగే చూస్తున్నావ్ ??”
“చి…… నీ మీద కోపం తెచ్చుకోవాలన్న కోపం రావట్లేదు…..”
నేను నవ్వాను.
“చి నాకు కూడా నవ్వే వస్తుంది” అని నవ్వటం స్టార్ట్ చేసి చేయి నోటి దగ్గర పెట్టుకుంది నవ్వు దాచుకోవటానికి.
తన చేయిని తీసాను కానీ సిగ్గు మాత్రం ఫుల్ రేంజ్ లో ఉంది…… తన రెండు బుగ్గల పై చేయి వేసి ఇద్దరం కళ్ళలోకి చూసుకుంటూ ఉన్నప్పుడు “ఐ లవ్ యు స్వీటీ…….”
“ఐ లవ్ యు టూ సంజు…..”
ఐ ఇద్దరం హాగ్ చేసుకున్నాం.
“మళ్ళా తర్వాత చెప్పుకోగలమో లేదో….” అన్నాను.
కౌగిలినుంచి స్వీటీ బయటకు వచ్చి నన్ను చిరు కోపంతో చూసింది.
“కోపం రావట్లేదు కదా ??” అన్నాను.
వెంటనే నవ్వేసి మళ్ళా హాగ్ చేసుకుంది.
ఆ తర్వాత ఇద్దరం చక్కగా స్నానం చేసి బయటకు వచ్చి ఇందాకటి బట్టలు వేసుకున్నాం. తను నల్ల చీర, నేను కొత్త డ్రెస్సు వేసుకున్నాం.
ఇద్దరం బయటకు రాబోతుంటే స్వీటీ నన్ను ఆపి “సంజు…. ఇక్కడే ఉండు 10 మినిట్స్” అంది.
నాకర్ధం కాలేదు.
“సుర్ప్రైస ??” అని అడిగాను.
“ఎం లేదు సంజు….. బయట అంత రెడీ చేసి పిలుస్తాను” అంది
“ఒకే” అని నేను రూమ్ లో మంచం పై కూర్చున్నాను.
స్వీటీ బయటకు వెళ్లి రూమ్ డోర్ వేసింది. అక్కడే మంచం మీద కూర్చొని ఈ రోజు నిన్న జరిగిన విషయాలన్నీ ఆలోచిస్తూ ఉహలలో వివాహరిచ్చాను. మా ఇద్దరి మధ్య బంధం గురించి మా ఫ్యూచర్ గురించి ఆలోచించాను. ఈ లోగ బెడ్ పక్కన పడున్న చాక్లెట్ కవర్లు తీసి సమకూర్చి గుర్తుగా నా కప్ బోర్డు లో పెట్టాను. దాన్ని తర్వాత ఒక చిన్న కవర్లో వేసి ఆ కవర్లోనే ఈ రోజు గురించి ఒక చిన్న స్లిప్ రాసి మేము తెచ్చిన రౌండ్ బాక్స్ లో వెయ్యాలి అనుకున్నాను.
ఈ లోపల స్వీటీ నన్ను పిలిచింది. బయటకొస్తే లైట్స్ అన్ని ఆపేసి అంత డిం గా ఉంది. చాల చాల రొమాంటిక్ గా ఉంది.
స్వీటీ కాండిల్స్ ఆన్ చేసి పెట్టింది.
నా చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ మీద నీట్ గా ఒక తెల్ల గుడ్డ వేసి రెస్టారంట్ లో లాగా ఉంది. గాజు గ్లాస్ లో నీళ్లు పోసి, నాకు తనకి కూర వడ్డించి బాక్స్ లో నుంచి రోటి తీసి ఇద్దరి ప్లేట్ లో వడ్డించింది.
నా కోసం అన్ని మళ్ళా వేడిచేసింది. చక్కని వాసన వస్తుంది. వాసనా చూస్తేనే చాల చాల రుచిగా అనిపించాయి.
“సంజు….. తిని ఎలా ఉందొ చెప్పు….. బాలేకపోయిన పర్లేదు…..” అందు
రోటి ముక్క తుంచి కొంచెం వేడి వేడిగా ఉన్న కర్రీ లోకి వడ్డించుకొని నోట్లో పెట్టుకున్నాను. రోటి కొంచెం సాగిన కూరలో వేసుకొని తింటే చాల బాగుంది. స్వీటీ చేసింది కాబట్టి దాని రుచి ఇంకా పెరిగింది. ఒక సరి కళ్ళు మూసుకొని ఎంజాయ్ చేస్తూ “hmmmmm…” అంటూ తిన్నాను.
కళ్ళు తెరిచి స్వీటీని చూసాను. నన్నే ఇబ్బందిగా చూస్తుంది.
“స్వీటీ నిజం చెప్తున్నాను…… చాల చాల బాగుందే….నిజంగా చాల బాగా చేసావ్…..”
“థాంక్స్ సంజు…..” అంది
“అవునే ….. నాకెప్పుడూ చెప్పలేదు….. నీకివన్నీ వచ్చని…..”
“సంజు….. చెప్పను గా రెండు సార్లు కొంచెం కొంచెం చేసి ఫెయిల్ అయ్యాను అని…… మూడోసారి అన్ని సరిచేసి ఎక్కువ చేసాను……చాల బాగా కుదిరింది……”
“ఇలా వంట చేస్తే ……. ఉన్న ఫామిలీ ప్యాక్ ఇంకా పెద్దదిగా అవుతుంది…..” అన్నాను.
తను నవ్వింది.
