లవ్ స్టోరీ – అరేంజ్డ్ మ్యారేజ్ 5 81

“స్వీటీ నువ్వు కూడా తిను….. చల్లారిపోతుంది” అన్నాను.

ఇద్దరం తినటం స్టార్ట్ చేసాము. ఇంకా ఒక రెండు మూడు వెరైటీలు కూడా చేసింది. ఇద్దరం ఒకళ్లనొకళ్ళం చూసుకుంటూ అలా కాండిల్స్ మధ్య రొమాంటిక్ గ తిన్నాము. స్వీటీ చాల చాల అందంగా కనిపించింది.

నెమ్మదిగా ఇద్దరం తినేసి చేతులు కడుక్కుని సోఫా లో కూర్చున్నాం. నేను స్వీటీ వైపు చూసి “బెస్ట్ డిన్నర్….తిన్నని ఈ రోజు…..” అంటూ తనకో ముద్దిచ్చాను.

నాకు గుర్తొచ్చి ఫ్రిడ్జ్ లోపల మేము మొన్న తెచ్చిన కోన్ ఐస్ క్రీమ్స్ తీసుకొని వచ్చి స్వీటీ చేతికి ఇచ్చాను.

కవర్ లోపల చూసింది.

“తిందామా ??” అన్నాను.

నన్ను చూసి నవ్వి ఒకే అంటూ తలూపింది.

ఒక కోన్ ఓపెన్ చేసి నేను ఒక ముక్క కొరికి స్వీటీకిచ్చాను. తాను నన్నే చూస్తూ ఇంకో ముక్క కొరికింది. ఇద్దరం ఐస్ క్రీం షేర్ చేసుకొని లాస్ట్ వరకు తిన్నాము. కోన్ ఐస్ క్రీం లాస్ట్ కి వచ్చింది.

తనకి చాక్లెట్ ఇష్టం కాబట్టి తన ఫోకస్ అంత చాక్లెట్ పైనే ఉంది…….

నేను కోన్ తిని చివర చాక్లెట్ నా చేతుల్లోనే ఉంది. తను నా చేతి నుంచి ఆ చాక్లెట్ తీసుకోబోయింది.

నేను “నేనే నీకు పెడతా” అన్నాను.

తన నోటి దగ్గరకు ఆ చాక్లెట్ ముక్కని తీసుకొని వచ్చాను తన “ఆ” అని నోరు తెరిచింది, వెంటనే నేను ఆ చాక్లెట్ తీసుకొని నేను తినేసాను.

తను చిరుకోపంతో ఆశ్చర్యపోయి…. నన్ను కొట్టింది.

“సంజు.. ….. నా చాక్లెట్ అది……”

నేను నవ్వుతు “అవును….చాల బాగుంది” అన్నాను.

నా పైకెక్కి నన్ను కొట్టడం స్టార్ట్ చేసింది నేను చేతులు అడ్డు పెట్టుకొని “అబ్బా ఆపవే…… రెండో కోన్ ఉంది గా…….” అన్నాను

నన్ను కొట్టడం ఆపి నన్నే చూసింది.

“కం ఆన్….. రెండు కోన్స్ లో నువ్వే తింటావా చాక్లెట్ ??” అన్నాను.

నన్ను అలాగే చూసింది.

“నువ్వు రెండో కోన్ గురించి మరచిపోయావు కదా ??” అన్నాను.

“అవును…”

“నువ్వే ఓపెన్ చేయి…..” అన్నాను.

“నీకి కోన్ ఇవ్వను….. నేనే తింటాను….”

“సరే నీ ఇష్టం…..”

“నాకన్నా నీకు చాక్లెట్ ఇంపార్టెంట్ కదా ??” అన్నాను.

చిరుకోపంతో “అవును” అంది.

తనే కోన్ తీసుకొని ఓపెన్ చేసుకుంది. నేను తన వైపు దొంగ చూపులు చూసాను.

తను నా వైపు చూసింది, నేను వెంటనే ఏమి తెలియనట్లుగా వేరే వైపు చూసాను.

తను నా దగ్గరకు జరిగి “సంజు…..” అని ప్రేమగా పిలిచింది.

నేను తన వైపు చూడలేదు.

“సంజు…..” అని మళ్ళి పిలిచింది.

నేను తన వైపు చూసి “వెళ్లి చాక్లెట్ తో కాపురం చేయి…..” అన్నాను చిరుకోపంతో.

“సారీ సంజు….. నాకు నువ్వే ఇంపార్టెంట్……చాక్లెట్ కన్నా”

“నేను హర్ట్ అయ్యాను……”

“ఎం కాదు….. నువ్వు నవ్వుతున్నావ్ …. నన్ను కావాలని ఆట పట్టిస్తున్నావ్…..”

“లేదు సీరియస్……” అన్నాను.

“సరే నువ్వే తిను ఈ చాక్లెట్ కూడా…….సారీ…..” అంది.

నేను నవ్వటం స్టార్ట్ చేసాను.

“నాకు తెలుసు…..” అని నవ్వుతు అంది.

ఇద్దరం నవ్వుకున్నాం.

ఇద్దరం కోన్ తినటం స్టార్ట్ చేసాము. కోన్ కరిగినందువల్ల ఐస్ క్రీం చాల సాఫ్ట్ గా ఉండేసరికి ఇద్దరం ఐస్ క్రీం నాకుతూ తిన్నాము.

చివరగా చాక్లెట్ మిగిలింది.

నేను తన వైపు చూసాను. నా చేతులు గట్టిగ పట్టుకుంది నేను మళ్ళా తినేస్తానని.